»   » జోరుగా స్టార్ హీరోయిన్ల దందా.. దీపం ఉండగానే.. రెండు చేతులా సంపాదన

జోరుగా స్టార్ హీరోయిన్ల దందా.. దీపం ఉండగానే.. రెండు చేతులా సంపాదన

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెండితెర మీద రాణించాలంటే అందమైన తారలకు అభినయంతోపాటు, పాదరసంలా ఆలోచించే తెలివితేటలు, చురుకుదనం ఉండాల్సిందే. అలా వ్యవహరించే వారికి ఢోకా ఉండదనే పలువురు హీరోయిన్లు ఇప్పటికే నిరూపించారు. వారి బాటలోనే ప్రయాణిస్తూ నేటితరం తరం బ్యూటీలు సినిమా పరిశ్రమలో పరిస్థితి అనుకూలంగా ఉండగానే.. మరో వైపు వ్యాపారాల్లో అడుగుపెట్టేస్తున్నారు. రేపటి రోజున ఏమౌతుందోననే భయం ఉన్న ముందచూపుతో హీరోయిన్లు సర్దుకుంటున్నారు. తమకు తోచిన వ్యాపారాలను చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకొంటూ తెలివిగా వ్యాపారాలను ఎంచుకొంటున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తునే.. మరోవైపు వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు. ఇటీవల కాలంలో బిజినెస్ రంగంలోకి ప్రవేశించిన వారిలో తమన్నా భాటియా, కాజల్ అగర్వాల్, తాప్సీ, ప్రణీత తదితరులు ఉన్నారు. నేటితరం తారామణులు చేస్తున్న బిజినెస్ వ్యవహారాలపై ఓ లుక్కేద్దామా!

తమన్నా ఆన్‌లైన్ జ్యువెల్లరీ బిజినెస్

తమన్నా ఆన్‌లైన్ జ్యువెల్లరీ బిజినెస్

బాహుబలి చిత్రంతో స్టార్ హీరోయిన్‌గా మారిన తమన్నా ఇటీవల కాలంలో ఊపిరి లాంటి విభిన్నమైన చిత్రాల్లో కనిపించింది. ఓ వైపు గ్లామర్ తారగా రాణిస్తూనే ఆన్‌లైన్ జ్యువెల్లరీ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. నేను బిజినెస్ ప్రారంభించాను. నా స్వంత బ్రాండ్ పేరు వైట్ అండ్ గోల్డ్ అని గత మార్చిలో తమన్నా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

రకుల్ ప్రీత్ సింగ్ .. ఫిట్‌నెస్ స్టూడియో

రకుల్ ప్రీత్ సింగ్ .. ఫిట్‌నెస్ స్టూడియో

టాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్‌కు ముందుచూపు బాగానే ఉంది. తాజాగా నాన్నకు ప్రేమతో, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి ఘనవిజయాలను సొంతం చేసుకొన్నది. ప్రిన్స్ మహేశ్ బాబుతో స్పైడర్ చిత్రంలో నటిస్తున్నది. ఇలా సినిమాల్లో బిజీగానే ఉంటూనే హైదరాబాద్ గచ్చిబౌలిలో ఎఫ్45 అనే ఫిట్‌నెస్ స్టూడియోను (జిమ్‌) ప్రారంభించింది. త్వరలోనే వైజాగ్‌లో ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నది.

శ్రీయా సరన్ బ్యూటీ పార్లర్ బిజినెస్

శ్రీయా సరన్ బ్యూటీ పార్లర్ బిజినెస్

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నటిగా గుర్తింపు పొందిన శ్రీయా శరన్ ఓ వైపు సినిమాలు చేస్తూనే సొంత వ్యాపారంపై దృష్టిపెట్టింది. ముంబై మహానగరంలోని అంధేరి ప్రాంతంలో బ్యూటీ పార్లర్, స్పాను ఏర్పాటు చేసింది. బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో నటించిన శ్రేయా ప్రస్తుతం మళ్లీ బాలయ్య సరసన పూరీ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో కనిపించనున్నది.

కాజల్.. మార్సాలా జ్యువెల్లరీ

కాజల్.. మార్సాలా జ్యువెల్లరీ

టాలీవుడ్‌లో ప్రస్తుతం కాజల్ అగర్వాల్ టాప్ హీరోయిన్. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నంబర్ 150లో నటించే అవకాశాన్ని చేజిక్కించుకొన్నది. మెగా హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ జ్యువెల్లరీ బిజినెస్‌లోకి ప్రవేశించింది. మర్సాలా జ్యువెల్లరీ అనే బ్రాండ్‌ను పరిచయం చేసింది. తన వ్యాపారాన్ని సోదరి నిషా అగర్వాల్‌తో ప్రారంభించడం గమనార్హం. ముంబైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో తన అవుట్‌లెట్‌ను తెరిచింది.

ఇలియానా ఫ్యాషన్ బిజినెస్

ఇలియానా ఫ్యాషన్ బిజినెస్

టాలీవుడ్ వరుస హిట్లను సాధిస్తూ అగ్రతారగా గుర్తింపు పొందిన తారమణుల్లో ఇలియానా ఒకరు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన కొద్ది రోజుల్లోనే టాప్ హీరోలతో జతకట్టింది. సూపర్ హిట్లు కూడా కెరీర్‌లో పడటంతో కోటి రూపాయలు తీసుకొనే స్టార్‌గా ఓ క్రెడిట్ కొట్టేసింది. తారాపథంలోకి దూసుకెళ్తుందనుకుంటుండగానే ఇలియానా చేతిలో సినిమాలు లేని పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితిని ముందే గ్రహించిందేమో ఇలియానా ఫ్యాషన్ దుస్తుల స్టోర్‌ను ప్రారంభించింది. తనదైన స్టయిల్ వ్యాపారాన్ని మేనేజ్ చేస్తున్న ఈ గోవా సుందరి ప్రస్తుతం ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ అండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేస్తున్నది.

ప్రణీత బూట్ లెగ్గర్ రెస్టారెంట్

ప్రణీత బూట్ లెగ్గర్ రెస్టారెంట్

అత్తారింటికి దారేది చిత్రంలో అచ్చ తెలుగు అందాల తార ప్రణీత ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్న ఈ బ్యూటీ.. ముందు చూపుతో రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. బెంగుళూరులో బూట్ లెగ్గర్ అనే రెస్టారెంట్ ప్రారంభించింది. డబ్బు సంపాదనే నా లక్ష్యమని ఆమె స్పష్టం చేసింది.

తాప్సీ పొన్ను వెడ్డింగ్ ఫ్యాక్టరీ..

తాప్సీ పొన్ను వెడ్డింగ్ ఫ్యాక్టరీ..

అటు హిందీ, ఇటు తెలుగు చిత్రాలతో తాప్సీ పొన్ను దూసుకెళ్తున్నది. పింక్ లాంటి విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూనే వ్యాపార రంగంలోకి ప్రవేశించింది. తన సోదరి, స్నేహితురాలితో కలిసి ఈవెంట్ మేనేజ్‌మెంట్ వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది. వెడ్డింగ్ ఫ్యాక్టరీ అని పేరుపెట్టింది. ఇటీవల ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్టు మీడియాకు వెల్లడించింది.

అమలాపాల్ థింగ్ బిగ్ స్టూడియో

అమలాపాల్ థింగ్ బిగ్ స్టూడియో

కెరీర్ మంచి జోరులో ఉండగానే నటి అమలా పాల్ పెళ్లి చేసుకొన్నది. అయితే ఊహించని విధంగా పెళ్లి బంధం బెడిసికొట్టింది. ఆ తర్వాత మళ్లీ సినిమాలపై దృష్టిపెట్టింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. థింగ్ బిగ్ స్టూడియో పేరు ఫిల్మ్ స్టూడియోను చైన్నైలో ఇటీవల ప్రారంభించింది. తెలుగులో నాయక్, ఇద్దరమ్మాయిలతో లాంటి చిత్రాల్లో నటించింది.

సారా జేన్ డయాస్ బటర్‌ఫ్లై బేకరీ

సారా జేన్ డయాస్ బటర్‌ఫ్లై బేకరీ

పంజా చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచమైన సారా జేన్ డయాస్ ఆ తర్వాత టాలీవుడ్‌లో ఎక్కువగా కనిపించలేదు. ఆ తర్వాత హ్యాప్పీ న్యూఇయర్, ఓ తెరీ లాంటి హిందీ చిత్రాల్లో.. తిరడా విలైయట్టు పిళ్లై అనే తమిళ చిత్రాల్లో నటించింది. ఓ వైపు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూనే బేకరి వ్యాపారాన్ని ప్రారంభించింది. బటర్ ఫ్లై బేకరీ అనే పేరుతో ముంబైలొని పశ్చిమ ఖార్‌లో స్టోర్‌ను తెరిచింది.

సంజనా యోగా విన్యాసాలు

సంజనా యోగా విన్యాసాలు

బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై, తదితర చిత్రాల్లో నటించిన సంజనా గర్లానీ అడపాదడపా వెండితెరపైన కనిపిస్తున్నది. అందం, అభినయం ఉన్నా అదృష్టం లేకపోవడంతో స్టార్ నటిననే ముద్రను సాధించలేకపోయింది. ప్రస్తుతం అక్షర్ పవర్ యోగా సెంటర్‌ను ప్రారంభించింది. అందం, ఆరోగ్యానికి సంబంధించిన వ్యాపారంలోకి అడుగుపెట్టిన సంజనా తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకొంటున్నది.

శిల్పాశెట్టి ఫిట్ నెస్ మంత్ర

శిల్పాశెట్టి ఫిట్ నెస్ మంత్ర

బాలీవుడ్‌లో శిల్పాశెట్టి టాప్ హీరోయిన్. భారీ పారితోషికం తీసుకొంటూనే వ్యాపారరంగంలోకి తన సత్తా చాటుతున్నది. ఐపీఎల్ క్రికెట్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత యోగా, ఫిట్ నెస్, స్పాకు సంబంధించిన వ్యాపారాన్ని చేపట్టింది. ముంబైలో చైన్ ఫిట్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. డీవీడి తదితర ప్రసార మాధ్యమాల దారా యోగా పాఠాలను బోధిస్తున్నది.

సుస్మిత సేన్ బంగారం

సుస్మిత సేన్ బంగారం

మిస్ యూనివర్స్‌గా గురింపు పొందిన సుస్మితా సేన్ బాలీవుడ్‌తోపాటు దక్షిణాది చిత్రాల్లోనూ కనిపించింది. నటిగా తనకు నచ్చిన పాత్రల్లో కనిపిస్తూ కాలం వెళ్లదీస్తున్నది. తాజాగా దుబాయ్‌లో జ్యువెల్లరీ రిటైల్ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ వ్యాపార బాధ్యతలను తన తల్లి, సోదరుడికి అప్పగించింది. త్వరలోనే గొలుసుకట్టు హోటళ్లను, ఫిట్‌నెస్ సెంటర్లను ప్రారంభించే ఆలోచనతో ముందుకెళ్తున్నది.

లారా దత్ సొంతంగా ప్రొడక్షన్

లారా దత్ సొంతంగా ప్రొడక్షన్

మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ నటి లారా దత్తా ఓ వైపు నటిస్తూనే వ్యాపార రంగంపై దృష్టిపెట్టింది. భీగిబసంతి అనే ప్రొడక్షన్ కంపెనీని ఏర్పాటు చేసింది. ఛబ్రా 555 అనే శారీ కలెక్షన్ సెంటర్‌ను ప్రారంభించింది. ఫిట్‌నెస్, స్పా సెంటర్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నది.

English summary
Tollywood, Bollywood star heroines are eyeing on business. They pursuing acting oneside, doing business otherside too. They testing their water in the business arena.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu