For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరంజీవి-బాలకృష్ణ కిస్ & మేక్‌అప్ (పిక్చర్స్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నట సింహం బాలకృష్ణ మధ్య కిస్ అండ్ మేక్‌అప్ సన్నివేశం సర్వత్రా చర్చనీయాంశం అయింది. విబేధాల కారణంగా దూరంగా ఉంటున్న ఇద్దరు వ్యక్తులు అవన్నీ మరిచిపోయి మళ్లీ స్నేహపూర్వకంగా కలవడాన్ని ఇంగ్లీషులో 'kiss and make up'గా పేర్కొంటారు. అదన్నమాట సంగతి.

  చిరంజీవి తనయుడు హీరో రామ్ చరణ్ వివాహం తర్వాత.....అత్యంత గ్రాండ్‌గా జరిగిన వివాహం బాలయ్య కూతురు తేజస్వినిదే. తేజస్విని వివాహం GITAM సంస్థ ఫౌండర్ ఎంవివిఎస్ మూర్తి మనవడు శ్రీభరత్‌తో బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్‌లో జరిగిన వివాహ వేడుకకు సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. రాజకీయ విబేధాల కారణంగా ఇప్పటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ ఈ వివాహం సందర్బంగా మళ్లీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

  తెలుగు సినిమా రంగంలో దాదాపు దశాబ్ధకాలంగా పోటీ పోటీగా రాణించిన చిరంజీవి, బాలకృష్ణ.....ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టి ఒకరిపై ఒకరు పొలిటికల్ డైలాగ్స్ పేల్చుకున్న సంగతి తెలిసిందే. ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. కానీ పెళ్లి వేడుకలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తించారు. రాజకీయ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి ముడి పెట్టుకోబోమని నిరూపించారు. రాజకీయంగా విమర్శలు చేసుకున్నా వ్యక్తిగతంగా మంచి స్నేహితులమని చాటి చెప్పారు.

  తన కూతురు వివాహాన్ని పురస్కరించుకుని బాలయ్య స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి ఆహ్వానించారట. కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ వాటిని రద్దు చేసుకుని బాలయ్య కూతురు తేజస్విని వివాహానికి హాజరయ్యారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు.

  చిరంజీవి-బాలకృష్ణ పోటాపోటీ

  చిరంజీవి-బాలకృష్ణ పోటాపోటీ

  సినిమా రంగంలో ఉన్నప్పటి నుండే చిరంజీవి-బాలయ్య మధ్య పోటా పోటీ వతావరణం ఉండేది. 1980 చిరంజీవి నటించిన ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు', బాలయ్య నటించిన ‘ముద్దుల మావయ్య' చిత్రాలు పోటాపోటీగా విడుదలై 100 రోజులు పోటాపోటీగా ప్రదర్శితం అయ్యాయి.

  బాక్సాఫీసు వద్ద 2 దశాబ్దాల ఫైట్

  బాక్సాఫీసు వద్ద 2 దశాబ్దాల ఫైట్

  తెలుగు బాక్సాఫీసు వద్ద ఒకప్పుడు చిరంజీవి, బాలయ్య చిత్రాల మధ్య పోటీ పోటీ వాతావరణం ఉండేది. వీరి అభిమానుల మధ్య కూడా అలాంటి వాతావరణమే ఉండేది. దాదాపు 2 దశాబ్దాల పాటు ఈ పోటాపోటీ వతావరణం కొనసాగింది.

  ఆధిపత్యం కోసం ఆరాటం

  ఆధిపత్యం కోసం ఆరాటం

  ఒక రకంగా చెప్పాలంటే బాలయ్య, చిరంజీవి ఇద్దరూ కూడా బాక్సాఫీసుపై ఆధిపత్యం సాధించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తుండే వారు. అయితే ఎక్కువ సార్లు చిరంజీవే పైచేయి సాధించారు.

  భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్

  భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్

  ఇటు మెగాస్టార్ చిరంజీవికి...అటు యువరత్న బాలకృష్ణ‌కి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరి సినిమాల సందర్భంగా అభిమానులు చేసే హడావుడి ఓ రేంజిలో ఉండేది. అయితే కొన్ని సందర్భాల్లో ఇరు వర్గాల అభిమానులు తగాదా పడిన సందర్భాలూ ఉన్నాయి.

  వృత్తిపరంగా పోటీ...వ్యక్తిగతంగా స్నేహం

  వృత్తిపరంగా పోటీ...వ్యక్తిగతంగా స్నేహం

  వృత్తి పరంగా చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఎంత పోటాపోటీ వాతావరణం ఉన్నప్పటికీ....వారు వ్యక్తిగతంగా మాత్రం మంచి స్నేహితులుగా మెలిగేవారు. వ్యక్తి గత జీవితాన్ని వృత్తి జీవితంతో ముడి పెట్టి చూసే వారు కాదు.

  రాజకీయాల్లోకి బాలయ్య

  రాజకీయాల్లోకి బాలయ్య

  ఇప్పటి వరకు సినిమాలకు మాత్రమే పరిమితం అయిన బాలయ్య ఇకపై రాజకీయాల్లోనూ చురుకుగా పాల్గొనబోతున్నారు. పార్లమెంటు సీటుకు తాను పోటీ చేయబోనని, అసెంబ్లీకి పోటీ చేయబోతున్నట్లు బాలయ్య తెలిపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగు ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతానని ప్రకటించారు.

  చిరంజీవిపై విమర్శలు

  చిరంజీవిపై విమర్శలు

  ఓ సారి రాజకీయ సభలో బాలయ్య మాట్లాడుతూ....కేవలం ముఖ్యమంత్రి కావాలనే కోరికతోనే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారని, ప్రజలకు సేవ చేయడానికి కాదని వ్యాఖ్యానించారు. పార్టీని నడపటం చేతగాకనే ఆయన తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసారని ఆరోపించారు.

  బాలయ్యవి పిల్ల చేష్టలన్న చిరంజీవి

  బాలయ్యవి పిల్ల చేష్టలన్న చిరంజీవి

  బాలయ్య ఆరోపణలతో అసహనానికి గురైన చిరంజీవి మాట్లాడుతూ...‘బాలయ్య నా స్నేహితుడు. కానీ అతనివి పిల్ల చేష్టలు. అలాంటపుడు ఆయన చేసే వ్యాఖ్యలు తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదు' అని వ్యాఖ్యానించారు.

  బాలయ్య కౌంటర్

  బాలయ్య కౌంటర్

  తనవి పిల్ల చేష్టలన్న చిరంజీవిపై బాలయ్య మళ్లీ కౌంటర్ కామెంట్ చేసారు. నావి పిల్ల చేష్టాలా...? ఓకే. నేను చేసిన ఆరోపణల్లో నిజం లేక పోతే ఆయన కేంద్ర మంత్రి పదవి కోసం లాబీయింగ్ ఎందుకు చేసారు? అని ప్రశించారు.

  బాలయ్య నట జీవితానికి స్వస్తి

  బాలయ్య నట జీవితానికి స్వస్తి

  పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్న బాలకృష్ణ సినిమాలను తగ్గించారు. క్రమ క్రమంగా ఆయన పూర్తిగా సినిమా రంగానికి దూరం అవుతారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

  ఇక రాజకీయ ప్రత్యర్థులుగా మారుతారా?

  ఇక రాజకీయ ప్రత్యర్థులుగా మారుతారా?

  చిరంజీవి ఇప్పటికే పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయ్యారు. బాలయ్య కూడా పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు సినిమాల్లో పోటాపోటీగా ఉన్న ఈ ఇద్దరు ఇక రాజకీయ ప్రత్యర్థులుగా మారబోతున్నారని అంటున్నారు.

  English summary
  Nandamuri Balakrishna's second daughter Tejaswini's wedding is the next biggest ceremony after Chiranjeevi's son Ram Charan Teja's marriage. This grand gala event also marks the end of rivalry between two leading Tollywood actors.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X