»   » టాలీవుడ్.. హాట్రిక్ పెయిర్స్ వీళ్లే (ఫోటో ఫీచర్)

టాలీవుడ్.. హాట్రిక్ పెయిర్స్ వీళ్లే (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమా అంటే అంచనాలు, అదృష్టం అంటూ సాగే గేమ్. ఈ గేమ్ ని అందరూ సేఫ్ గా ఆడాలని ప్రారంబిస్తారు. ముగింపు ఎలా ఉన్నా ప్రారంభంలో మాత్రం ముహూర్తం దగ్గర నుంచి హీరో ప్రక్కన హీరోయిన్ ఎంపిక దాకా అంతా మ్యాజిక్ నే ఆశ్రయిస్తారు. తమ హీరో ప్రక్కన గతంలో ఫలానా హీరోయిన్ చేస్తే ఆ సినిమా హిట్టైందంటే మళ్లి అదే హీరోయిన్ తో సినిమా ప్రారంభిస్తారు.

రెండో సారి కూడా ఆ పెయిర్ సూపర్ హిట్ అయితే ఇంకేముంది..మూడో సారి..అదే పెయిర్ తెరకెక్కి విజృంభించేస్తుంది. తెరపై మ్యాజిక్ చెయ్యటానికి ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి ఈ కాంబినేషన్ మంత్రని ప్రయోగిస్తూంటారు దర్శక,నిర్మాతలు. అయితే ఆ మ్యాజిక్ బిజినెస్ వరకూ ఉపయోగపడుతుంది.

థియోటర్ కి వచ్చిన తర్వాత సినిమాలో విషయముంటేనే ఆ పెయిర్ కి ఆదరణ దక్కుతుంది. అంతేకానీ అదే పెయిర్ ఏక్ట్ చేసారు కదాఅని హిట్ చేసి పారేయరు. కానీ థియోటర్ దాకా జనాల్ని లాక్కురావటానికి మాత్రం ఈ లక్కీ పెయిర్ గేమ్ వర్కువుట్ అవుతుంది. డిస్ట్రబ్యూటర్స్ సైతం హిట్ కాంబినేషన్ తో వస్తున్న చిత్రం అంటే ఆసక్తి చూపించటం కూడా ఓ కారణం. మన తెలుగులో రీసెంట్ గా హిట్టైన కొన్ని హాట్రిక్ కాంబినేషన్స్ వివరాలు క్రింద ఇచ్చాం.

హాట్రిక్ కాంబినేషన్ లు...స్లైడ్ షోలో...

సినిమాలు: ఏమి మాయ చేసావే, ఆటో నగర్ సూర్య (పోస్ట్ ప్రొడక్షన్ స్టేజి), మనం (షూటింగ్ లో)

సినిమాలు: ఏమి మాయ చేసావే, ఆటో నగర్ సూర్య (పోస్ట్ ప్రొడక్షన్ స్టేజి), మనం (షూటింగ్ లో)

నాగచైతన్య కెరిర్ లో మొదట హిట్ గా నిలిచిన చిత్రం ఏమి మాయ చేసావే. ఆ చిత్రంలో జెస్సీగా సమంత తెలుగు ప్రేక్షకులను ఓ రేంజిలో అదరకొట్టింది. ఆమెకు అదే తొలి చిత్రం. దాంతో ఆమె తెలుగులో ఓ రేంజిలో బిజీ అయ్యిపోయింది. స్టార్ హీరోలంతా ఆమె తమ సినిమాలో ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటిది...నాగచైతన్య కోరుకోవటంలో వింతేముంది.

సినిమాలు : భిళ్లా, మిర్చి, బాహుబలి(షూటింగ్ లో ఉంది)

సినిమాలు : భిళ్లా, మిర్చి, బాహుబలి(షూటింగ్ లో ఉంది)


అనుష్క, ప్రభాస్ తొలి కాంబినేషన్ ...భిళ్లా లో ఆమె అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సినిమా హిట్టైంది. దాంతో ప్రభాస్ తో ఆమెను మరోసారి మిర్చి లో జత కలిపారు. ఈ చిత్రంలోనూ వీరిద్దరు కాంబినేషన్ ప్రత్యేకంగా మాట్లాడుకునేలా నిలించింది. ఈ నేపధ్యంలో ఆమెను రాజమౌళి బాహుబలిలో తీసుకోవటానికి కారణమైంది.

సినిమాలు : సంతోషం, నేనున్నాను, బాస్ (గెస్ట్ రోల్), మనం(షూటింగ్ లో ఉంది)

సినిమాలు : సంతోషం, నేనున్నాను, బాస్ (గెస్ట్ రోల్), మనం(షూటింగ్ లో ఉంది)


ఈ వయస్సులో కూడా మన్మధుడులా వెలిగిపోతున్న నాగార్జున...సరసన శ్రియ మొదటి సారిగా దశరధ్ దర్శకత్వంలో సంతోషంలో చేసింది. ఆ చిత్రంలో ఆమె పాత్ర హైలెట్ గా నిలిచి..సినిమా సక్సెస్ లో భాగమైంది. తర్వాత వియన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన నేనున్నాను సైతం మ్యూజికల్ గా పెద్ద హిట్టైంది. దాంతో వీరిది..హిట్ పెయిరైంది. మరోసారి మనం అంటూ మ్యూజిక్ పంచటానికి సిద్దపడుతున్నారు.

 సినిమాలు : బృందావనం, రామయ్య వస్తావయ్యా(షూటింగ్ లో),రభస(పైప్ లైన్ లో...)

సినిమాలు : బృందావనం, రామయ్య వస్తావయ్యా(షూటింగ్ లో),రభస(పైప్ లైన్ లో...)

సమంత చూడగానే ప్రక్కింటి అమ్మాయిలా ఉండటం ఆమెకు ప్లస్ అయ్యింది. ఎన్టీఆర్ పూర్తిగా మాస్ హీరో..అతని ప్రక్కన కూల్ లుక్ ఉన్న అమ్మాయి అయితే చూడముచ్చటగా ఉంటుందని భావించి నిర్మాతలు బృందావనంలో ఎంపిక చేసారు. దాంతో ఆ జంట వర్కవుట్ అవటంతో...రామయ్య వస్తావయ్య, రభసలో బుక్ చేసారు. ఈ సినిమాలు కూడా వర్కవుట్ అయితే మరో నాలుగైదు వచ్చినా ఆశ్చర్యం లేదు.

English summary

 Hit Pairs are comman in any film field. But Hat trick Pairs are rare. They have scorched the screen before, did an encore and are now gearing up to get third time lucky. Telugu cinema will see hit jodis coming back together to create on screen magic again
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu