Don't Miss!
- News
నేటినుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం: రేపే బడ్జెట్ .. షెడ్యూల్ ఇలా!!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
నేడు శివకార్తికేయన్ ‘వేలైక్కారన్’టీజర్ రిలీజ్, సంచలనాలకు తెరతీస్తుందా !
తమిళహీరో శివకార్తికేయ్ హీరోగా నటిస్తున్న 'వేలైక్కారన్ 'సినిమా టీజర్ సోమవారం (ఆగస్టు 14వ తేదీ) సాయంత్రం విడుదల కానుంది. ప్రముఖ మలయాళం నటుడు పహాద్ ఫాజిల్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కార్తికేయన్, పహాద్ ఫాజిల్ పోటాపోటీగా ఈ సినిమాలో నటించారు.
ఇప్పటికే వేలైక్కారన్ సినిమా ఫస్ట్, సెకండ్ లుక్ విడుదల అయ్యాయి. వేలైక్కారన్ ఫస్ట్, సెకండ్ లుక్ కు మంచి స్పందన రావడంతో కచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతోందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. 24AM స్టూడియోస్ నిర్మించిన వేలైక్కారన్ సినిమా మీద రోజురోజుకూ అంచనాలు పేరిగిపోతున్నాయి.

దర్శకుడి మీద భారీ అంచనాలు
తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ సినిమాకు దర్శకత్వం వహించిన మోహన్ రాజా అలియాస్ రాజా వేలైక్కారన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు రాజా ఊహించని స్థాయిలో సినిమాను తెరకెక్కించారని చిత్ర బృందం అంటోంది.

ఎంటర్టెన్మెంట్ తో పాటు మెసేజ్
వేలైక్కారన్ సినిమా ఎంటర్టెన్మెంట్ తో పాటు సోషల్ మెసేజ్ ను జోడించి తెరకెక్కించామని ఇంతకు ముందే దర్శకుడు రాజా చెప్పారు. వేలైక్కారన్ సినిమా సూపర్ హిట్ అవుతోందని దర్శక నిర్మాతలు గట్టినమ్మకంతో ఉన్నారు. తమిళనాడులో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

స్టార్ నటీ నటులు
వేలైక్కారన్ సినిమాలో శివకార్తికేయన్, పహాద్ ఫాజిల్ తో సహ నయనతార, ప్రకాష్ రాజ్, రోహిణి, సతీస్, ఆర్. బాలాజీ తదితరులు కీలకపాత్రల్లో నటించడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా సినిమా చూసేలా వేలైక్కారన్ తెరక్కెక్కిందని అంటున్నారు.

సంచలనాలకు తెర తీస్తుందా ?
వేలైక్కారన్ టీజర్ ఎప్పుడెప్పుడు విడుదల అవుందా అంటూ తమిళనాడులో సినీ ప్రేక్షలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీజర్ కు ఎలాంటి స్పందన వస్తుందో అంటూ నటి నటులతో పాటు దర్శక నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. మొత్తం మీద సోమవారం సాయంత్రం 6 గంటలకు వేలైక్కారన్ టీజర్ విడుదల అయ్యి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తోందో అంటూ తమిళ సినీరంగం ఎదురు చూస్తోంది.