»   » కాస్టింగ్ కౌచ్: ఇండస్ట్రీ చీకటి రహస్యాలు విప్పిన ప్రముఖ దర్శకుడు, హీరోయిన్ల తల్లులే...

కాస్టింగ్ కౌచ్: ఇండస్ట్రీ చీకటి రహస్యాలు విప్పిన ప్రముఖ దర్శకుడు, హీరోయిన్ల తల్లులే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాస్టింగ్ కౌచ్... కేవలం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాదు చాలా చోట్ల జరుగుతున్న ఒక చీకటి వ్యవహారం. ఈ చీకటి దారిలో ప్రయాణించి అవకాశాలు దక్కించుకున్నవారు కొందరైతే, లైంగికంగా లొంగడం ఇష్టం లేక పరిశ్రమకు దూరంగా పారిపోయిన వారు కొందరు. మీడియా ముందు ఇలాంటి వ్యవహారాల గుట్టు నిర్భయంగా విప్పిన ధైర్యవంతులు మరికొందరు. అసలు కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో ఎలా మొదలైంది. ఇపుడు పరిశ్రమలో ఉన్న పరిస్థితులు ఏమిటి? అనే వివరాలు వెల్లడిస్తూ ప్రముఖ సినీయర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర కామెంట్ చేశారు.

ఇండస్ట్రీలో భజన చెయ్యాలి.. లేదా ఫేస్ బాగుండాలి
కాస్టింగ్ కౌచ్ నిజమే, రెండు కోణాలు

కాస్టింగ్ కౌచ్ నిజమే, రెండు కోణాలు

కాస్టింగ్ కౌచ్ అంటే సినిమాల్లో వేషాలు వేయడానికి వచ్చిన అమ్మాయిలను శారీరకంగా వాడుకోవడం. నిజమే ఒకప్పుడు ఇలా చేసేవారు. కానీ ఈ విషయంలో ఒక వైపే బయటకు చెప్పుకుంటున్నాం. రెండో సైడ్ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది... అంటూ తమ్మారెడ్డి ఈ విషయంలోకి ఎంటరయ్యారు.

ఒకప్పుడు దారుణంగా ఉండేది

ఒకప్పుడు దారుణంగా ఉండేది

ఒకానొకప్పుడు కొత్త ఆర్టిస్టులు వస్తే మేకప్, కాస్టూమ్, అసిస్టెంట్ డైరెక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలా రకరకాలుగా జరిగిన తార్కాణాలు ఉన్నాయి. లేవు అని నేను అనను. తర్వాత తర్వాత అది ఓన్లీ దర్శకుడు, ప్రొడ్యూసర్లకు పరిమితం అయిపోయింది. ఇవన్నీ ఇండస్ట్రీలో జరుగుతున్నది నిజమే.... అని తమ్మారెడ్డి తెలిపారు.

అప్పట్లో తల్లిదండ్రులే అలా...

అప్పట్లో తల్లిదండ్రులే అలా...

అయితే కాస్టింగ్ కౌచ్ అనే దానికి సెకండ్ సైడ్ ఉంది. అప్పట్లో తల్లిదండ్రులు తీసుకొచ్చి ఈ పిల్లను మీ చేతుల్లో పెడుతున్నాం బాబూ, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అనేవారు. ఇష్టం వచ్చింది అంటే ఏం చేస్తారు యాక్టింగ్ చేస్తారనే కదా ఆ పిల్లలు వచ్చింది. యాక్ట్ చేయించండి, పని నేర్పించండి అని చెప్పడంలో తప్పులేదు కానీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని ఎలా చెబుతారో అర్థం కాదు.... అని తమ్మారెడ్డి తెలిపారు.

ఆడవారి భాగస్వామ్యం కూడా ఉంది

ఆడవారి భాగస్వామ్యం కూడా ఉంది

‘చాలా మంది పాతతరం హీరోయిన్లు వాళ్ల ఆస్తులు ఏమైపోయాయి, వారు ఏమైపోయారు, వారి తల్లులే ముంచారని ఇప్పటికీ యూట్యూబ్ చూస్తే చాలా మంది హీరోయిన్ల తల్లులు ఏదో చేశారని చెప్పడం కనపడుతూ ఉంటుంది. లేకుంటే అక్కలు, బావలు వారి ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్న లేడీసే మోసం చేశారు, ముంచేశారు అని చాలా ఉంది. కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం మగ వాళ్లే చేస్తున్నారు అనడం సరికాదు. ఇందులో ఆడవారి భాగస్వామ్యం. కూడా ఉందని నా ఉద్దేశ్యం అంతే కాని మగాళ్లను వెనకేసుకు రావాలనేది నా ఉద్దేశ్యం కాదు. నేను సినిమాల్లో మగాళ్లను తిట్టినోన్నే, వారి తప్పుల గురించి చెప్పినవాడినే. మనం వన్ సైడెడ్ గా మాట్లాడుతున్నాం అనే ఫీలింగ్ నాలో ఉండిపోయింది...అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

