‘‘పవన్ కళ్యాణ్ అలాంటోడు కాదు, అలీ చాలా మంచోడు... రోడ్డెక్కడం బాధేసింది’’

Recommended Video

Tammareddy Bharadwaj Responds On Pawan Kalyan - Comedian Ali Issue

పవన్ కళ్యాణ్, అలీ మధ్య నెలకొన్న వివాదం మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇటీవల రాజమండ్రి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అలీ తన స్నేహితుడని, ఎంతో సహాయం చేశానని, నన్ను కాదని వేరే పార్టీలో చేరి ఇలా చేస్తాడని అనుకోలేదని వ్యాఖ్యానించారు. దీనికి అలీ కూడా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్, అలీ వివాదంపై తాజాగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రియాక్ట్ అయ్యారు. 'నాకు పవన్ కళ్యాణ్, అలీ ఇద్దరూ పరిచయమే... వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగడం తనకు బాధేసింది. ఇలాంటి సంఘటన జరుగుతుందని తాను ఊహించలేదు.' అన్నారు.

పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి కాదు

పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి కాదు

‘‘వీళ్లిద్దరితో నాకున్న పరిచయం కంటే వారి మధ్య ఉన్న అనబంధం ఎక్కువ. వాళ్లిద్దరూ ఇలా రోడ్డ మీదకు రావడం, పబ్లిగ్గా ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం బాధగా ఉంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఎవరి గురించి నెగెటివ్‌గా మాట్లాడే మనిషి కాదు. ఆయన పనేదో ఆయన చూసుకుంటారు. ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి నాలుగు మాటలు అన్నారేమో?''.. అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

అలీ అందుకే హర్ట్ అయ్యాడు

అలీ అందుకే హర్ట్ అయ్యాడు

‘‘పవన్ కళ్యాణ్ రాజకీయంగా చంద్రబాబు, జగన్, లోకేష్ మీద ఆరోపణలు చేశారు. అలీని కూడా రాజకీయంగా ఏమైనా అంటే ఫర్వాలేదు. కానీ నేను హెల్ప్ చేశాను అనే మాట అనేసరికి అలీ హర్ట్ అయ్యారు. ఈ ఇద్దరూ ఇలా కాకుండా ఒకరికొకరు ఫోన్లు చేసుకుని మాట్లాడితే బావుండేది. ఇలా పబ్లిక్‌లో విమర్శలు చేసుకోవడం బాలేదు'' అని వ్యాఖ్యానించారు.

కాదనడానికి మనం ఎవరం?

కాదనడానికి మనం ఎవరం?

రాజకీయాలు అనేవి వారి వారి ఇష్టం, కాదనడానికి మనకు హక్కు లేదు. అలీ కూడా ఆయన ఇష్ట ప్రకారం రాజకీయాలు చేస్తున్నారు. అలాంటపుడు పర్సనల్‌గా కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏముంది? పార్టీ పరంగా తిడితే ఆ పార్టీ నేతలతో పాటు అలీని తిట్టండి... అంతే కానీ నా మిత్రుడు, నేను సహాయం చేసిన వాడు అక్కడికి వెళ్లాడు అనే మాట సరైంది కాదని తెలిపారు.

మంచి మిత్రులు కూడా శత్రువులు అవుతారు

మంచి మిత్రులు కూడా శత్రువులు అవుతారు

ఎవరినీ ఎప్పుడూ ఒక మాట అనని అలీ కూడా పవన్ కళ్యాణ్ గురించి అలా అనేశారు. ఆయన బాధతో అని ఉండొచ్చు. కానీ మీడియా ముందుకు వచ్చి అనడం నాకు నచ్చలేదు. వారిద్దరూ నాకు మంచి మిత్రులు... వారిద్దరూ కూడా స్నేహితులు. రాజకీయాలు మంచి మిత్రులను కూడా శత్రువులను చేస్తుందనడానికి ఇది నిదర్శనం.

మనం కలుషితం అవుతున్నామా?

మనం కలుషితం అవుతున్నామా?

రాజకీయాలు మనకు అన్నం పెడతాయో లేదో? దేశాన్ని కాపాడుతుందో లేదో? తెలియదు. రాజకీయంలో ప్రస్తుతం ఉన్నవారంతా వారి వారి స్వార్థానికి వచ్చిన వారే. వీరిలోకి మన సినిమా వాళ్లం వెళ్లి కలుషితం అవుతున్నామా? అనే సందేహం వ్యక్తం చేశారు తమ్మారెడ్డి.

అలీ చాలా మంచి వ్యక్తి

అలీ చాలా మంచి వ్యక్తి

‘‘వీటన్నింటికీ బాగుచేద్దామనే వెళ్లాను అని కళ్యాణ్ గారు చెబుతున్నారు. బాగుచేస్తానని వెళ్లినపుడు కొంత ఓపిక పట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అలీ అటు వెళ్లి ఉండొచ్చు.. రేపు మన వద్దకు వస్తాడేమో? అలీ మంచి వాడు. ఆ విషయం మీకూ తెలుసు. ఆయన నలుగురికి మంచి చేసే వాడే తప్ప హాని చేసే వ్యక్తి కాదు. అతడిని అలాంటి మాట అనడం బాధాకరమైన విషయం. ఈ ఇద్దరూ మళ్లీ కలవాలని కోరుకుంటున్నాను'' అని తమ్మారెడ్డి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X