»   »  తేజ ...కృష్ణవంశి కొట్టుకుంటారా?

తేజ ...కృష్ణవంశి కొట్టుకుంటారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Teja & Krishna Vamsi
చాలాకాలం నుంచీ తేజ నిర్మాతగా కృష్ణవంశి దర్శకత్వంలో సినిమా చేస్తాడని వార్తలు వినపడుతున్నాయి. అయితే అవి కార్యరూపం దాల్చలేదు. వర్మ శిష్యులయిన ఈ ఇద్దరూ కలసి ఒకే సినిమా రూపొందించటం కష్టమనీ అందుకే కాంబినేషన్ ప్రారంభం అయ్యే అవకాశం లేదన్నారు. కానీ ఇప్పుడా విచిత్రం జరిగే అవకాశంముందని ఫిల్మ్ సర్కిల్స్ వినపడుతోంది. ఎందుకంటే ఈ టాపిక్ పై మాట్లాడుతూ కృష్ణవంశీ...నేను తేజ చెప్పిన స్టోరీ లైన్ విన్నాను ఎప్రూవ్ చేసాను అన్నాడు. అలాగే తేజ కరెక్టే ఆ సినిమా స్క్రిప్టు స్టేజీలో ఉంది..తరుణ్,జెనీలియా లతో ఆయన చేస్తున్న 'శశిరేఖాపరిణయం' పూర్తవగానే ప్రారంభిస్తాం అంటున్నాడు.

ఇక ఈ ఇద్దరూ ఎంతవరకూ కలసి పనిచేయగలరు..తేజకి తలపొగరు అని చాలా ఇగోయిస్ట్ అని పేరు ఉంది...అంతేగాక కృష్ణవంశీ తాను అనుకున్నది మాత్రమే కరెక్టు అనే లక్షణం ఉంది...ఇద్దరూ సినిమా ప్రారంభించాక ఎంతవరకూ ఒకర్నొకరు సర్ధిచెప్పుకోగలరు...ఎవరు మాట ఎవరు వింటారు. తేజ తాను నిర్మాతనని తన డిమాండ్స్ ఆలోచనలు రుద్దకుండా ఉంటాడా...అలాగే తనలాంటి క్రియేటివ్ దర్శకుడుకి సూచనలు వేరేవారు ఇవ్వడాన్ని కృష్ణవంశీ భరించగలడా...అసలు రెండు కత్తులు ఒకే ఒరలో ఇముడుతాయా...వర్మ క్యాంపు నుంచి వీరిద్దరూ కలసి సినిమా ఫినిష్ చేయగలరా...లేక ప్రారంభం స్టేజీలోనే ఆగిపోతుందా అన్నీ అందరికీ డౌట్ లే...చూద్దాం ఇవేమీ కాకుండా వీరిద్దరూ కలసి ఓ అద్బుతం సృష్టిస్తారేమో!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X