»   » రానాను మిస్ అవుతున్నాను.. త్వరలోనే ఆయనతో..

రానాను మిస్ అవుతున్నాను.. త్వరలోనే ఆయనతో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు పరిశ్రమకు దూరమైన సినీ నటి తాప్సీ పన్ను బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందిన పాత్రల్లో కనిపిస్తున్నది. ఆమె నటించిన బేబీ, పింక్, ఘాజీ చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా నామ్ షాబానా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు.

అలాంటి అవకాశం

అలాంటి అవకాశం

నామ్ షబానా చిత్రం చాలా ఇంటెన్సిటీతో కూడుకొన్న చిత్రం. బాలీవుడ్‌లో రెండు, మూడు చిత్రాల తర్వాతనే ఇలాంటి అవకాశం నాకు లభించడం ఆనందంగా ఉంది. హీరోయిన్ ఓరియెంటెడ్, కేవలం నా పేరు పైనే సినిమాలు రూపొందడం సంతోషంగా ఉంది. బాలీవుడ్‌లో మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల నిర్మాణం జోరందుకోవడం మంచి పరిణామం. ప్రతీ నెల కనీసం రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు విడుదల కానుండటం బట్టి ప్రేక్షకుల అభిరుచి మారిందని చెప్పవచ్చు అని తాప్సీ అన్నారు.

 ఆ పాత్ర ద్వారా పుట్టిన కథ

ఆ పాత్ర ద్వారా పుట్టిన కథ

నామ్ షబానా సినిమా బేబీ చిత్రానికి స్పీన్ ఆఫ్ (బై ప్రొడక్ట్) లాంటిది. అంటే బేబీ చిత్రంలోని షబానా అనే పాత్ర ఆధారంగా పుట్టిన కథ. ఇది బేబీ సినిమాలో ఉన్న పాత్రలు అక్షయ్ కుమార్, ఇతర పాత్రలు ఈ సినిమాలో కూడా కనిపిస్తాయి. బేబీలో కనిపించిన రానా దగ్గుబాటిని ఈ సినిమాలో మిస్ అయ్యాను. బేబీకి చిత్రానికి సీక్వేల్స్, ప్రీక్వేల్ రూపొందించే ఆలోచనలో ఉన్నాం. ఆ చిత్రంలో రానా తప్పకుండా నటిస్తాడు అని తాప్సీ తెలిపింది.

 అలా అంటే నేను ఒప్పకోను..

అలా అంటే నేను ఒప్పకోను..

బాలీవుడ్ చిత్రాలకు నేను మిస్ డిపెండబుల్ అంటే ఒప్పుకొను. అలా అనడం నా రేంజ్ చాలా ఎక్కువ. ఏ చిత్రానికైనా డైరెక్టర్, నిర్మాతే డిపెండబుల్ అని అన్నారు. రెండు, మూడు సినిమాలకే అలాంటి ట్యాగ్ తగిలించుకోవడం సమంజసం కాదు అని తాప్సీ పేర్కొన్నారు.

పాఠశాల డైరెక్టర్‌తో..

పాఠశాల డైరెక్టర్‌తో..

ప్రస్తుతం తెలుగులో పాఠశాల డైరెక్టర్ మహీ రూపొందిస్తున్న చిత్రంలో కీలకమైన పాత్రను పోషించాను. భలే మంచిరోజు నిర్మాత ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. షూటింగ్ పూర్తి కావోచ్చింది. త్వరలోనే ఈ చిత్రం విడుదల అవుతుంది. ఈ సినిమాలో నా పాత్ర చుట్టే ఇతర పాత్రలు తిరగతాయి. చాలా రోజుల తర్వాత తెలుగులో చేస్తున్న విభిన్నమైన చిత్రం ఇది అని చెప్పారు.

పింక్ తర్వాత

పింక్ తర్వాత

పింక్ చిత్రం తర్వాత ఉద్వేగ భరితమైన, ఇంటెన్సిటీ ఉన్న చిత్రాల్లో నటించకూడదని అనుకొన్నాను. జుడ్వా2 చిత్రంలో నా పాత్ర గ్లామరస్‌గా ఉంటుంది అని సినీ తార తాప్సీ పన్ను తెలిపింది. నామ్ షబానా పింక్ పూర్తయిన తర్వాత రెండు రోజులకే ప్రారంభమైందని ఆమె తెలిపారు. ఈ రెండు చిత్రాల్లోని పాత్రలు చాలా ఇంటెన్సిటీతో కూడుకొన్నవి.

గ్లామరస్‌గా.. ఫన్నీగా

గ్లామరస్‌గా.. ఫన్నీగా

అందుకే తదుపరి చిత్రాల్లో ఉల్లాస భరితమైన చిత్రాల్లో నటించాలని, గ్లామరస్ పాత్రల్లో నటించాలని నిర్ణయించుకొన్నాను. ఆప్పుడే జుడ్వా2 ఆఫర్ వచ్చింది అని తాప్సీ వెల్లడించింది. బేబీ నుంచి నామ్ షాబానా వరకు ధరించిన క్యాస్టూమ్స్ కాకుండా ఫ్యాన్సీ దుస్తులు ధరించే అవకాశం వచ్చింది అని పేర్కొన్నది.

నా శరీరం రంగు వల్ల..

నా శరీరం రంగు వల్ల..

నా శరీర రంగు మరీ తెలుపు కావడం వల్ల చాలా అవకాశాలు కోల్పోయాను. నా శరీర ఆకృతి వల్ల తెలుగు, తమిళంలో అమ్మాయి పక్కింటి పాత్రలు దూరమయ్యాయి. తెలుపు రంగం నా దృష్టిలో అన్ని రంగుల కంటే ఎక్కువేమీ కాదు. నేనెప్పుడు నా మఖానికి ఫెయిర్ క్రీమ్ వాడలేదు. ఫెయిర్ క్రీముల ప్రకటనల్లో నటించే అవకాశం వచ్చినా ఒప్పుకోలేదు అని తాప్సీ తెలిపింది.

 షాబానా పాత్ర కష్టమైంది

షాబానా పాత్ర కష్టమైంది

నామ్ షబానా చిత్రంలో షాబానా పాత్రను పోషించడం చాలా కష్టమైంది. నా స్వభావం అలాంటిది కాదు కాబట్టి పాత్రలో లీనం కావడానికి చాలా సమయం పట్టింది అని తాప్సీ వెల్లడించింది. షాబానా చాలా నియంత్రణ కలిగి వ్యక్తి. ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే స్వభావం, దుందుడుకు ఉన్న ప్రవర్తన ఉండే పాత్ర అని చెప్పింది.

ఆత్మరక్షణ కోసం..

ఆత్మరక్షణ కోసం..

మహిళలు లైంగిక దాడులను ఎదుర్కోవడానికి అక్షయ్ కుమార్ తో కలిసి చేసిన సెల్ఫ్ డిఫెన్స్ వీడియో ఎంతో మందిని ఆకట్టుకొంటున్నది. లైంగిక దాడులు, వేధింపుల నుంచి తమను తాము రక్షించడానికి అక్షయ్, తాప్సీ చెప్పిన చిట్కాలు మహిళలకు ఉపయోగకరంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

English summary
Taapsee said, Taapsee tells us that unlike her onscreen persona Shabana, she "hates to hit people." In fact, she says that she does not relate to her character on any level. Her movie naam Shabana is releasing on March 31.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu