»   » హీరోయిన్ పట్ల టీవీ చానల్‌లో నీచంగా... క్షమాపణ చెప్పిన యాజమాన్యం!

హీరోయిన్ పట్ల టీవీ చానల్‌లో నీచంగా... క్షమాపణ చెప్పిన యాజమాన్యం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో లీడింగ్ ఛానల్ గా ఉన్న కలర్స్ ఛానల్ ఇటీవల ఓ కార్యక్రమంలో జరిగిన సంఘటనతో ఇబ్బందుల్లో పడింది. కలర్స్ ఛానల్‌లో ప్రసారమయ్యే కామెడీ షో 'కామెడీ నైట్ బచావో' కు పర్చేడ్ మూవీ నటి తనిస్థా ఛటర్జీని వచ్చారు.

పర్చేడ్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తనిష్ఠా ఈ షోకు రాగా... ఆమె స్కిన్ కలర్ విషయంలో ఆ షో యాంకర్ నీచమైన కామెంట్స్ చేయడం వివాదాస్పదం అయింది. ఆమె శరీరరంగు గురించి వెటకారంగా కామెంట్స్ చేసాడు. మీరు 'నల్లరేగు పళ్లంటే మీకు చాలా ఇష్టమనుకుంటా... ఎప్పటి నుంచి తింటున్నారు.. చిన్నప్పటి నుంచి తింటున్నారా' అంటూ ఆమె చర్మం రంగును హేలన చేస్తూ కామెంట్స్ చేసారు.

ఘాటుగా స్పందించిన తనిష్ఠా

ఘాటుగా స్పందించిన తనిష్ఠా

కలర్స్ ఛానల్ షోలో తనకు ఎదురైన అనుభవం గురించి తనిష్ఠా ఘాటుగా స్పందించారు. ఫేస్‌బుక్ వేదికగా కలర్స్ ఛానల్‌ తీరు ఎండగడుతూ భారీ లేఖను పోస్టు చేసింది.

నల్లగా ఉండటం శాపమా

నల్లగా ఉండటం శాపమా

ఇండియాలో నల్లగా ఉండటం పెద్ద శాపంగా మారిందని, కొన్ని ఫెయిర్ నెస్ క్రీమ్ కంపెనీలు, మ్యాట్రిమొనీ సంస్థలు నల్లగా ఉన్న యువతికి పెళ్లే కాదన్నట్టు యాడ్స్ గుప్పిస్తున్నాయని ఆమె తన లేఖలో రాసుకొచ్చారు.

ఛానల్ మీద విమర్శలు

ఛానల్ మీద విమర్శలు

కలర్స్ ఛానల్స్ మీద ఆమె సంధించిన లేఖ చాలా మందిని కదిలించింది. పలువురు ఛానల్ తీరును ఎండగడుతూ విమర్శలకు దిగారు. తనిష్టా చటర్జీకి దేశ వ్యాప్తంగా ప్రముఖుల నుండి మద్దతు లభించింది.

క్షమాపణ చెప్పిన ఛానల్ యాజమాన్యం

క్షమాపణ చెప్పిన ఛానల్ యాజమాన్యం

తనిష్ఠా చటర్జీ ఫేస్‌బుక్ పోస్ట్‌కు కలర్స్ టీవీ ఛానల్ దిగిరాక తప్పలేదు. జరిగిన సంఘటన చాలా బాధకరం అని, యాంకర్ తప్పిదం వల్లనే ఇలా జరిగిందని, ఈ ఘటనపై క్షమాపణ చెబుతున్నట్టు ప్రకటించింది కలర్స్ ఛానల్.

పార్చ్‌డ్

పార్చ్‌డ్

రాధికా ఆప్టే.. తనిష్ఠా ఛటర్జీ.. సుర్వీన్‌ చావ్లా.. అదిల్‌ హుస్సేన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం పార్చ్‌డ్‌. ఇటీవలే ఈ సినిమా రిలీజైంది. ఈ చిత్రం న‌లుగురు మ‌హిళ‌ల క‌థ‌. గుజ‌రాత్‌లోని ఉజాస్ అనే కుగ్రామం బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ చిత్రంలో వైవాహిక అత్యాచారం, బాల్య‌వివాహం, లింగ‌వివ‌క్ష వంటి సామాజిక అంశాల‌ను హైలైట్ చేశారు.

English summary
After Tannishtha Chatterjee was ‘roasted’ for the colour of her skin on Comedy Nights Bachao Taaza and posted a strongly-worded statement on Facebook, the channel has apologised to the actress.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu