twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ దారిలోనే నడవండి.. అనాధలమయ్యాం.. చిరంజీవికి తమ్మారెడ్డి ఝలక్

    By Rajababu
    |

    ప్రముఖ దర్శకుడు, దివంగత దాసరి నారాయణరావు జీవితంలోని కొన్ని విశేషాలను, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకొంటూ అందించిన పుస్తకం తెర వెనుక దాసరి. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు చిరంజీవి, రాఘవేంద్రరావు, సుబ్బిరామిరెడ్డి, మురళీమోహన్ రావు, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..

    Recommended Video

    మెగాస్టార్ కావొచ్చు...కానీ చెప్పుకోవడానికి ఏముంది?
    దాసరి మరణం తర్వాత

    దాసరి మరణం తర్వాత

    దాసరి మరణించిన తర్వాత చిత్ర పరిశ్రమలో తాము అనాధలుగా మారామనే ఫీలింగ్ ఏర్పడింది. ఈ సినిమా పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి ఎవరూ పూనుకొంటారు అనే అనుమానం తలెత్తింది.

     దాసరి తర్వాత చిరంజీవియే..

    దాసరి తర్వాత చిరంజీవియే..

    చిరంజీవి గారు మెగాస్టార్. చిత్ర పరిశ్రమకు సంబంధించి దాసరి నారాయణరావు గారి తర్వాత ఆయనే. పరిశ్రమ అభివృద్ధికి దాసరి ఎలా అయితే కృషి చేశారో.. అలానే చిరంజీవి ముందుకు రావాలి. చిత్ర పరిశ్రమకు సంబంధించిన కార్యక్రమాలను చిరంజీవి నెత్తిన వేసుకోవాలి అని కోరుకొంటున్నాను.

     అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ..

    అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ..

    పరిశ్రమలో వ్యక్తుల మధ్య అనేక బేధాభిప్రాయాలు ఉంటాయి. మన మధ్య ఎన్నో ఉంటాయి. కానీ పరిశ్రమ అంటే అవన్నీ పక్కన పెట్టాలి. దాసరి గారికి కొంత మందితో విభేదాలు ఉండేవి. కానీ అవేమీ ఆయన పట్టించుకోకుండా సమస్యల పరిష్కారానికి నడం బిగించేవారు.

     దాసరి బాటలో చిరంజీవి

    దాసరి బాటలో చిరంజీవి

    దాసరి గారి బాటలో చిరంజీవి నడువాలి. దాసరి చేపట్టినట్టుగానే చిరంజీవిగారు కార్యక్రమాలను కొనసాగించాలి. చిరంజీవి కూడా అంత ఓర్పుతో దాసరి ఆకాంక్షలను నెరవేర్చాలి. నెరవేరుస్తారు అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

    చిరంజీవికి థ్యాంక్స్

    చిరంజీవికి థ్యాంక్స్

    తెర వెనుక దాసరి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్న చిరంజీవి, అల్లు అరవింద్, సుబ్బిరామిరెడ్డికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ద్వారా మరోసారి అందరి కలుపడమే కాకుండా మళ్లీ దాసరిని గుర్తు చేశాడు.

     ఆయనతో అనుబంధం

    ఆయనతో అనుబంధం

    ఇక తెర వెనుక దాసరి పుస్తకంలో దాసరితో ఉన్న అనుబంధాన్ని తమ్మారెడ్డి భరద్వాజ అక్షరరూపంలో వెలువరించారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఏ కార్యక్రమమైనా, ఏ సమస్య వచ్చినా భరద్వాజకు ఫోన్ చేయమనేవారట. ఆయనకు సమగ్రమైన అవగాహన కలిగి ఉంటారు అని చెప్పేవారట. సినిమా పరిశ్రమలో దాసరితో అలాంటి అనుబంధం ఏర్పడటం నాకు చాలా గర్వంగా ఉంటుంది

     దాసరి స్పందించిన తీరు

    దాసరి స్పందించిన తీరు

    నేను చిరంజీవితో కోతల రాయుడు సినిమా తీస్తున్న సమయంలో దాసరిగారంటే ఇండస్ట్రీ.. ఇండస్ట్రీ అంటే దాసరి గారు. కోతలరాయుడు తర్వాత మొగుడు కావాలి చిత్రాన్ని తీసాను. ఆ చిత్ర రిలీజ్‌ విషయంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుుడు దాసరిగారు స్పందించి నాకు సహాయం చేసింది. అప్పటి నుంచి మా మధ్య అనుబంధం బాగా బలపడింది అని అని తమ్మారెడ్డి భరద్వాజ పుస్తకంలో పేర్కొన్నారు.

    English summary
    Chiranjeevi launches Tera Venuka Dasari Book. Allu Aravind, K Raghavendra Rao, C Kalyan, Tammareddy Bharadwaj, T Subbarami Reddy, Murali Mohan, Kodi Ramakrishna at the event. In this occassion, Tammareddy Bharadwaja speaks his mind about Dasari Narayana Rao.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X