»   » ప్రముఖ నటికి క్యాన్సర్.. తీవ్ర అనారోగ్యం.. రక్తదాతలు అవసరం..

ప్రముఖ నటికి క్యాన్సర్.. తీవ్ర అనారోగ్యం.. రక్తదాతలు అవసరం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో సీనియర్ నటి టీ కృష్ణకుమారి ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. గత కొద్దికాలంగా బోన్ మార్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఆమెకు బెంగళూరులో ఆమెకు కీమోథెరపీ చికిత్సనందిస్తున్నట్టు తెలిసింది. చికిత్సకు కృష్ణకుమారి స్పందిస్తున్నారని, ఆమె ఆరోగ్యం మెరుగుపడుతున్నదని వైద్యులు వెల్లడించినట్టు సమాచారం.

అపోలో హాస్పిటల్‌లో చికిత్స

అపోలో హాస్పిటల్‌లో చికిత్స

ఇటీవల క్యాన్సర్ వ్యాధికి గురైన కొద్దినెలల్లో ఆమె పలుమార్లు అపోలో హాస్పిటల్లో చేరినట్టు సమాచారం. ఇటీవల ఆమెకు క్యాన్సర్ వ్యాధి సోకినట్టు వైద్యులు తేల్చినట్టు తెలిసింది. ఇటీవల ఆమెకు ఓ పాజిటివ్ రక్తం అవసరమనే విషయం సోషల్ మీడియాలో కనిపించింది. ‘తెలుగు నటి కృష్ణకుమారి బెంగళూరులోని బన్నెరగట్టలోని అపోలోలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ‘ఓ' పాజిటివ్ రక్తం అవసరం' అని బెంగళూరు టైమ్స్ ఎడిటర్ కావ్య క్రిస్టఫర్ మార్చి 28న ట్వీట్ చేశారు.

1951లో చిత్రరంగ ప్రవేశం..

1951లో చిత్రరంగ ప్రవేశం..

కృష్ణకుమారి 1933లో పశ్చిమ బెంగాల్‌లోని నైహాతిలో జన్నించారు. దక్షిణాది సిని పరిశ్రమలో ప్రముఖ నటి షావుకారు జానకి.. కృష్ణకుమారికి సోదరి. 1951లో నవ్వితే నవరత్నాలు అనే చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కొద్ది సంవత్సరాల్లోనే 50 చిత్రాల్లో నటించడం ఆమెకే చెల్లింది.

ఎన్టీఆర్, ఏఎన్నాఆర్‌తో..

ఎన్టీఆర్, ఏఎన్నాఆర్‌తో..

కృష్ణకుమారి దాదాపు 150 తెలుగు సినిమాల్లోనూ, 30కి పైగా తమిళ, కన్నడ చిత్రాల్లో నటించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, కాంతారావు, రాజ్ కుమార్, శివాజీ గణేషన్ తదితరులతో కలిసి నటించారు. ఆమె నటించిన చిత్రాల్లో యశోదక‌ృష్ణ, జ్యోతి, శ్రీకృష్ణావతారం. అంతస్థులు, వాగ్దానం, భార్యభర్తలు మొదలైనవి ఉన్నాయి.

బెంగళూరులో స్థిరపడిన..

బెంగళూరులో స్థిరపడిన..

కృష్ణకుమారి ప్రముఖ వ్యాపారవేత్త అజయ్ మోహన్ ఖేతాన్‌ను వివాహం చేసుకొన్నారు. అజయ్ మోహన్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్, స్క్రీన్ మ్యాగజైన్‌కు గతంలో ఎడిటర్‌గా వ్యవహరించారు. వివాహం తర్వాత నటనకు స్వస్తి చెప్పి బెంగళూరులో స్థిరపడ్డారు. కృష్ణకుమారి దంపతులకు దీపిక అనే కూతురు ఉంది. దీపిక ఇటీవల ‘మై మదర్: టీ కృష్ణకుమారి' పేరుతో తన తల్లి జీవిత చరిత్రను రాశారు.

English summary
Telugu actress T Krishna Kumari (also spelt as Krishnakumari) was recently admitted to a private hospital for bone marrow cancer and she is set to undergo chemotherapy. Krishna Kumari was married to Ajay Mohan Khaitan, who is the former editor of the Indian Express and founder of Screen Magazine and Businessman. The couple has a daughter named Dipika. After marriage, she quit acting and now lives in Bengaluru with her daughter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu