»   » కరువు ఎఫెక్టేనా? అమెరికాలో ‘అ..ఆ’ కలెక్షన్ల సునామీ!

కరువు ఎఫెక్టేనా? అమెరికాలో ‘అ..ఆ’ కలెక్షన్ల సునామీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'అ..ఆ' మూవీ ఎవరూ ఊహించని విధంగా వసూళ్లు సాధిస్తోంది. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్స్ కరువయ్యాయి. ఇంతకాలం అలాంటి సినిమాలు 'కరువు' కావడంతో ఆశగా ఎదురు చూసస్తున్న ప్రేక్షకులకు త్రివిక్రమ్ 'అ..ఆ' రూపంలో మంచి గిఫ్ట్ ఇచ్చాడు. అందుకే ఈ సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తోంది.

క్లాస్ సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్టెనర్స్ వంటి సినిమాలు చూడాటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అమెరికాలోని తెలుగు వారు...'అ..ఆ' సినిమాకు వసూళ్ల పంట పండిస్తున్నారు. 'అ..ఆ' మూవీ అమెరికాలో బుధవారమే ప్రీమియర్ షోల రూపంలో విడుదలైంది.

బుధ, గురు మరియు, శుక్రవారం కలెక్షన్లు సంతృప్తి కరంగా వచ్చాయి. అయితే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో శనివారం కలెక్షన్లు పోటెత్తాయి. ఆదివారం కలెక్షన్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. మొత్తం కలిపితే 1.5 మిలియన్‌ డాలర్లు క్రాస్‌ అవ్వడం ఖాయం.

'అ..ఆ'మూవీ బుధ+గురువారం(495,611 డాలర్లు), శుక్రవారం(362,561 డాలర్లు), శనివారం( 533,535 డాలర్లు) మొత్తం రూ. 9.29 కోట్లు వసూలు చేసినట్లు ప్రముఖ సినీ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్‌ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. తొలి వీకెండ్ లోనే సినిమాకు ఈ రేంజిలో వసూళ్లు రావడంతో ట్రేడ్ విశ్లేషకులు ఆశ్చర్య పోతున్నారు.

English summary
"Telugu film #AAaMovie is AWE-INSPIRING in USA... Sat biz is HIGHER than Wed+Thu *combined*... All set to cross $ 1.5 million today [Sun]. Telugu film #AAaMovie - USA: Wed+Thu $ 495,611, Fri $ 362,561, Sat $ 533,535. Total: $ 1,391,707 [₹ 9.29 cr]. REMARKABLE!" Taran Adarsh tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu