»   » బాహుబలి 2 రిలీజ్ ఆగిపోయింది : జక్కన్న కు కోలీవుడ్ పెద్ద షాకే ఇచ్చింది

బాహుబలి 2 రిలీజ్ ఆగిపోయింది : జక్కన్న కు కోలీవుడ్ పెద్ద షాకే ఇచ్చింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 మూవీ మేనియా దేశమంతా బాగానే స్ప్రెడ్ అయింది. ఇప్పటికే నాలుగైదు రోజుల టికెట్స్ అమ్మేసినట్లుగా థియేటర్ వర్గాలు చెబుతున్నాయి. వీటిలో అనేక కార్పొరేట్ బుకింగ్స్.. బల్క్ బుకింగ్స్ కూడా ఉండడం విశేషం. మరోవైపు బాహుబలి2 మూవీ చూసేందుకు చాలా కంపెనీలు సెలవు కూడా ప్రకటించారనే టాక్ ఉంది.

తమిళనాడు సమస్యని పట్టించుకోలేదు

తమిళనాడు సమస్యని పట్టించుకోలేదు

ప్రపంచం మొత్తం బాహుబలి ఉత్సవాల్లో మునిగి తేలుతుంటే తమిళులకు మాత్రం ఇంకా ఆ చాన్స్ దక్కలేదు. ఓవర్సీస్ లో కూడా షో ల మీద షోలు పడిపోతూంటే ఎప్పటినూంచో అసలు ఏ అనుమానమూ లేని కోలీవుడ్ లో మాత్రం ఇంకా తెరల మీద బాహుబలి అడుగులు పడలేదు. కర్ణాటకలో రిలీజ్ కి ముందే వచ్చిన ప్రాబ్లంస్ మీద పూర్థి దృష్టి పెట్టిన టీమ్ తమిళనాడు లో ఉన్న సమస్యని మాత్రం పట్టించుకోలేదు... ఇంతకీ తమిళ్ వెర్షన్ కి ఏమైందీ అంటే...


మాణింగ్ షోస్ కూడా

మాణింగ్ షోస్ కూడా

నిజానికి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా ఈ మూవీని ప్రీమియర్స్ వేసేందుకు ప్లాన్ చేశారు. వాటి ప్రదర్శన సాధ్యం కాలేదు. ఇప్పుడు మాణింగ్ షోస్ కూడా పడకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే. బాహుబలి2 లాంటి భారీ ప్రాజెక్ట్ కు మాణింగ్ షోస్ ఆగిపోవడానికి పెద్ద కారణమే ఉండాలి.


బాహుబలి2 రిలీజ్ ఆగిపోయింది

బాహుబలి2 రిలీజ్ ఆగిపోయింది

తమిళనాడులో ఈ చిత్రాన్ని కె ప్రొడక్షన్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ సంస్థకు బాహుబలి ప్రొడ్యూసర్స్ కు మధ్య ఇంకా డీలింగ్స్ పూర్తి కాలేదు. ఈ విషయంపై ఇద్దరూ ఒక ఒప్పందానికి రాకపోవడంతోనే తమిళనాట బాహుబలి2 రిలీజ్ ఆగిపోయింది. అంతటా జనాలు బాహుబలి మానియాలో గంతులేస్తూంటే కోలీవుడ్ జనాలు మాత్రం ఇంకా ఎదురు చూపుల్లోనే ఉన్నారు.


మ్యాట్నీల నుంచి అయినా

మ్యాట్నీల నుంచి అయినా

ఇప్పటి వరకూ దీని మీద దృష్టి పెట్టని బాహుబలి టీమ్ ఇప్పటికిప్పుడు ఈ సమస్యని సాల్వ్ చేసే పనిలో పడింది. అందుకే ఆఘమేఘాల మీద ఈ ప్రాబ్లెంను సాల్వ్ చేసుకుని..మ్యాట్నీల నుంచి అయినా ప్రదర్శనలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి తమిళ ప్రేక్షకులు మ్యాట్నీ నుంచైనా బాహుబలి ని చూస్తామా లేదా అని ఎదురు చూస్తున్నారు.English summary
Baahubali fans in Tamil Nadu are in for disappointment because the first day first show of the magnum opus has been cancelled in the state due to a financial issue between the producers and the makers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu