»   » కృష్ణ వంశీ ‘నక్షత్రం’ మరో పోస్టర్.... బాబోయ్ ఇతడు విలనా?

కృష్ణ వంశీ ‘నక్షత్రం’ మరో పోస్టర్.... బాబోయ్ ఇతడు విలనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న 'నక్షత్రం' సినిమాకు సంబంధించి ఇప్పటికే సందీప్ కిషన్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్, సాయి ధరమ్ తేజ్, ప్రకాశ్ రాజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో లుక్ విడుదలైంది.

ఇప్పటి వరకు మనకు చిన్న చిన్న సినిమాల్లో హీరోగా, కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లతో కనిపించిన యువ నటుడు తనీష్ ఈ చిత్రంలో విలన్ గా కనిపించబోతున్నాడని తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ బట్టి స్పష్టమవుతోంది.


ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేసి..చేసీ రామ్ చరణ్ కూడా ఇంకా ఎన్ని ఫస్ట్ లుక్స్ వంశీ గారు అంటూ వ్యాఖ్యానించారు. మరి కృష్ణ వంశీ ఈ సినిమా ద్వారా ఏం మ్యాజిక్ చేయబోతున్నారో ఏంటో తెలియదు కానీ ఫస్ట్ లుక్ పోస్టర్లతో సినిమాపై హైప్ ఓ రేంజిలో పెంచుతున్నారు. "పోలీస్" అవ్వాలనే ప్రయత్నం లో వున్న ఓ యువకుడి కథే ఈ "నక్షత్రం" అని తెలిపారు దర్శకుడు కృష్ణ వంశీ.


rn

నక్షత్రం మూవీలో తనీష్ లుక్

యువ నటుడు తనీష్ ఈ చిత్రంలో విలన్ గా కనిపించబోతున్నాడని తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ బట్టి స్పష్టమవుతోంది.


ప్రకాష్ రాజ్

కృష్ణ వంశీ సినిమాల్లో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు కీలకమైన పాత్రలు ఉంటాయి. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.ఇక సందీప్ కిషన్ ఈ సినిమాలో ఓ కానిస్టేబుల్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. పోలీస్ అవ్వడమే ధ్యేయంగా ఎదిగిన ఓ కుర్రాడు మొదట కానిస్టేబుల్ గా తన కెరీర్ ను ఆరంభించి.. ఆ తర్వాత ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది "నక్షత్రం" చిత్ర కథాంశం అని తెలుస్తోంది!


సాయి ధరమ్ తేజ్

ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ అలెగ్జాండర్‌ పాత్రలో కనిపించనున్నాడు. అలెగ్జాండర్ అందరి మనసుల్ని దోచేస్తాడని సాయిధరమ్‌ తేజ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ శక్తిమంతమైన పాత్రని పోషిస్తుండడం సాయిధరమ్‌ తేజ్‌ అదృష్టం అన్నారు రామ్‌చరణ్‌.


rn

సందీప్ కిషన్

ఈ మూవీలో కొన్ని యాక్షన్ సన్నివేశాల్ని డూప్స్ లేకుండా చేసిన సందీప్ ఓ కార్ ఛేజింగ్ సన్నివేశాన్ని చేసేందుకు ఎలాంటి సెక్యూరిటీ కోరలేదట. ఇందులో కార్లన్నీ 150 కి. మీ వేగంతో వెళుతుంటే సందీప్ తన కారుతో వాటికి ఎదురుగా వెళతాడట. ఈ సన్నివేశం సినిమాలో హైలెట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక కొన్ని సన్నివేశాలలో సందీప్ మేకప్ లేకుండానే కనిపిస్తాడని సమాచారం.


రెజీనా

అలాగే ఈ చిత్రంలో లంబాడీ పిల్ల గా రెజీనా కనిపించనుండగా.. ఆ పాత్రలో ఒదిగేలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు ఈ క్రేజీ డైరెక్టర్. ఏదేమైన మంచి కసితో ఈ సినిమా చేస్తోన్న కృష్ణవంశీ మంచి హిట్ కొడతాడని అంటున్నారు. ఇందులోని నటీనటులకు కూడా మంచి గుర్తింపు వస్తోందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


English summary
Tanish's OFFICIAL FIRST LOOK from Nakshatram Latest Telugu Movie, directed by Krishna Vamsi. RamCharan launched the TanishFirstLook. Nakshatram movie ft. Sundeep Kishan, Sai Dharam Tej, Regina Cassandra and Pragya Jaiswal. Movie is produced by K. Srinivasulu, S. Venugopal and Sajju.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu