»   » హాట్ టాపిక్ : తాప్సీ ...రెండేళ్ల సహజీవనం

హాట్ టాపిక్ : తాప్సీ ...రెండేళ్ల సహజీవనం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలీవుడ్ లో హీరోలు,హీరోయిన్స్ సహజీవనం అనేది చాలా కాలంగా జరుగుతున్న వ్యవహారం. అక్కడ ఫలానా హీరో,హీరోయిన్..లివ్ ఇన్ రిలేషన్ షిప్ అన్నా పెద్దగా పట్టించుకోరు. కానీ తెలుగు పరిశ్రమలో సహజీవనం అనగానే ఉలిక్కిపడతారు. అయితే మనకు ముంబై నుంచి, డిల్లీ నుంచి హీరోయిన్స్ దిగుమతి అవుతున్న నేపధ్యంలో సహజీవనం అనేది కామన్ అయ్యే వాతావరణం కనపడుతోంది. తాజాగా తాప్సీ ఇచ్చిన స్టేట్ మెంట్ దానికి ఊతమిచ్చినట్లైంది.

తాప్సీ మాట్లాడుతూ...''అగ్ని సాక్షిగా' అని చెప్పి ఎవరో ముక్కూ మోహం తెలీని వ్యక్తితో ఏడడుగులు వేయమనడం నిజంగా అన్యాయం. నా దృష్టిలో అది పెళ్లే కాదు. ఒకర్ని గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్నవారే నా దృష్టిలో పెళ్లికి అర్హులు. నా వరకూ నేను పెళ్లాడాలనుకుంటే... ముందు సదరు వ్యక్తితో రెండేళ్ల పాటు సహజీవనం చేస్తాను. తన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకుంటాను. తను సరైనవాడే అని నమ్మకం కుదిరాకే పెళ్లి. అయితే... సహజీవనం నెపంతో తప్పులు చేసే వ్యక్తిత్వం కాదు నాది. నా తల్లిదండ్రులు నా చుట్టూ గీచిన గీతను ప్రాణం పోయినా దాటను'' అని చెప్పారు తాప్సీ.

అలాగే... ''ప్రపంచ దేశాలన్నీ తలవంచి గౌరవించే మన వివాహవ్యవస్థపై నాకు మాత్రం నమ్మకం లేదు'' అని సంచలన వాఖ్యలు చేశారు ఢిల్లీ భామ తాప్సీ. తెరపై అమాయకంగా కనిపించే తాప్సీ నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం అందరినీ షాక్ కి గురి అయ్యేలా చేసింది. పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటి? మీకు కాబోయే భర్తకు ఎలాంటి లక్షణాలుండాలి? అని ఇటీవలే మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా తాప్సీ పై విధంగా సమాధానమిచ్చింది.

ఈ రోజు తాప్సీ పుట్టినరోజు. ...ఈ సందర్భంగా స్పెషల్ స్టోరీ స్లైడ్ షోలో...

ఎక్సపోజింగ్...అదుర్స్

ఎక్సపోజింగ్...అదుర్స్


హిట్టు, ప్లాప్ లతో సంభదం లేకుండా తమిళ, తెలుగు భాషల్లో దూసుకుపోతున్న తాప్సీ. ఈ ఢిల్లీ బ్యూటీ తన వరస ఆఫర్స్ తో తోటి హీరోయిన్స్ కి ఝలక్ ఇస్తోంది. అంతేగాక తన ఎక్సపోజింగ్ తో అందరినీ తన వైపుకు లాక్కుంటోంది. ఆమెకు హిట్టు ఒకటే తక్కువ కానీ...లేకపోతే నెంబర్ వన్ పొజీషన్ లో ఉండేదంటున్నారు. అయితే ఆ హిట్ కూడా సాహసం తో వచ్చింది.

నటన కూడా...

నటన కూడా...

గోపీచంద్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి రూపొందించిన 'సాహసం' ఇటీవల విడుదలై ఇటు ప్రేక్షకుల ఆదరణనీ, అటు విమర్శకుల ప్రశంసల్నీ అందుకుంటోంది. 'సాహసం' చిత్రంలో తాప్సీ చేసిన శ్రీనిధి పాత్రకు ఎంతో పేరు వచ్చింది. ఈ మధ్య మంచు లక్ష్మీప్రసన్న నిర్మించిన 'గుండెల్లో గోదారి'లో నెగటివ్ టచ్ ఉన్న సరళ పాత్రను చక్కగా పోషించి విమర్శకుల ప్రశంసలందుకున్న ఢిల్లీ సుందరి తాప్సీ తాజాగా అదే తరహా అభినందనలు అందుకుంటోంది.

