»   »  తమన్నాను పెళ్లాడిన ప్రభుదేవా... (ఫోటో)

తమన్నాను పెళ్లాడిన ప్రభుదేవా... (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమన్నాను పెళ్లాడిన ప్రభుదేవా అనగానే మీకు ఇప్పటికే అర్థమయి ఉంటుంది... ఇది ఏదో సినిమాలో పెళ్లి సీన్ అయి ఉంటుందని... మీరు ఊహించింది నిజమే! ఈ ఇద్దరూ కలిసి ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల కాబోతోంది.

ఈ సినిమాలో ప్రభుదేవా హీరోగా నటిస్తుండగా తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగులో భాగంగా ప్రభుదేవా, తమన్నా పెళ్లి జరిగింది. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి ఇంటర్నోట్లో లీక్ అయింది. పెళ్లి కూతురు గెటప్ లో తమన్నా డిఫరెంటుగా కనిపిస్తోంది.

Tamanna, Prabhu Deva movie pic

హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో సోనూ సూద్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ప్రభుదేవా తమిళంలో నటిస్తున్న సినిమా ఇది. ఆయన చివరగా తమిళంలో 'ఎంగల్‌ అన్నా' అనే చిత్రంలో నటించారు.

తమన్నా ప్రస్తుతం నాగార్జున, కార్తీ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'ఊపిరి' చిత్రంలోనూ, 'బాహుబలి2', తమిళంలో విజయ్ సేతు సరసన 'ధర్మదురై' వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఊపిరి చిత్రానికి తమన్నా తొలిసారిగా సొంతగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటోంది.

English summary
Tamanna, Prabhu deva, Soonu sood in Vijay's next. The most sweltering buzz making rounds in the film Nagar circles is the insane venture which has been declared. This would have the multi-skilled Prabhu Deva as the hero while the milky beauty Tamanna is the heroine. The film will likewise have the etched hunk Sonu Sood doing a key role. Things got much all the more fascinating with the news that star author Kona Venkat has additionally joined this task.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu