»   » పవన్ కళ్యాణ్ లేదా బన్నీ.. ఖరారు చేసిన తమిళ క్రేజీ డైరెక్టర్!

పవన్ కళ్యాణ్ లేదా బన్నీ.. ఖరారు చేసిన తమిళ క్రేజీ డైరెక్టర్!

Subscribe to Filmibeat Telugu

హ్యాట్రిక్ విజయాలతో తమిళ యువ దర్శకుడు అట్లీ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. రాజా రాణి, తేరి మరియు ఇటీవల విడుదలైన సంచలనం సృష్టించిన మెర్సల్ చిత్రాలతో అట్లీ పేరు మోత మోగిపోయింది. అట్లీ ప్రస్తుతం సౌత్ లో అందరి హీరోలకు మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా మారిపోయాడు. మెర్సల్ చిత్రం సౌత్ టాప్ గ్రాసర్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఈ దర్శకుడు తెరకెక్కించిన తేరి చిత్రం పోలీస్ గా తెలుగులో అనువాదం అయినా విజయం సాధించలేకపోయింది. కానీ ఈ దర్శకుడికి మాత్రం మంచి క్రేజ్ ఏర్పడింది.

మెర్సల్ చిత్రం తరువాత ఈ దర్శకుడు తెలుగు హీరోతో సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమయ్యాయి. దర్శకుడు అట్లీ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. కానీ తాను ఏ హీరోతో సినిమా చేయబోతున్నానో అనే విషయాన్ని మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తానని ప్రకటించాడు. నేను తెరకెక్కించే తెలుగు చిత్రం కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి. త్వరలోనే హీరో, తదితర వివరాలు ప్రకటిస్తా అని అట్లీ తెలిపాడు.

Tamil director confirms his Telugu movie

అట్లీ వ్యాఖ్యలతో ఊహాగానాలు జోరందుకున్నాయి. అట్లీ మొదట ప్రభాస్ తో సినిమా చేస్తాడంటూ వార్తలు వచ్చాయి. కానీ మరో ఏడాది వరకు ప్రభాస్ డేట్లు ఖాళీగా లేవు. రాంచరణ్, ఎన్టీఆర్, మహేష్ వంటి హీరోలు కూడా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రాజకీయాలతో బిజీగా ఉన్నా పవన్ మరో చిత్రం చేసే అవకాశం లేదని కొందరు అంటున్నా, అన్ని కుదిరితే ఈ ఏడాది ఆయన మరో చిత్రం చేసే అవకాశం ఉందని మరికొందరు చెబుతన్నారు. ఇక అల్లు అర్జున్ కూడా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. అట్లీ. బన్నీ కాంబినేషన్ సెట్ అయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.

English summary
Tamil director confirms his Telugu movie. Hero and other details will reveal soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X