»   » సల్మాన్ కొంప మునిగింది టబు వల్లనే.. హాట్ బ్యూటీ రెచ్చగొట్టడంతో!

సల్మాన్ కొంప మునిగింది టబు వల్లనే.. హాట్ బ్యూటీ రెచ్చగొట్టడంతో!

Subscribe to Filmibeat Telugu
Why Salman Khan Only Convicted..? Karma Gets You In The End..!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట కేసులో జైలు పాలైన సంగతి తెలిసిందే. 1998 లో సల్మాన్ ఖాన్ రాజస్థాన్ లో ఓ చిత్ర షూటింగ్ సందర్భంగా కృష్ణ జింకలని వేటాడిన కేసులో జైలు శిక్ష విధించబడిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ తో పాటు బాలీవుడ్ నటులు సోనాలి బింద్రే, టబు మరియు సైఫ్ అలీ ఖాన్ పై కూడా ఈ కేసు నమోదైంది.

ఈ కేసులో జోధ్పూర్ న్యాయస్థానం సల్మాన్ ని మాత్రమే దోషిగా పరిగణిస్తూ, మిగిలిన వారిని నిర్దోషులుగా ప్రకటించింది. దీనిపై అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష విధించడానికి దారి తీసిన పరిస్థితుల గురించి చర్చ జరుగుతోంది. ఈ కృష్ణ జింకల వేట కేసులో మిగిలిన నటులు టబు, సోనాలి బింద్రే, సైఫ్ అలీ ఖాన్ పాత్ర గురించి ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి.

సినిమా షూటింగ్ కోసం

సినిమా షూటింగ్ కోసం

1998 లో హమ్ సాత్ సాత్ హై చిత్రం షూటింగ్ కోసం సల్మాన్ ఖాన్, టబు, సోనాలి బింద్రే మరియు సైఫ్ అలీఖాన్ లు రాజస్థాన్ లోని కొంకణి అనే గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో వారికీ రెండు కృష్ణ జింకలు తారస పడడంతో వాటిని వేటాడాలనే కోరిక కలిగింది. ఈ కోరిక సల్మాన్ ఖాన్ జైలు శిక్షకు కారణం అయింది.

 టబునే రెచ్చగొట్టింది

టబునే రెచ్చగొట్టింది

ఆ రెండు కృష్ణ జింకలని వేటాడేందుకు సల్మాన్ ఖాన్ జీపులో బయలుదేరాడు. సల్మాన్ పక్కనే హీరోయిన్ టబు కూడా కూర్చుందట. కృష్ణ జింకలు పరిగెడుతుంటే వాటిని కాల్చాలని సల్మాన్ ని టబు రెచ్చగొట్టినట్లు విచారణలో అక్కడ ఉన్న బొష్ణోయ్ లో పేర్కొన్నారు.

 అందువలనే కొంప మునిగింది

అందువలనే కొంప మునిగింది

టబు మాటలతో రెచ్చిపోయిన సల్మాన్ ఖాన్ అందులో ఓ కృష్ణ జింకని షూట్ చేసాడనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడే సల్మాన్ కొంప మునిగింది.కానీ విచారణలో సల్మాన్ ఖాన్ ని మాత్రమే ప్రత్యక్ష సాక్షులైన బిష్ణోయ్ లు గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించకపోవడంతో వారిని జోధ్ పూర్ న్యాయ స్థానం నిర్దోషులుగా ప్రకటించింది.

సల్మాన్ ఖాన్ బెయిల్ పిటిషన్

సల్మాన్ ఖాన్ బెయిల్ పిటిషన్

నేడు (శనివారం) సల్మాన్ ఖాన్ బెయిల్ పిటిషన్ న్యాయస్థానంలో విచారణకు రానుంది. సల్మాన్ ఖాన్ కు బెయిల్ వస్తుందా రాదా అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

English summary
Tabu forces Salman Khan to shoot blackbuck. Interesting facts behind Salman Khan case
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X