twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ కార్మికులకు ఛాంబర్ వార్నింగ్.. అలా అయితే మీరు కాదు మేమే ఆపేస్తామంటూ!

    |

    తెలుగు సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ కార్మికులు వేతనాల పెంపు కోరుతూ సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 22వ తేదీ ఉదయాన్నే వారు తెలుగు ఫిలిం ఫెడరేషన్ బిల్డింగ్ చుట్టుముట్టడంతో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సమావేశమైన నిర్మాతల మండలి మీడియా ముందుకు వచ్చి తమ నిర్ణయాన్ని వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే

    బే షరతుగా

    బే షరతుగా

    ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, నిర్మాత సీ కళ్యాణ్, ఏ ఎమ్ రత్నం, మైత్రి మేకర్స్ రవి, సుప్రియ యార్లగడ్డ , జెమిని కిరణ్, భారత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. సినిమా షూటింగ్స్ నిలుపుదల, సినీ కార్మికుల సమ్మె పై ప్రధాన చర్చ జరిగింది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన సీ కళ్యాణ్ సినీ కార్మికులు సడన్ గా సమ్మెకు వెళ్లటం సరి కాదని అన్నారు. మేం చర్చలకు సిద్దంగా ఉన్నామని, బే షరతుగా షూటింగ్ లకు రావాలని అన్నారు.

    వేతనాలు పెంచుతూనే

    వేతనాలు పెంచుతూనే

    ప్రతి నిర్మాత వర్కర్లను ఎలా చూసుకుంటారో బయట వాళ్లకు తెలియదన్న ఆయన, జీతాలు పెంచేందుకు అభ్యంతరం లేదని అన్నారు. గతంలో చేసిన అగ్రిమెంట్ 2023 మే దాకా వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. రేపటి నుంచి షూటింగ్ లు జరగాలని ఆయన అన్నారు. అంటే వెంటనే రేపటి నుంచి షూటింగ్స్‌కు హాజరు కావాలని సీ కళ్యాణ్ అల్టిమేటం జారీ చేశారు. అసలు ఈ సినీ కార్మికుల సమ్మె గురించి తెలుసుకుని మేమంతా షాకయ్యామని ఆయన అన్నారు. ఎందుకంటే సమయానుగుణంగా మేము తరచూ వేతనాలు పెంచుతూనే ఉన్నామని అన్నారు.

    కూర్చుని చర్చించుకుందాం

    కూర్చుని చర్చించుకుందాం

    నిజానికి వేతనాల సడలింపుపై స్పందించమని కోరుతూ ఈనెల 6న వాళ్లు మాకు ఓ లేఖ రాశారని ఈ వేతనాలు పెంచడానికి నిర్మాతలందరికీ ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. అలా పెంచేందుకు మాక్కూడా కొన్ని కండిషన్స్‌ ఉన్నాయన్న ఆయన ఒక్కసారి అందరం కలిసి కూర్చుని చర్చించుకుందాం అని వాళ్లకు సమాధానం ఇచ్చామని అన్నారు. కానీ, వాళ్లందరూ ఈరోజు ఇలా ఆకస్మికంగా సమ్మె చేయడం తప్పని కళ్యాణ్ పేర్కొన్నారు.

     రాలేలేదంటే

    రాలేలేదంటే

    తెలుగు సినీ నిర్మాతలందరూ షూటింగ్స్‌ కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారన్న కళ్యాణ్, రేపటి నుంచి కార్మికులందరూ షూట్స్‌కి ఎప్పటిలాగా వస్తేనే వేతనాలు, విధివిధానాలపై ఎల్లుండి చర్చించి ఒక కొలిక్కి తీసుకు రావడానికి సిద్ధంగా ఉంటామని అన్నారు. ఒకవేళ కార్మికులు అలా రాలేలేదంటే.. షూటింగ్స్‌ చేయడానికి నిర్మాతలెవరూ సిద్ధంగా లేరని హెచ్చరించారు. నిర్మాతల్ని ఇబ్బంది పెట్టకండన్న ఆయన, వాళ్లు సినిమాలు చేస్తేనే మనకి పని ఉంటుందని అన్నారు.

    రెండు మూడు రోజుల్లో

    రెండు మూడు రోజుల్లో

    అలాగే, సమ్మె నోటీసులు మాకు పంపించామని చెబుతున్నారు కానీ అందులో ఎలాంటి నిజం లేదని సి కల్యాణ్‌ వివరించారు. ఇక ఈ అంశం మీద మంత్రి తలసాని కూడా స్పందించారు. సినీ కార్మికుల డిమాండ్స్ కూర్చుని పరిష్కరించుకోవాలని, కరోనా కారణంగా కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారని అన్నారు. ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కార్మికులను చర్చలకు పిలవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు చూడొద్దని ఆయన అన్నారు. లేబర్ డిపార్ట్మెంట్ కు సమ్మె లేఖ ఇవ్వలేదని, రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కరించుకోవాలని కొరారు.

    English summary
    Telugu film chamber warning to film federation workers regarding sudden strike.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X