»   » సుచీ లీక్స్: ఇంత శాడిస్టులు ఎవరో తేల్చాలంటున్న తమ్మారెడ్డి

సుచీ లీక్స్: ఇంత శాడిస్టులు ఎవరో తేల్చాలంటున్న తమ్మారెడ్డి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ సినీ పరిశ్రమను 'సుచీ లీక్స్' వ్యవహారం షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇంత జరుగుతున్నా..... ఈ ఇష్యూపై సినీ స్టార్లు స్పందించడం లేదు. ఈ వ్యవహారంలో పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడానికి కారణం ఇప్పటి వరకు ఎవరూ కంప్లైంట్ చేయక పోవడమే.

సినీ స్టార్లు స్పందించక పోవడానికి కారణం ఏమిటంటే..... ఇంస్ట్రీలో ఇదంతా కామన్ గా జరిగేదే? ఎవరైనా స్పందిస్తే అది వాళ్ల మెడకే చుట్టుకుంటుంది. ఆ భయంతోనే ఎవరూ నోరు విప్పడం లేదు అంటున్నారు.

ఇక పోతే 'నా ఆలోచన' పేరుతో యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిప్రాయాలు చెప్పే తమ్మారెడ్డి.... సుచి లీక్స్ ఇష్యూపై స్పందించారు.

అసలే సినిమా వాళ్లకి చాలా మంచి పేరు

అసలే సినిమా వాళ్లకి చాలా మంచి పేరు

సినిమా వాళ్లంటే జనాల్లో ఇప్పటికే చాలా మంచి అభిప్రాయం ఉంది. సుచి లింక్స్ తో ఇంకాస్తమంచి అభిప్రాయం వచ్చేసింది అంటూ వ్యంగంగా స్పందించారు తమ్మారెడ్డి.

నిజమా? లేదా? తేల్చాలి

నిజమా? లేదా? తేల్చాలి

ఈ లింక్ష్ కారణంగా పరిశ్రమ పరువు పోతోంది. నిజమా?లేదా? అన్నది తేల్చాలి. ఒకవేళ ఇవి నిజమతే.. ఈ వీడియోలు తీస్తున్న వాళ్లు ఎవరు? ఇంత శాడిస్టిక్ ఆలోచనలు ఎవరికి ఉన్నాయన్నది తేల్చాలి. అసలు వారిపై చర్యలు ఎందుకు తీసుకోరు? అంటూ తమ్మారెడ్డి ప్రశ్నించారు.

ప్రతిదీ కంప్లైంట్ చేయాలా?

ప్రతిదీ కంప్లైంట్ చేయాలా?

‘‘ప్రతి దానికి ఎవరో కంప్లైంట్ చేస్తేనే విచారణ చేయటం ఎందుకు? ఈ ఉదంతం బయటకు వచ్చి దాదాపు పది రోజులు అవుతోంది. ఇంత కాలం ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? చాలా సీరియస్ ఇష్యూ ఇది. వెంటనే చర్యలు తీసుకోవాలని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు.

rn

ఎంకరేజ్ చేయొద్దు

ఎంత సేపటికి తర్వాతి లింక్ ఏమిటన్నది చూస్తున్నారే కానీ.. ఎవరూ స్పందించడం లేదు. ఇలాంటి ఎంకరజ్ చేస్తూ పోతే.. ఇలాంటి ఇంకా ఇంకావస్తూనే ఉంటాయి.వీటిని అరికట్టాల్సిన అవసరం ఉందని తమ్మారెడ్డి అన్నారు.

English summary
Tollywood Veteran Director Tammareddy Bharadwaj questions why affairs In Film Industry Creating Sensation Now-a-days? He says cinema lovers should know first is it True or Fake?. Finally, he concludes that People should not encourage such kind of stuff and should be aware of Celebs Gossips.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu