twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ దుర్మార్గులు చేసే తప్పుడు పనుల వల్లే ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్: తమ్మారెడ్డి

    By Bojja Kumar
    |

    Recommended Video

    Tammareddy Bharadwaj Gets Serious On Media

    ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలా గొడవలు జరిగాయి. దీంతో ఇండస్ట్రీ మీద ప్రతి వారికి ఒక చులకన భావం ఏర్పడింది. ఊళ్లో ఎవరైనా ప్రాసిట్యూట్ పట్టుబడినా సినిమా వాళ్లు అంటున్నారు, డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చినా సినిమా వారితో లింకు పెడుతున్నారు. మొన్న ఏదో దొంగతనం కేసులో కూడా సినిమా ఇండస్ట్రీ పేరు వినిపించింది. దీంతో చాలా మంది ఆడ పిల్లలను సినిమా ఇండస్ట్రీకి పంపించడానికి భయపడుతున్నారు. బయట ప్రచారం జరుగుతున్నట్లు ఇండస్ట్రీ అంతదారుణంగా అయితే ఏమీలేదని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు.

    మీడియాతో సమస్యలు పరిష్కారం కావు

    మీడియాతో సమస్యలు పరిష్కారం కావు

    ఇండస్ట్రీలో ఏం జరిగినా మీడియా ద్వారా వార్తలు వెలుగులోకి వచ్చినంత తొందరగా యాక్షన్ తీసుకోవడం కుదరదు. దానికి సంబంధించిన వారు ఎవరో ఒకరు కంప్లయింట్ ఇవ్వాలి, ఎవరైతే విక్టిమ్ అవుతారో వారు ఇండస్ట్రీలోని సంబంధిత యూనియన్లో, లేదా ఫిల్మ్ చాంబర్లో ఫిర్యాదు చేయాలి. లేదా పోలీసులకు చెప్పాలి. ఇలా ఎవరికీ కంప్లయింట్ ఇవ్వకుండా సినిమా వాళ్లు అన్యాయం చేశారు అని మీడియా ముందుకు వెళితే ఎలా? చాలా మంది కంప్లయింట్ ఇవ్వడానికి కానీ, కేసు పెట్టడానికి కానీ ఆసక్తి చూపడం లేదు. దాన్ని మీడియాలో హడావుడి చేయడానికే ప్రయత్నిస్తున్నారు. మీడియాలో ఇలా రచ్చ చేయడం వల్ల పనులు జరుగుతాయని, పరిష్కారం అవుతాయి అనుకుంటే అది మీ అమాయకత్వమే అవుతుంది.... అని తమ్మారెడ్డి అన్నారు.

    ఇండస్ట్రీలో చాలా మార్పు వచ్చింది

    ఇండస్ట్రీలో చాలా మార్పు వచ్చింది

    ఈ మధ్య కాస్టింగ్ కౌచ్ గురించిన గొడవ తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పు వచ్చింది. కమిటీలు వేశారు. కొన్ని రూల్స్ పెట్టారు. స్త్రీలను ఆడిషన్ చేయాలంటే ఇలా చేయాలి అని కొన్ని నిబంధనలు పెట్టారు. ఇలా రకరకాలుగా మంచి మంచి చర్యలు చేపట్టారు. త్వరలోనే వాటి గురించి అనౌన్స్ చేస్తారు... అని తమ్మారెడ్డి తెలిపారు.

    ఇండస్ట్రీ పేరెత్తితో కొట్టే స్థితికి తీసుకెళ్లారు

    ఇండస్ట్రీ పేరెత్తితో కొట్టే స్థితికి తీసుకెళ్లారు

    కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల వల్ల ఆడ పిల్లలు ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి వెళతాను అంటే తల్లిదండ్రులు కొట్టే పరిస్థితి ఏర్పడింది. కొందరు దీన్ని ఆ స్థితికి తీసుకెళ్లారు. అంత అన్యాయం అయితే ఇక్కడ లేదు. స్త్రీల మీద అత్యాచారాలు జరుగడం లేదా? అంటే ప్రతి చోటా జరుగుతున్నాయి. ప్రతి వ్యవస్థలోనూ జరుగుతున్నాయి. వీటన్నింటినీ ఆపాల్సిన బాధ్యత సభ్య సమాజంలో ఉన్న ప్రతి మనిషికీ ఉంది. కేవలం సినిమా ఇండస్ట్రీలోనే ఇలా జరుగుతుంది అని అల్లరి చేసి, పరిశ్రమ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడి చిన్న దాన్ని ఇంత పెద్దగా చేసి చూపొద్దు.... అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

    రోడ్డు మీదకు వెళ్లి అరిస్తే ఎలాంటి లాభం ప్రయోజనం ఉండదు

    రోడ్డు మీదకు వెళ్లి అరిస్తే ఎలాంటి లాభం ప్రయోజనం ఉండదు

    స్త్రీల మీద అత్యాచారాలు జరుగటం లేదా? అంటే జరుగడం లేదు అని నేను అనడం లేదు. దాన్ని ఆపే విధానాన్ని గురించి మాట్లాడుకుందాం. దాన్ని అరికట్టడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. ఊరికే రోడ్డు మీదకు వెళ్లి అరిస్తే ఎలాంటి లాభం ప్రయోజనం ఉండదు. మూడు నెలల నుండి అరుస్తున్నారు ఏం జరిగింది? కూర్చుని చర్చించుకోవాలి. మార్గాలు వెతకాలి, దీన్ని సాల్వ్ చేయడానికి ఇండస్ట్రీ పెద్దలు మార్గాలు వెతుకుతున్నారు. అందరూ సహకరిస్తే అతి త్వరలో చాలా వరకు క్లారిటీ వస్తుంది. మంచి జరుగుతుంది అని అనుకుంటున్నాను... అని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు.

    దుర్మార్గులు, దుష్టులు చేసే తప్పుడు పనుల వల్ల బ్యాడ్ నేమ్

    దుర్మార్గులు, దుష్టులు చేసే తప్పుడు పనుల వల్ల బ్యాడ్ నేమ్

    సమాజంలో ఎవరూ సినిమా ఇండస్ట్రీకి రావడానికి భయపడాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ మంచిదే. కొంత మంది దుర్మార్గులు, దుష్టులు చేసే తప్పుడు పనుల వల్ల బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇలాంటి వారిలో మగవారు ఉన్నారు, ఆడవారు ఉన్నారు. సినిమా పేరు అడ్డం పెట్టుకుని మోసం చేస్తున్న వారిని గుర్తించాలని మేము ఎన్నో సార్లు చెప్పాం. కొందరు అమాయకంగా వెళ్లి మోసపోతున్నారు. ఎవరైనా ఆడిషన్ వెళితే దాని గురించి పూర్తిగా కనుక్కుని వెళ్లండి. అనుమానం ఉంటే వెళ్లొద్దు. మీరు అలా వెళ్లి మోస పోతే ఎవరూ ఏమీ చేయలేరు. పోలీసులు కూడా హెల్ఫ్ చేయలేదు, ఇండస్ట్రీ కూడా హెల్ప్ చేయలేదు. చివరకు మేము పెట్టిన కమిటీలు కూడా హెల్ప్ చేయలేవు. ఇప్పటికైనా అందరూ కళ్లు తెరవండి.... అని తమ్మారెడ్డి అన్నారు.

    English summary
    Tollywood Veteran Director Tammareddy Bharadwaj says don't be Scared to get into Movie Industry to all the women / Female aspirants who want to make a career in film industry. Finally, he made some interesting comments on present Cinema Industry & media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X