»   » పాపం...తాప్సీ అంతకుమించి ఏం చేయగలదు

పాపం...తాప్సీ అంతకుమించి ఏం చేయగలదు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : ''నేను సినిమాల్లోకి వచ్చింది మంచి పాత్రలు పోషించి నా నటనతో ప్రేక్షకుల్ని అలరించడానికి. అంతే కానీ నా తోటి హీరోయిన్స్ తో పోటీ పడటానికి కాదు. అలా చేయడానికి ఇదేమైనా ఆట స్థలమా, లేక పోరాటమా? నటనలో పోలికలు, పోటీలకు స్థానం లేదు'' అంటోంది తాప్సి. వెనకడిబడిపోయాననే విషయం ఒప్పుకోకుండా తాప్సీ ఇలా దాన్ని ఇలాంటి మాటలతో కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. దాంతో తాప్సీ ఇంతకు మించి ఏం చేయగలదు అని సానుభూతి చూపిస్తున్నారు.

  Tapsee says there is no competition for her

  'ఝుమ్మందినాదం'తో వెండితెరకు పరిచయమైన తాప్సి తొలి నుంచి గ్లామర్‌ పాత్రలే పోషిస్తూ వచ్చింది. మధ్యలో 'గుండెల్లో గోదారి' వంటి నటనా ప్రాధన్యమున్న పాత్రలు కూడా చేసింది. ఈ సమయంలో సరైన విజయాలు అందుకోలేకపోయినా ఎప్పుడూ నిరాశ పడలేదు. మీ తోటి హీరోయిన్స్ వరుస సినిమాలతో దూసుకుపోతుంటే మీరేంటి వెనుకబడిపోయారు అని ఎవరన్నా అంటే ఇలా సమాధానమిస్తోంది.

  ''నాకు మంచి పాత్రలు కావాలి. ఆ పాత్రలను తల్చుకుంటే తాప్సి గుర్తుకు రావాలి. ఏదో సినిమాలు చేసేశాం, నాలుగు రాళ్లు వెనకేసుకున్నాం అనే పద్ధతి కాదు నాది'' అంటూ గట్టిగానే చెప్పేది. తాప్సి ప్రస్తుతం 'ముని3: గంగ', తమిళంలో 'వాయ్‌ రాజా వాయ్‌'లో నటిస్తోంది. ఆమె హిందీలో చేసిన రెండో చిత్రం 'రన్నింగ్‌ షాదీ డాట్‌ కామ్‌' త్వరలో విడుదల కాబోతోంది. మరి బాలీవుడ్‌లోనూ తాప్సి ఇదే మంత్రాన్ని పఠిస్తుందా అంటున్నారు.

  English summary
  
 Tapsee quickly affirms “In film industry nobody can snatch somebody else’s opportunity. Everybody will have their opportunities. I have widened my boundaries to Tamil and Hindi industries as well. I have very good offers coming in from there. So I never felt like somebody is a competition to me”.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more