కొందరు అలా కూడా చేస్తున్నారు

కొందరు అలా కూడా చేస్తున్నారు

మొన్న యూట్యూబులో ఓ వీడియో చూశాను. ఓ కుర్రాడు ఎవరో సినిమాలో వేషం వేస్తానంటే లేడీ ప్రొడ్యూసర్ ఏదో అడిగారని విన్నాను. ఇవన్నీ కొంచెం చూడాల్సిన అవసరం మనకు ఉంది. కాస్టింగ్ కౌచ్ అని ఊరికే మనం చెప్పేసి మొత్తం మగవారి మీదే తోసేయం కాదు. ఇప్పుడు లేటెస్టుగా వస్తున్న అమ్మాయిలు కొందరు అవకాశాల కోసం తమకు తాముగా కాస్టింగ్ కౌచ్ ఆఫర్ చేస్తున్నారు. కొంత మంది అందరూ కాదు.

మీలో టాలెంట్ ఉంటే...

మీలో టాలెంట్ ఉంటే...

ఈ సెక్స్ అనేది అంత ఇంపార్టెంట్ అయిపోయిందా? సెక్స్ వల్లే సినిమా అవకాశాలు వస్తాయా? ఇవన్నీ సెకండరీ. వారు పెర్ఫార్మ్ చేయగలగాలి, వారిలో టాలెంట్ ఉండాలి, అందం ఉండాలి, ఫోటోజెనిక్ గా ఉండాలి, అవన్నీ వదిలేసి ఎలాగైనా అయిపోవాలి అనుకునే వారికే ఇవ్నీ జరుగుతాయి. నిజంగా టాలెంట్, అందం, ఫోటో జెనిక్ గా ఉంటే అలా అడిగే వారికి నో చెప్పవచ్చు, బయట ఇంకా మంచి అవకాశాలు దక్కించుకోవచ్చు. బలవంతంగా రేప్ చేస్తే తప్పు. వీరు ఎట్లా అడుగుతున్నారో వారూ అట్లాగే అడుగుతున్నారు. అసలు ఈ అడగటం అనే పద్దతి మారాల్సిన అవసరం ఉంది. ఎంత సేపూ కాస్టింగ్ కౌచ్ అంటే మగవారే అడుగుతున్నారు అనడం తప్పు. ఆడవారు అడగటం కూడా తప్పు అనేది చెప్పాలి అనేది నా ఉద్దేశ్యం.... అని తమ్మారెడ్డి తెలిపారు.

అలాంటి వారిని ఏరిపారేయాలి

అలాంటి వారిని ఏరిపారేయాలి

మగవార అడగటం అయినా, ఆడవారు అడగటం అయినా.... రెండూ తప్పే. ఈ రెండు తప్పులు ఆగాలి. సెక్స్ అనేది మధ్యలోకి రాకూడదు అనేది నా ఉద్దేశ్యం. వారు ఫోటో జెనిక్ గా ఉన్నారా లేరా? వారు పెర్ఫార్మ్ చేయగలరా లేరా? వారికి పాషన్ ఉందా లేదా? చూడాలి. కొందరికి ఇంట్రస్టు లేకున్నా బలవంతంగా తోసేవారు ఉంటారు. చాలా బావుండి కూడా ఇంట్రస్టు లేని వారు ఉంటారు. అటువంటి వారందరినీ ఏరిపారేసి ఈ కాస్టింగ్ కౌచ్ అనే పదం అనేది ఇండస్ట్రీ నుండి వెళ్లి పోవాలి అనేది నా కోరిక. రెండు చేతులు కొడితేనే చప్పట్లు వస్తాయి. రెండు చేతులు కంట్రోల్ లోకి వెళ్లి వారి ప్రొఫెషన్ ధ్యేయంగా పెట్టుకుని చేయాలనేది నేను కోరుకుంటున్నాను.... అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

English summary
Tollywood Veteran Director Tammareddy Bharadwaj Reveals Shocking Facts of Dark Side of Film / Movie Industry and he speaks about Casting Couch Stories which undergo in celebs life. Finally he says, while we only get to see the onscreen happily-ever-afters, everything’s not so easy behind the scenes. Do share your answers in the comments section below.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu