twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    The Kashmir Files సినిమా ఒక దిక్కుమాలిన వ్యవహారం.. కావాలనే ఇలా: కేసీఆర్ షాకింగ్ కామెంట్స్!

    |

    ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే ప్రధాని నరేంద్ర మోడీ అలాగే బిజెపి కి సంబంధించిన చాలామంది నాయకులు చిత్ర యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా హైప్ క్రియేట్ అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటోంది. ఇప్పటికే రెండు వందల కోట్లకు చేరువలో ఉన్న ఈ సినిమాపై చాలా మంది ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా స్పందించారు. ఈ సినిమా ఒక దిక్కుమాలిన వ్యవహారం అంటూ ఈ సినిమాను తెలంగాణ ప్రజానీకం ఏమాత్రం సహించదని ఈ సినిమాని ఎవరూ చూడరు అని కూడా అన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

    మత విద్వేషాలను సృష్టిస్తూ..

    మత విద్వేషాలను సృష్టిస్తూ..

    టిఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్ మోడీ ప్రభుత్వంపై ఊహించని విధంగా విమర్శలు చేశారు. అంతేకాకుండా ఈ కాశ్మీర్ ఫైల్స్ సినిమాను అడ్డంపెట్టుకుని మత విద్వేషాలను సృష్టిస్తూ ఓట్ల కోసమే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

    కాశ్మీర్ ఫైల్స్ ఏమిటో అర్థం కావడం లేదు

    కాశ్మీర్ ఫైల్స్ ఏమిటో అర్థం కావడం లేదు

    కెసిఆర్ మాట్లాడుతూ.. బాధాకరమైన అంశం ఏమిటంటే.. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా కొనసాగుతున్న విషప్రచారం.. అవాంఛనీయమైనటు వంటి అనారోగ్యకరమైనటువంటి.. ఏ రకంగానూ ఆహ్వానించ తగనటువంటి ఒక ద్రుష్పచారం కొనసాగుతోంది. కాశ్మీర్ ఫైల్స్ ఇప్పుడు ఇది ఒక నినాదం. ఏదైనా ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ లో ఇరిగేషన్ ఫైల్స్, ఎకనామిక్ ఫైల్స్, ఇండస్ట్రియల్ ఫైల్స్ లాంటిఉంటాయి కానీ ఈ విధంగా కాశ్మీర్ ఫైల్స్ ఏమిటో అర్థం కావడం లేదు.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

    ఇదొక దిక్కుమాలిన వ్యవహారం

    ఇదొక దిక్కుమాలిన వ్యవహారం

    ది కశ్మీర్ ఫైల్స్.. ఇదొక దిక్కుమాలిన వ్యవహారం. ఎవరికి కావాలి కాశ్మీర్ ఫైల్స్. దానితో వచ్చేది ఏంది సచ్చేది ఏంది.
    ఢిల్లీలో కశ్మీర్ పండితులే చెబుతున్నారు. మాకు జరిగినటువంటి అన్యానయాన్ని ఓట్ల రూపంలో సొమ్ము చేసుకుంటున్న దుర్మార్గపు ప్రక్రియ ఈ ప్రచారం. దీని వల్ల మాకు ఏ మీ లాభం రాలేదు అని వాళ్లే చెబుతున్నారు. సోషల్ మీడియాలో అవి కూడా తిరుగుతా ఉన్నాయి.. అని కేసీఆర్ చెప్పారు.

    ఏ మాత్రం కరెక్ట్ కాదు..

    ఏ మాత్రం కరెక్ట్ కాదు..

    ఈ రకమైనటువంటి దేశ విభజన, ప్రజల విభజన చేసి ఒకరకమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టి ప్రయత్నం ఏదైతో జరుగుతుందో అది ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఇది తెలంగాణ సమాజానికి అసలే జీర్ణం కాదు. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమం చేశాం. దాన్ని ఎంత ఉధృతంగా కూడా చేశాము. దశాబ్దాలుగా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. దాదాపు 14 నుంచి 15 సంవత్సరాల వరకు పోరాటం చేశాము. మేము సకల జనుల సమ్మె అన్నాము.. కానీ క్రిస్టియన్ సమ్మె సిక్కుల సమ్మె ముస్లింల సమ్మె అని పెట్టలేదు.. సీఎం కేసీఆర్ అన్నారు.

     సినిమా చూడమని సెలవులు ఇస్తున్నారు

    సినిమా చూడమని సెలవులు ఇస్తున్నారు

    మేము దేనిమీద పోరాటం సాధించిన కూడా అది నేషనల్ గా అందర్నీ కలుపుకుంటూ వెళ్ళాము. ఏదైనా ప్రభుత్వం బాధ్యతతో మాట్లాడాలి కానీ.. ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. బీజేపీ పాలిత ప్రాంతాలలో ఏకంగా ప్రభుత్వ అధికారులకు కూడా సెలవులు ఇచ్చి సినిమా చూడమని చెబుతున్నారు. ఇది ఏమి దిక్కుమాలిన ప్రచారం. ఇది ఏ విభజన రాజకీయం. దీని పర్యవసానం ఏమిటి? ఇక్కడికి తీసుకు వెళతారు ఈ దేశాన్ని. ఐటీ రంగంలో దేశం చాలా పురోగతి చెందుతోంది. ఇలాంటి మతవిద్వేషాలు విభజన రాజకీయాలు చేస్తే దీని మీద ఏమైనా ప్రభావం చూపవచ్చు.. అని కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

    English summary
    Telangana cm Kcr shocking comments The Kashmir Files movie,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X