Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్‌బాస్‌లో మంచు లక్ష్మీతోపాటు మరో హాట్ హీరోయిన్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రారంభమవుతుందనగానే భారీ స్పందన వచ్చింది. ఈ షోను బుల్లితెర మీద ఎప్పడు చూద్దామా? ఈ కాంటెస్ట్‌లో 12 మంది సెలబ్రిటీలు ఎవరు? అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. ఈ షోలో పాల్గొనే వారి పేర్లు బిగ్‌బాస్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించలేదు. కానీ సెలబ్రీటీల పేర్లు రకరకాలుగా ప్రచారంలో ఉన్నాయి. తాజాగా టాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా పేరున్న తేజస్విని మద్దినేని బిగ్‌బాస్ కంటెస్టంట్‌గా పాల్గొనబోతున్నారనే వార్త సెన్సేషనల్‌గా మారింది.

తేజస్విని ఫైనల్
వారం రోజుల్లో ప్రారంభమయ్యే బిగ్‌బాస్ షో కోసం 12 మంది సెలబ్రిటీలు సిద్దమవుతున్నారు. త్వరలోనే బిగ్‌బాస్ హౌస్‌లోకి తేజస్వి మదివాడ వెళ్లబోతున్నారనే వార్త సంచలనంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం బిగ్‌బాస్ కోసం తేజస్విని ఫైనల్ చేశారు. ఆమె జూలై 13న ముంబైకి సమీపంలోని లోనావాలాలో ఏర్పాటు చేసిన హౌస్‌లోకి వెళ్లనున్నదనే తాజా సమాచారం.

నిర్వాహకులకు ఓకే చెప్పిన ఐస్‌క్రీమ్ గర్ల్
బిగ్ బాస్ నిర్వాహకులు కొద్దిరోజుల క్రితం సంప్రదించగా తేజస్విని అంగీకరించినట్టు సమాచారం. దీంతో ఆమె బుల్లితెర రంగ ప్రవేశం సిద్ధమవుతున్నది. బిగ్ బాస్ హౌస్‌లో దాదాపు ఆమె 71 రోజులు గడుపనున్నారు. దాదాపు రెండున్నర నెలలు బాహ్య ప్రపంచానికి, సినిమా పరిశ్రమకు దూరం కానున్నది. ఈ షోలో పాల్లొనేందుకు ఆమెకు భారీగా పారితోషికం ముట్టినట్టు తెలుస్తున్నది.

టాలీవుడ్‌లో హాట్ హాట్‌గా
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం ద్వారా తేజస్వి మద్దినేని తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. ఆ తర్వాత సీతమ వాకిట్లో సిరిమల్లె చెట్టు, హార్ట్ ఎటాక్, ఐస్ క్రీమ్, బాబు బాగా బిజీ చిత్రాల్లో హాట్ హాట్‌గా కనిపించింది.

బిగ్‌బాస్ షోలో పాల్గొనే వారి పేర్లు ఇవే..
ఇంకా బిగ్‌బాస్ కార్యక్రమంలో పాల్గొనే వారి జాబితాలో ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి, సదా, స్నేహా, రంభ, మంచు లక్ష్మి తదితరుల పేర్లు ఉన్నట్టు వెల్లడించారు. ఈ తారల పేర్లు బయటకు రావడంతో బిగ్‌బాస్ తెలుగు వెర్షన్‌కు మరింత క్రేజ్ పెరిగింది.

బిగ్‌బాస్‌కు పోసాని గ్రీన్ సిగ్నల్
టాలీవుడ్‌లో పోసాని కృష్ణమురళిది ప్రత్యేకమైన శైలి. మాటల రచయితగా పరిశ్రమలోకి వచ్చిన పోసాని ఆ తర్వాత నటుడిగా, దర్శకుడి, నిర్మాతగా మారారు. ప్రస్తుతం టాలీవుడ్ కమెడియన్, క్యారెక్టర్ ఆరిస్ట్‌లో పాపులర్ అనే ముద్ర ఉంది. టెలివిజన్ రంగంలో జీ చానెల్లో బతుకు జట్కా బండి అనే కార్యక్రమంలో హోస్ట్‌గా ఉన్నారు. ఎన్టీఆర్ హోస్ట్‌గా ఉన్నారనే అంశంతో ఆయన బిగ్‌బాస్‌కు పోసాని ఒకే చెప్పినట్టు సమాచారం.

ఢీ తర్వాత బిగ్‌బాస్‌లోకి సదా
బిగ్‌బాస్‌లో మరో పార్టిసిపెంట్ సినీ నటి సదా. దక్షిణాదిలో సక్సెస్ ఫుల్ చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం ఈటీవీలో ఢీ అనే డ్యాన్స్ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆమె కుదుర్చుకొన్న నాలుగు సంవత్సరాల కాంట్రాక్టు ముగిసింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒకే చెప్పినట్టు సమాచారం.

బిగ్‌బాస్‌తో స్నేహ మెరుపులు
తెలుగు చిత్రాల్లో హోమ్లీ హీరోయిన్‌గా రాణించిన స్నేహ కూడా బిగ్‌బాస్‌లో పాల్గొనున్నారు. ఆమె నటించిన చిత్రాలు దక్షిణాదిలో చాలా సక్సెస్‌గా నిలిచాయి. పలు భాషల్లో అగ్రహీరోల సరసన ఆమె నటించిన ఘనత ఉంది. స్నేహ పాల్గొనడం ద్వారా బిగ్‌బాస్‌కు మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.

రంభ ఎంట్రీతో బిగ్‌బాస్‌కు కల
బిగ్‌బాస్‌లో పాల్గొనే అగ్రతారల్లో రంభ ఒకరు కావడం మరో విశేషం. యమదొంగ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రత్యేకమైన పాటలో కూడా నర్తించింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లాంటి అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. అద్భుతమైన టాలెంట్ ఉన్న సీనియర్ హీరోయిన్లలో రంభ ఒకరు. రంభ గ్లామర్ బిగ్‌బాస్‌కు అదనపు ఆకర్షణగా మారే అవకాశం ఉంది.

మంచులక్ష్మీతో పెరిగిన క్రేజ్
టాలీవుడ్‌లో స్టార్ సెలబ్రిటీ స్టేటస్ ఉన్న యాక్టర్లలో మంచు లక్ష్మి ఒకరు. సినీ నటిగా, యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. బిగ్‌బాస్‌లో మంచు లక్ష్మి పాల్గొనడం ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. మంచు లక్ష్మీతోపాటు గ్లామర్ ఉన్న స్టార్లు పాల్గొనడం ద్వారా బిగ్ బాస్ ఓ రేంజ్‌లో ఉండే అవకాశం కనిపిస్తున్నది.