»   » అన్నీ తెలిసే మాట్లాడినట్టుంది : టబు పాలిటిక్స్ అనుకోవచ్చా

అన్నీ తెలిసే మాట్లాడినట్టుంది : టబు పాలిటిక్స్ అనుకోవచ్చా

Posted By:
Subscribe to Filmibeat Telugu

అప్పుడెప్పుడో మాట వరసకు అన్న మాటలు ఆ ముదురు భామ విషయంలో నిజమయ్యాయట. ఇదంతా నిజంగానే ఆశ్చర్యం కలిగించే విషయమని కొందరంటుంటే, అప్పట్లోనే ఈ విషయం ముద్దుగుమ్మకు తెలుసని కొందరు చర్చించుకుంటున్నారు.

నాలుగు పదుల వయసు దాటిపోయినా ఇంకా లేడీ బ్యాచలర్‌గానే కొనసాగుతున్న టబుకు సినిమాల్లో అవకాశాలు బాగా తగ్గిపోయాయనే చెప్పాలి. అయితే అప్పుడప్పుడు ఆమెకు సూటయ్యే కొన్ని పాత్రలను ఆఫర్ చేస్తూ... టబు తెరమరుగు కాకుండా చూస్తున్నారు సినీ జనం. బాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ గా ఉన్న నటి టబు త్వరలో కామెడీ జానర్ లో తెరకెక్కనున్న గోల్ మాల్ సిరీస్ లో నటించనుంది.

అజయ్ దేవగణ్, పరిణితీ చోప్రా ప్రధాన పాత్రలలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రోహిత్ శెట్టి డైరెక్ట్ చేయనుండగా ఇందులో టబుని కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. 'గోల్‌మాల్‌' సిరీస్‌కు తాను పెద్ద ఫ్యాన్ కావడంతో ఈ ఆఫర్‌ ని తాను కాదనలేకపోయానని టబు చెప్పింది. అయితే ఈ సినిమా ఆఫర్‌ వచ్చినప్పుడు తానేమి షాక్‌ కాలేదని అంది.

 Tabu returns to comedy after 17 years with Rohit Shetty's Golmaal 4

గోల్ మాల్ సిరీస్ అంటే నాకు చాలా ఇష్టం, అదీ కాక అజయ్ దేవగణ్ లాంటి స్నేహితుడుతో కలిసి పని చేయడం సంతోషమే అని టబు పేర్కొంది. ఇప్పటి వరకు అనేక పాత్రలలో నటించి మెప్పించిన టబు ఇప్పుడు తనలోని కామెడీ టైమింగ్ ఏవిధంగా ప్రదర్శించనుందనేది అభిమానులకు చర్చనీయాంశంగా మారింది.

'గోల్ మాల్ 4'లో టబుకు అవకాశం రావడంలో వింతేమీ లేకపోయినా... గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు నిజం కావడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకప్పుడు తాను అన్నీ ఒకే రకమైన రోల్స్ చేస్తానని వచ్చిన కామెంట్స్‌పై స్పందించిన టబు... 'గోల్ మాల్ 4'లో అవకాశం వచ్చినా తాను నటిస్తానని, తనకు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవని మాటవరసకు చెప్పింది. టబు ఈ కామెంట్స్ చేసిన దాదాపు ఏడాది గడిచిపోయింది.

మరోవైపు త్వరలోనే తన కామెడీ ఫ్రాంచైజీ సీక్వెల్ అయిన 'గోల్ మాల్ 4'ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి... సినిమాలోని ఓ పాత్ర కోసం టబును ఎంపిక చేసుకోవడంతో బీ టౌన్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇది అనుకోకుండా జరిగిందా లేక ఏడాది క్రితమే రోహిత్ శెట్టి ముదురు భామకు అవకాశం ఇస్తానని చెప్పాడా అనే కొందరు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఏదేమైనా ఇలాంటి టైమ్‌లో 'గోల్ మాల్ 4'వంటి సినిమాలో టబుకు ఛాన్స్ రావడం నిజంగా ఆమె లక్కే అనే టాక్ వినిపిస్తోంది.

English summary
Tabu, who is known for her powerful and serious roles, is going to try her hand at comedy after a long time in Rohit Shetty’s Golmaal.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu