»   » మరీ ఇంత దారుణమా..?? విడుదలకు ముందే పైరసీ సినిమా నెట్ లో పెట్టారు

మరీ ఇంత దారుణమా..?? విడుదలకు ముందే పైరసీ సినిమా నెట్ లో పెట్టారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమాకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం 'సినిమా పైరసీ'. దీన్ని అరికట్టలేక, సినిమా విడుదలైన కొద్ది రోజులకే మార్కెట్‌లోకి డీవీడీలు, బ్లూ రే, సీడీలను విడుదల చేస్తున్నారు నిర్మాతలు. టెక్నాలజీని వాడుకోవడంలో 'సినిమా పైరసీ' ముఠా చాలా అడ్వాన్స్‌డ్‌గా వుంది. పదో, పాతికో, వందో వెబ్‌సైట్లు ఏ కొత్త సినిమా వచ్చినా, వెంటనే వాటి పైరసీ వీడియోల్ని అక్కున చేర్చుకుంటున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా పైరసీ ప్రియులకి అందజేసేస్తున్నాయి. అసలు పైరసీ ఎక్కడ ప్రారంభమవుతుంది.? అని ఆలోచించి, అక్కడ అడ్డుకట్ట వేస్తే తప్ప, పైరసీ జరిగిపోయాక దాన్ని నియంత్రించడం సాధ్యం కాదేమో అన్న అభిప్రాయమే అంతటా వినిపిస్తోంది. కేవలం పైరసీ కోసమే రాత్రికి రాత్రి కొత్త వెబ్‌సైట్లు వెలుస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో అర్థం చేసుకోవచ్చు. ఎడిటింగ్‌ టేబుల్‌ దగ్గర, ఫైనల్‌ ఔట్‌పుట్‌ విషయంలో, థియేటర్లలో.. ఇలా అక్కడా ఇక్కడా అని కాదు, పైరసీ జరగడానికి అనేక పరిస్థితులు, ప్రాంతాలు ఉపకరిస్తున్నాయి.

ఫర్ సెన్సార్:

ఫర్ సెన్సార్:

బాలీవుడ్ మూవీ ఉడ్తా పంజాబ్ రిలీజ్ కావడానికి ఒక రోజుముందే ఈ చిత్రం మొత్తం ఆన్ లైన్ లో లీకయిపోయింది. 70 వేలమందికి పైగా అప్ లోడర్లు లైవ్ స్ట్రీమింగ్ వెబ్ సైట్ల మీదికి ఈ సినిమాను అర్జంటుగా ఎక్కించేశారు. ఫర్ సెన్సార్ అన్న వాటర్ మార్క్ తో..ఎలాంటి కట్లు లేని ఈ మూవీని అనేకమంది డౌన్ లోడ్ చేసుకున్నారు.

పైరసీ ఒక కారణం:

పైరసీ ఒక కారణం:

గతంలో సినిమా వచ్చిందంటే వంద రోజులు ఆడుతుందా? అని చర్చించుకునేవారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు కానరావడంలేదు. సినిమా విడుదలైన నెల, రెండు నెలలోపే టీవీల్లో ప్రత్యక్షమవుతోంది. దానికి కారణాలు అనేకం. అందులో పైరసీ కూడా ఒక కారణం. పైరసీని ఆపగలిగితే ఎక్కువ రోజులు థియేటర్‌లో సినిమా ఆడేందుకు ఆస్కారముంటుంది.

సూర్య సినిమా ఎస్‌-3:

సూర్య సినిమా ఎస్‌-3:

బాక్సాఫీసు వద్ద ఈ సినిమా రికార్డులను దెబ్బ తీసేందుకు సెన్సార్ బోర్డులోని ఓ సభ్యుడే దీన్ని లీక్ చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ షాక్ నుంచి అన్ని "వుడ్" లూ ఇంకా తేరుకోక ముందే తమిళ సినిమాకి మరో పెద్ద షాక్ తగిలింది. అదేమిటంటే గ‌త వారం విడుద‌లైన సూర్య సినిమా ఎస్‌-3 విడుదల సన్నాహాల్లో ఉండగానే చిన్నపాటి షాక్ తగిలింది .

మరిన్ని జాగ్రత్తలు:

మరిన్ని జాగ్రత్తలు:

అదే మూవీ ని ని రిలీజ్ రోజు ఉద‌యం 11 గంట‌ల‌కే అందుబాటులోకి తెస్తామంటూ త‌మిళ్ రాక‌ర్స్ అనే పైర‌సీ వెబ్ సైట్ అధికారికంగా అనౌన్స్ చేసింది. అసలు పైరసీ దారులు ఎంతకు తెగించారో చెప్పటానికి ఇదే నిదర్శనం. అయితే ఆ ప్రకటణను గమనించిన "సింగమ్" బృందం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవటం తో ఎస్ 3 పైరసీ నుంచి తప్పించుకుంది.

అంతు బ‌ట్ట‌డం లేదు:

అంతు బ‌ట్ట‌డం లేదు:

ఐతే ఇప్పుడు అదే వెబ్ సైట్ ఒక దారుణానికి ఒడిగ‌ట్టింది. "లైట్‌మ‌న్" అనే త‌మిళ సినిమాను విడుద‌ల క‌న్నా ముందే త‌మ వెబ్ సైట్లో పెట్టేసింది. ఈ సినిమా ఎలా వాళ్ల చేతికి చిక్కింద‌న్న‌ది అంతు బ‌ట్ట‌డం లేదు. ఇక్కడ కూడా యూనిట్ సభ్యులనీ, ఎడిటింగ్ టేబుల్ స్టాఫ్ నీ అనుమానించల్సిన పరిస్థితి. వీరికి తప్ప మరీ అంత చక్కటి ప్రింట్ ని బయటకు చేరవేసే అవకాశం లేదు.

దారుణ‌మైన దెబ్బ:

దారుణ‌మైన దెబ్బ:

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ సంద‌ర్భంగా యూనిట్ స‌భ్యులే ఎవ‌రో సినిమాను కాపీ చేసి పైర‌సీ వెబ్ సైట్‌కు అంద‌జేసిన‌ట్లు తెలుస్తోంది. ఎలాగైతేనేం ఆ సినిమా యూనిట్‌కు దారుణ‌మైన దెబ్బ త‌గిలింది. దీనిపై చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు.. న‌టీన‌టులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఆఫ్ బీట్ సినిమా:

ఆఫ్ బీట్ సినిమా:

వెంక‌టేష్ కుమార్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ లైట్ మ‌న్ సినిమాను రూపొందించాడు. చాలామంది కొత్త న‌టీన‌టులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఇదొక ఆఫ్ బీట్ సినిమా. ఈ మ‌ధ్య రిలీజైన ట్రైల‌ర్ ఆస‌క్తి రేకెత్తించింది. ఎంతోక‌ష్ట‌ప‌డి.. ఖ‌ర్చు పెట్టి ఒక యువ బృందం చేసిన ఈ సినిమా ఇలా పైర‌సీ సైట్ బారిన ప‌డ‌టం విచార‌క‌రం.

 సర్వనాశనం:

సర్వనాశనం:

తాము పడ్ద కష్టం మొత్తం సర్వనాశనం అయిపోయిందనీ.., తమ సినిమా గురించి ఒక్క వార్త కూడా రాయని పత్రికలనీ, వెబ్ సైట్ లనీ పట్టించుకోకుండా తామే ప్రమోట్ చేసుకుంటూ, ఎందరో కొత్తనటుల కల సినిమాని విడుదల చేసేదాకా తీసుకు వచ్చాక ఇప్పుడు ఈ వెబ్సైట్ చేసిన పనితో అందరి ఆశలూ కాలి బూడిద అయ్యాయంటూ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన కార్థీక్ నాగరాజన్ తన ఫేస్బుక్ పేజ్ లో రాసిన పోస్ట్ చాలామందిని కదిలించేలా ఉంది.

నిర్లక్ష్యం:

నిర్లక్ష్యం:

ఈ ప‌రిణామంపై త‌మిళ సినీ ప‌రిశ్ర‌మకు చెందిన చాలామంది మండిప‌డుతున్నారు. ఇప్ప‌టికైనా పైర‌సీ సైట్ల మీద ఉక్కుపాదం మోప‌క‌పోతే సినిమా భవిష్య‌త్తు మ‌రింత ప్ర‌మాదంలో ప‌డుతుంద‌ని అంటున్నారు. బ్లాక్‌ టిక్కెట్‌ మార్కెటింగ్‌ , నిర్లక్ష్యం, ఇండస్ట్రీలోని సినిమా దొంగల పట్ల అప్రమత్తత లేకపోవడం వంటివన్నీ పైరసీని పెంచి పోషిస్తున్నాయి.

English summary
Tamil Movie Lightman was originally scheduled to release on February 10, but it couldn’t able to make to the screens as planned. Unfortunately, the film was uploaded on Tamilrockers and other online webcasting piracy websites the day before the actual release, February 9th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu