»   » బికినీ వేసుకోవడం ఏమైనా నేరమా? అర్థం చేసుకోండి : తాప్సీ

బికినీ వేసుకోవడం ఏమైనా నేరమా? అర్థం చేసుకోండి : తాప్సీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాఘవేంద్రరావు తన బొడ్డు మీద కొబ్బరి చిప్పలతో కొట్టిన అంశాన్ని హీరోయిన్ తాప్సీ ఓ టీవీ షోలో రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తాప్సీకి, తెలుగు సినీ అభిమానులకు మధ్య కొన్ని రోజుల క్రితం చాలా పెద్ద చర్చ జరిగింది.

ప్రస్తుతం తాప్స హిందీలో 'జుడ్వా 2' అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో అమ్మడు బికినీ అందాలు ఆరబోసింది. తాప్సీ ఎక్స్ ఫోజింగ్ కాస్త ఓవర్ డోస్ అయిందనే విమర్శలు తెలుగు అభిమానుల నుండి వినిపిస్తున్నాయి.

బికినీ వేయడం ఏమైనా నేరమా?

బికినీ వేయడం ఏమైనా నేరమా?

నేను బికినీ వేస్తే అదేదో పెద్ద నేరం అయినట్లు మాట్లాడుతున్నారు. సినిమాకు, నేను చేసే పాత్రకు అవసరం కాబట్టే బికినీ వేశాను అంటూ.... ఈ విషయంలో తనను ఆడిపోసుకుంటున్న వారికి తాప్సీ సమాధానం ఇచ్చింది.

అర్థం చేసుకోండి

అర్థం చేసుకోండి

నామ్ శబానా సినిమాలో పాత్ర కోసం నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను. తర్వాత ‘జుడ్వా 2' సినిమాలో సెక్సీగా, గ్లామరస్ లుక్ తో కనిపించేందుకు వెయిట్ కొంచెం పెరగాల్సి వచ్చింది. ఇందుకోసం చాలా కష్టపడ్డాను. సినిమాలకు అవసరం అయ్యే పాత్ర కోసమే తాను ఇదంతా చేస్తున్నానని అందరూ అర్థం చేసుకోవాలి అని తాప్సీ అంటోంది.

జుడ్వా 2

జుడ్వా 2

బాలీవుడ్లో తెరకెక్కుతున్న 'జుడ్వా 2'లో వరుణ్ ధావన్, తాప్సీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి డేవిడ్ ధావన్ దర్శకుడు. 1997లో వచ్చిన 'జుడ్వా' చిత్రానికి ఇది రీమేక్. అప్పట్లో వచ్చిన 'జుద్వా' చిత్రంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించగా...... డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించారు. 23 ఏళ్ల తర్వాత అదే దర్శకుడు తన కొడుకు వరుణ్ ధావన్ హీరోగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

వరుణ్ ధావన్ ద్విపాత్రాభినయం

1994లో నాగార్జున హీరోగా ఇవివి సత్యనారాయణ తెరకెక్కించిన ‘హలో బ్రదర్' చిత్రానికి హిందీ రీమేక్ ‘జుద్వా'. ఇపుడు అదే చిత్రానికి సీక్వెల్‌గా ‘జుద్వా 2' తెరకెక్కించారు. ఈ చిత్రంలో వరుణ్ ధావన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రేమ్ అనే క్లాస్ పాత్రలో, రాజా అనే మాస్ పాత్రలో నటిస్తున్నాడు. ట్రైలర్ చూస్తుంటే హలో బ్రదర్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతోంది.

హాట్ హాట్ సీన్లు

హాట్ హాట్ సీన్లు

ఈ చిత్రంలో వరుణ్ ధావన్, తాప్సీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మధ్య హాట్ హాట్ సీన్లు చిత్రీకరించారు. ముఖ్యంగా వీరి మధ్య వచ్చే ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు ప్రేక్షులను బాగా ఎంటర్టెన్ చేయబోతున్నాయి.

కమర్షియల్ ఎలిమెంట్స్

కమర్షియల్ ఎలిమెంట్స్

కమర్షియల్ అంశాలకు ఏమాత్రం లోటు లేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సినీ రంగంలో దర్శకుడిగా దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉన్న డేవిడ్ ధావన్ ఇందులో కావాల్సినంత మసాలా దట్టించారు.

కావాల్సినంత కామెడీ

కావాల్సినంత కామెడీ

ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్‌తో పాటు ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడానికి కావాల్సినంత కామెడీ కూడా దట్టించారు. థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వడం ఖాయం అనే భావన ట్రైలర్ చూస్తే కలుగుతోంది.

ముద్దు సీన్లే ముద్దు సీన్లు

ముద్దు సీన్లే ముద్దు సీన్లు

ఇవన్నీ ఉన్నాక శృంగార రసం లేకుంటే ఏం బావుంటుంది? ఆ తరహా సీన్లు కోరుకునే వారిని కూడా ఏ మత్రం నిరాశ పరచకుండా సినిమాలో ముద్దు సీన్ల రూపంలో శృంగార రసం ఒలికించారు.

English summary
" I had to lose lot of weight for Naam Shabana to look slim and for Judwaa-2, I had to put on some more weight to look sexy in the bikinis. You will understand why it is important to wear Bikinis for my role in the movie, once you watch it. Anyways, it is not a crime too." Tapsee said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu