»   »  కాలా భార్య మారిపోయింది: రజినీ సరసన ఎవ్వరూ ఊహించని నటి

కాలా భార్య మారిపోయింది: రజినీ సరసన ఎవ్వరూ ఊహించని నటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

రోబోకు సీక్వెల్ గా రానున్న 2.0 మూవీ రిలీజ్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డంతో, రజనీకాంత్ నుంచి సినిమా రాకుండానే ఈ ఏడాది ముగిసిపోతుందని ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. అయితే ఇప్పుడు అదిరిపోయే న్యూస్ ఏమిటంటే .. రజనీ కాలా ని 2.0 సినిమా కంటే ముందే, అంటే ఈ ఏడాదిలోనే కాలా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కాలా సినిమా సెకెండ్ షెడ్యూల్

కాలా సినిమా సెకెండ్ షెడ్యూల్

సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు పెద్దగా గ్యాప్స్ ఇవ్వకూడదని డిసైడ్ అయిన రజనీకాంత్, కాలా సినిమా సెకెండ్ షెడ్యూల్ ను వెంటనే ప్రారంభించబోతున్నాడు. ప్రస్తుతం ముంబయిలో కాలా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగానే చెన్నైలో వేసిన "థారావి సెట్"లో వెంటనే మరో షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది.


ఈనెల 15 నుంచి 2 రోజుల

ఈనెల 15 నుంచి 2 రోజుల

ఇలా గ్యాప్ ఇవ్వకుండా 4 నెలల్లో సినిమాను కంప్లీట్ చేసి, ఏడాది చివరినాటికి కాలాను థియేటర్లలోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.ఈనెల 15 నుంచి 2 రోజుల పాటు మరోసారి అభిమానులను కలవనున్నాడు రజనీకాంత్. ఆ తర్వాత ఓ 4 రోజులు విశ్రాంతి తీసుకొని, 24వ తేదీ నుంచి తిరిగి కాలా సెకెండ్ షెడ్యూల్ ను ప్రారంభించాలని ఫిక్స్ అయ్యాడు.


థారావి సెట్

థారావి సెట్

ఈ మూవీ కోసం ఇప్పటికే చెన్నైలో థారావి సెట్ ను నిర్మిస్తున్నారు. మరో వారం రోజుల్లో సెట్ నిర్మాణం పూర్తయిపోతుంది. నానా పటేకర్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హుమా ఖురేషీ, అంజలి పాటిల్ హీరోయిన్లు అనేదే మొన్నటి వరకూ అందరికీ తెలిసిన విషయం అయితే ఇప్పుడు ఇంకో న్యూస్ బయటకు వచ్చింది. మళ్ళీ కొన్నాళ్ళకి అంజలీ పాటిల్ పాత్ర అనుమానమే అనుకున్నారు ఇప్పుడు ఎవరూ ఊహించని పేరు ఒకటి బయటకు వచ్చింది.


రజినీ భార్యగా ఈశ్వరీరావ్

రజినీ భార్యగా ఈశ్వరీరావ్

రజినీ భార్యగా ఈశ్వరీరావ్ ను ఎంపిక చేసినట్లుగా చెప్పటంతో.. కాలా మూవీ కథపై కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఈశ్వరీ రావును ఎంపిక చేశారంటే.. కాలా జీవితంలో ఆమెను పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత హ్యుమా ఖురేషి పాత్ర ఉంటుందా? అన్న సందేహం వినిపిస్తోంది. క్యారెక్తర్ ఆర్టిస్ట్ గా కనిపించే ఈశ్వరీ రావు ఇప్పుడు ఏకంగా రజినీకాంత్ కే జోడీగా ఎంపిక కావటం విశేషమే


కొత్త క్యారెక్టర్

కొత్త క్యారెక్టర్

రజనీ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్న ఈ మూవీని 2018లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ధనుష్ వండర్ బార్ బ్యానర్ మీద నటిస్తున్న ఈ మూవీలో ఈశ్వరి రోల్ గురించి మరో వాదన కూడా వినిపిస్తోంది. హ్యుమాతో లవ్ బ్రేక్ అయి.. తర్వాతి కాలంలో ఈశ్వరిని చేసుకుంటారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి కాలాకు సంబంధించి ఒక కొత్త క్యారెక్టర్ బయటకు రావడంతో జనం కథ ను కొత్తకొత్తగా ఊహించుకుంటున్నారు.English summary
Noted Tamil character actress, Easwari Rao, has been roped in to play Rajini’s wife in the film Kaala. Apparently, the makers zeroed in on her on account of the stellar performances in a range of roles over all these years.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu