గ్యాంగ్ లీడర్, ఖైదీ నెం. 786 చిత్రాల దర్శకుడు విజయ బాపినీడు ఇకలేరు

ప్రముఖ తెలుగు దర్శకుడు, నిర్మాత విజయ బాపినీడు ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కన్నుమూశారు. ఆయన అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. 1936 సెప్టెంబర్‌ 22న ఏలూరు సమీపంలోని చాటపర్రులో జన్మించారు.

శోభన్ బాబు, చిరంజీవితో ఆయన ఎక్కువ సినిమాలు చేశారు. తన కెరీర్లో దాదాపు 20కిపైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన 1976లో వచ్చిన యవ్వనం కాటేసింది సినిమా ద్వారా నిర్మాతగా మారారు. బాపినీడు మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Telugu director Vijaya Bapineedu passed away

సినిమాల్లోకి రావడానికి ముందు బాపినీడు... వియజ ఎంటర్టెన్మెంట్ మేగజైన్ ఎడిటర్‌గా పని చేశారు. 1981లో వచ్చిన 'డబ్బు డబ్బు డబ్బు' సినిమా ద్వారా దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి విజయం అందుకున్నారు. ఆ తర్వాత ఆయనకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.

పతివ్రతలు, మగ మహారాజు, మహానగరంలో మాయగాడు, హీరో చిత్రాలు కమర్షియల్‌గా విజయం సాధించాయి. చిరంజీవి మెగాస్టార్‌గా ఎదగడంలో విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన మగ మహారాజు, ఖైదీ నెం.786, గ్యాంగ్ లీడర్, మగధీరుడు చిత్రాలు దోహదం చేశాయి. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ 'ఖైదీ నెం.150' వేడుకలో విజయ బాపినీడు పాల్గొన్ని చిరంజీవితో మరో సినిమా చేయాలనే కోరిక బయట పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X