»   » హీరోయిన్ల లవ్ ఎఫైర్లు, వివాహాలు (ఫోటో ఫీచర్)

హీరోయిన్ల లవ్ ఎఫైర్లు, వివాహాలు (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: సినిమా పరిశ్రమలో హీరో హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతల మధ్య ఎఫైర్ల అనేవి ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. చాలా సందర్భాల్లో ఇందుకు సంబంధించిన వార్తలు మనం వింటూనే ఉన్నాం. కొందరు తమ తమ సినిమాల పబ్లిసిటీ కోసం, తమ పాపులారిటీ పెంచుకోవడం ఎఫైర్లు కొనసాగిస్తుండటం గమనార్హం.

  అయితే కొందరు స్టార్స్ మాత్రం సీరియస్‌గా రిలేషన్ షిప్ నడిపిస్తున్నారు. అంతటితో ఆగకుండా తమ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకుంటున్నారు. ఇప్పటి వరకు చాలా మంది స్టార్స్ ప్రేమ, పెళ్లి ద్వారా ఏకమైన వారు ఉన్నారు. అదే సమయంలో జస్ట్ లైఫ్ ఎంజాయ్ కోసం ఎఫైర్లు నడిపేవారు కూడా ఉన్నారు. అలాంటి వారికి సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

  అమలా పాల్-విజయ్ మ్యారేజ్

  అమలా పాల్-విజయ్ మ్యారేజ్

  తెలుగు హీరోయిన్ అమలా పాల్ తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ తో ప్రేమలో పడింది. ఇద్దరి మధ్య కంతకాల సీరియస్ రిలేషన్ షిప్ నడిచింది. త్వరలో ఇద్దరూ వివాహం ద్వారా ఒకటి కాబోతున్నారు.

  నయతార-శింబు ఎఫైర్

  నయతార-శింబు ఎఫైర్

  నయనతార, శింబు ‘వల్లభన్' అనే సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. అయితే ఇద్దరూ 2006లో విడిపోయారు.

  నయనతార-ప్రభుదేవా

  నయనతార-ప్రభుదేవా

  శింబుతో విడిపోయిన తర్వాత నయనతార శింబకు దగ్గరయింది. ఇద్దరి మధ్య సీరియస్ రిలేషన్ షిప్ నడిచింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే అనుకోని కారణాలతో ఇద్దరూ 2012లో విడిపోయారు.

  హన్సిక-శింబు

  హన్సిక-శింబు

  హీరోయిన్ హన్సిక, శింబు మధ్య కొన్ని రోజుల క్రితం ప్రేమాయణం నడిచింది. అయితే ఇద్దరూ కొన్ని రోజులకే విడిపోయారు.

  కాజల్ అగర్వాల్ బాయ్ ఫ్రెండ్

  కాజల్ అగర్వాల్ బాయ్ ఫ్రెండ్

  హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముంబైకి చెందిన ఇండస్ట్రియలిస్ట్ తో ప్రేమ వ్యవహారం నడిపినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల అతనితో కలిసి హాలిడే ఎంజాయ్ చేసిన ఫోటోలు బయటకు లీక్ అయ్యాయి.

  సమంత-సిద్ధార్థ్

  సమంత-సిద్ధార్థ్

  హీరోయిన్ సమంత, సిద్ధార్థ మధ్య ఎఫైర్ ఉన్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఇద్దరూ ఈ వార్తలను ఖండించారు.

  వరుణ్ సందేష్, శ్రద్ధా దాస్

  వరుణ్ సందేష్, శ్రద్ధా దాస్

  వరుణ్ సందేశ్, శ్రద్ధా దాస్ మధ్య ఎఫైర్ నడిచింది. ఇద్దరూ కలిసి కొంతకాలం డేటింగ్ చేసారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు.

  నమ్రత-మహేష్

  నమ్రత-మహేష్

  ‘వంశీ' సినిమా సమయంలో ప్రేమలో పడ్డ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్.....ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత ప్రేమ వివాహం చేసుకున్నారు.

  అమల-నాగార్జున

  అమల-నాగార్జున

  తనతో పాటు పలు చిత్రాల్లో నటించిన అమలతో నాగార్జున ప్రేమలో పడ్డారు. ఇద్దరూ 1992లో వివాహం చేసుకున్నారు.

  రేణు దేశాయ్-పవన్

  రేణు దేశాయ్-పవన్

  టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ‘బద్రి' సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోకుండానే కొంతకాలం సహజీవనం చేసి ఓ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. ఆ తర్వాత 2008లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

  సూర్య, జ్యోతిక

  సూర్య, జ్యోతిక

  సూర్య, జ్యోతిక పలు చిత్రాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అనంతరం 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

  నిషా అగర్వాల్

  నిషా అగర్వాల్

  హీరోయిన్ నిషా అగర్వాల్ ముంబైకి చెందిన వ్యాపార వేత్త కరణ్ వాలేచాతో ప్రేమలో పడింది. 2013లో అతన్ని పెళ్లాడింది.

  జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్

  జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్

  హీరోయిన్ జెనీలియా, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

  రిచా, సుందర్

  రిచా, సుందర్

  హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ్...తమిళ నటుడు, ఫోటోగ్రాఫర్ సుందర్ రాముతో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

  రానా, త్రిష

  రానా, త్రిష

  తెలుగు నటుడు రానా, హీరోయిన్ త్రిష మధ్య ఎఫైర్ ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే తమ మధ్య స్నేహ బంధమే తప్ప అలాంటిదేమీ లేదంటున్నారు ఈ స్టార్స్.

  అనుష్క శెట్టి

  అనుష్క శెట్టి

  హీరోయిన్ అనుష్క శెట్టికి....నాగార్జునతో పాటు పలువురు స్టార్లతో లింక్ ఉన్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.

  ఇలియానా ఎఫైర్

  ఇలియానా ఎఫైర్

  నటి ఇలియానాకు ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇలియానా మాత్రం ఇప్పటి వరకు ఈ విషయాన్ని బయట పెట్టలేదు.

  విదేశీయుడితో తాప్సీ

  విదేశీయుడితో తాప్సీ

  హీరోయిన్ తాప్సీ డానిష్ బ్యాడ్మింటన్ స్టార్ మాథిస్ బోతో ఎఫైర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య ఓ సారి ఇద్దరూ మైదరాబాద్‌లో కలిసారని, ఆ తర్వాత ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.

  శృతి హాసన్, సిద్ధార్థ్

  శృతి హాసన్, సిద్ధార్థ్

  హీరోయిన్ శృతి హాసన్, నటుడు సిద్ధార్థ మధ్య ఎఫైర్ ఉన్నట్లు గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా వట్టి పుకార్లే అని తేలిపోయింది.

  English summary
  The rumours about dating, live-in relationship and love affairs are very common film industry. Many a times, they are used as means of publicity of films and such reports remain as mere speculations. In Tollywood, many actresses have been linked with their co-stars, but hardly few have become true relationships and ended in marriage. We bring you details of Telugu actresses' love affairs and their marriage life.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more