twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకటేష్ 'బాడీగార్డ్' షూటింగ్‌కు తెలంగాణ ట్విస్ట్

    By Srikanya
    |

    వెంకటేష్ హీరోగా బెల్లకొండ సురేష్ నిర్మిస్తున్న 'బాడీగార్డ్' చిత్రానికి తెలంగాణా వాదుల నుంచి నిరసన ఎదురయ్యింది.వివరాల్లోకి వెళ్ళితే... సినిమాల నిర్మాణంలో తెలంగాణ కళాకారులకు 45 శాతం అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మూవీ చాంబర్ అసోసియేషన్ సభ్యులు, ఏబీవీపీ కార్యకర్తలు వెంకటేష్ హీరోగా నటిస్తున్న 'బాడీగార్డ్' సినిమా నిర్మాణాన్ని అడ్డుకున్నారు. శంషాబాద్ మండలంలోని నర్కోడ అమ్మపల్లి దేవాలయంలో బాడీగార్డ్ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న తెలంగాణ మూవీచాంబర్ జిల్లా అధ్యక్షుడు బైతిశ్రీధర్ ఉపాధ్యక్షుడు కృష్ణ నేతృత్వంలో దాదాపు వందమంది ఆందోళనకారులు అక్కడకి చేరుకుని అడ్డుకున్నారు. అమ్మపల్లి దేవాలయానికి చేరుకుంటారని సమాచారం అందడంతో పోలీసులు ముందుగానే అక్కడకు చేరుకొని ఆందోళనకారులను అడ్డుకున్నారు. సినీ నిర్మాతలు తమ సినిమాల్లో పూర్తిగా ఆంధ్రా ప్రాంతం వాళ్లకే ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ కళాకారులకు అన్యాయం చేస్తున్నారని ఆందోళనకారులు ధ్వజమెత్తారు. దీంతో ప్రొడక్షన్ మేనేజర్లు అక్కడికి వచ్చి ఆందోళనకారులతో మాట్ల్లాడారు. ఈ సినిమాలో తెలంగాణ కళాకారులకు కూడా సరైన అవకాశాలు కల్పించామని వారు వివరించడంతో ఆందోళన విరమించారు.

    ఈ సినిమాలో వెంకీ సరసన త్రిష లీడ్ రోల్ చేస్తుండగా, సలోని ముఖ్య పాత్రలో కనిపించనుంది. గోపీ చంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిశ్రీసాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. మళయాళంలో సూపర్ హిట్టయిన బాడీగార్డు సినిమాకు ఇది రీమేక్. తమిళంలోఇప్పటికే కావలన్ పేరుతో రీమేక్ చేశారు. హీందీ వర్షన్లో సల్మాన్ ఖాన్ హీరోగా 'బాడీగార్డ్" సినిమా రూపొందింది. హిందీ బాడీగార్డు ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 31,2011 విడుదలయ్యింది. ఇక వెంకటేష్ 'గంగా ది బాడీగార్డు" సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు కసరత్తు చేస్తున్నారు. సినీవర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని, షూటింగ్ చివరి దరశకు చేకుందని తెలిసింది. సెప్టెంబర్ మాసాంతంలోగా షూటింగ్ పూర్తి చేసుకుని...అనంతం పోస్టు ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుని విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు.

    English summary
    Venkatesh's under production film Bodyguard faced the ire of Telangana activists at Shamshabad area.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X