మంచి రోజులు వచ్చాయి

మంచి రోజులు వచ్చాయి

తాప్సీ మాట్లాడుతూ "చాలా రోజులుగా నేను ఎదురు చూస్తున్న రోజు వచ్చింది! తొలి వారాంతానికి 70 శాతం బడ్జెట్ రికవరీ అవడంతో 'సాహసం' హిట్టయ్యిందని సంతోషంగా చెబుతున్నా. దీనికి కారకులైన మీకు థాంక్స్. ఈ సినిమాలో నేను చాలా అందంగా కనిపించానని ప్రశంసలు వస్తున్నాయి. ఈ విషయంలో నాకు మేకప్ చేసిన నిక్కీ రజనికీ, కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన దివ్య, లిప్సకు థాంక్స్ చెప్పుకుంటున్నా'' అని తెలిపింది.

‘గంగ' లో మునుగుతోంది

‘గంగ' లో మునుగుతోంది

‘కాంచన' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత మళ్లీ దర్శకుడు రాఘవ లారెన్స్, నిర్మాత బెల్లంకొండ సురేష్ కాంబినేషన్లో ‘ముని-3' భారీ చిత్రం రాబోతున్న సంగతి తెలిసందే. లారెన్స్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించే ‘ముని-3'లో తాప్సీ హీరోయిన్. ఈ చిత్రానికి గంగ అనే టైటిల్ పెట్టారు.

రిస్క్ అయినా...

రిస్క్ అయినా...

‘గంగ' సినిమా కోసం తాప్సీ ఎలాంటి రిస్క్ సీన్లయినా చేయడానికి సై అంటోంది. భయం అనేదే లేకుండా తెగింపుగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం చెన్నైలో ఈమెపై కొన్ని యాక్షన్ సన్నివేశాలను తీస్తున్నారు. ఓ సీన్ కోసం 12గంటలు నీళ్ళలో గడిపింది. అంతసేపు నీళ్లలో గడపడం వల్ల అందం, ఆరోగ్యం పాడవుతుందని, డూప్‌తో ఆ సీన్ చేద్దామని....దర్శక నిర్మాతలు చెప్పినా తాప్సీ వినకపోగా తానే చేస్తానని పట్టుబట్టిందట.

తాప్సీ మాట్లాడుతూ

తాప్సీ మాట్లాడుతూ

తన కెరీర్లో ఎన్నడూ చేయని దమ్మున్న పాత్ర ‘గంగ' లో చేస్తున్నానని, ప్రేక్షకులను మెప్పిస్తాననే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది. మరి తాప్సీ కష్టానికి తగిన విధంగా ఈ సినిమా ఫలితం ఉండాలని ఆశిద్దాం. రాఘవ లెరెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి ఫోటోగ్రఫీ: కిచ్చా, సంగీతం: విజయ్ ఆంథోని, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

తాప్సీ ఎస్సెట్..

తాప్సీ ఎస్సెట్..

తాప్సీ తొలి సినిమా నుంచి నటన కన్నా అందాల ఆరబోత కే ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. అందుకే ఝుమ్మందినాదం ప్లాప్ అయినా ఆమెకు డిమాండ్ తగ్గలేదు. కేవలం తాప్సీ కోసం ఆ సినిమా చూడాలనేవాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తాప్సీ ఎంటర్ అవగానే ఇండస్ట్రీలో అందరి దృష్టిలో పడింది. అయితే ఇప్పుడు తాను రూటు మారుస్తానంటోంది. గుండెల్లో గోదావరి చిత్రంలో తన నటనా విన్యాసాలు చూడమని సవాల్ విసురుతోంది. సినిమా రిలీజ్ అయితేగానీ అది పబ్లిసిటీ స్టంటా లేక తాప్సీ లో నటి నిజంగా ఉందా అనే విషయం నిర్ధారణ కాదు.

బర్తడే విషెష్...

బర్తడే విషెష్...

కెరీర్ ప్రారంభం నుంచీ పెద్ద హీరోలతోనే తన ప్రయాణం అన్నట్లుగా ఆచి తూచి అడుగులు వేస్తూ తన డైరీని ఖాళీ లేకుండా బిజీ చేసుకుంటోంది. తమిళ భాషలో సైతం ఆమెకు ఉన్న క్రేజ్ తో రెమ్యునేషన్ లోనూ ఆమె టాప్ స్ధాయిలోనే ఉంది. సరైన హిట్ పడితే నెంబర్ వన్ పొజీషన్ కి ఆమె చేరుకుంటుది. ప్రస్తుతం తమిళంలో ఆర్య సరసన 'వాలై', లారెన్స్ సరసన 'ముని 3' సినిమాలు చేస్తోంది తాప్సీ . ఆమెకు ధట్స్ తెలుగు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

English summary
With those sexy dimples on her cheeks, cute heroine Taapsee Pannu shared that she is interested more in live-in relationship. When quizzed about her Mr Perfect in real life and marriage, the hot beauty gave some interesting answers. ‘I’m not ready to believe into the institution of marriage and being with someone for life. I may first enter into live-in relationship with him and take a decision after 2-3 years’, says Taapsee. ‘I’ll not do anything against the wishes of my parents and against something that brings insults to my family’, she added.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu