»   » అత్తారింటికి దారేది చూసి, రామయ్యా వస్తావయ్యా

అత్తారింటికి దారేది చూసి, రామయ్యా వస్తావయ్యా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర భగ్గుమంటోంది. ఈ స్థితిలో తెలుగు సినిమా హీరోలు తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కుంటున్నారు. అయితే, సీమాంధ్రకు చెందిన తెలుగు హీరోలకు తెలంగాణ అభయం ఇస్తోంది. తెలంగాణ జిల్లాలతో కూడిన నిజాం ఏరియాలో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా బాగా నడిచింది. సీమాంధ్రలో మాత్రం కలెక్షన్స్ తగ్గాయని అంటున్నారు.

తెలంగాణలో కూడా వ్యతిరేకత ఎదురైతే అత్తారింటికి దారేది సినిమాపై పెద్ద దెబ్బే పడేది. పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అత్తారింటికి దారేది సినిమాకు తెలంగాణలో వ్యతిరేకత ఎదురు కాలేదు. దీంతో ఆంధ్ర ప్రాంతానికి చెందిన మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ సినిమా రామయ్యా వస్తావయ్యా ఈ నెల 11వ తేదీన విడుదల కావడానికి సిద్ధమవుతోంది.

Ramayya Vastavayya

సీమాంధ్రలో గత 70 రోజులుగా ఆందోళన సాగుతోంది. దీంతో ప్రేక్షకులకు థియేటర్లకు రావడం లేదు. సినిమా హాళ్లు చాలా వరకు మూతపడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎన్టీఆర్ మామ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు. అయినా, సీమాంధ్రలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా రామయ్యా వస్తావయ్యా సినిమాకు సమైక్య సెగ తప్పకపోవచ్చునని అంచనా వేస్తున్నారు.

రామయ్యా వస్తావయ్యా సినిమాను సీమాంధ్రలో కూడా నడిపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దసరా పండుగ కావడంతో సినిమాకు ఆటంకాలు ఉండకపోవచ్చునని అంటున్నారు. మంచు విష్ణు తన దూసుకెళ్తా సినిమా విషయంలో కూడా తెలంగాణపైనే ఆశలు పెట్టుకున్నారు. గతంలో వీరిద్దరి సినిమాలకు తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అయితే, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజా తుఫాన్ సినిమాకు కూడా చెదురమొదరుగా తప్ప ఎక్కువగా వ్యతిరేకత రాలేదు. దీంతో రామయ్యా వస్తావయ్యాకు ఏ విధమైన అడ్డంకులు ఉండకపోవచ్చునని భావిస్తున్నారు.

English summary
Jr NTR who is a crowd puller at the theatres, is coming up with his film 'Ramayya Vastavayya', a big budget film, knowing only too well that the situation in the seemandhra region is not conducive to release the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu