»   » టాలీవుడ్‌పై బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్‌పై బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో ‘రక్త చరిత్ర', ‘ధోని', ‘లెజెండ్' చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ముంబై భామ రాధిక ఆప్టే. ఇటీవల రాధిక ఆప్టే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒక తెలుగులో తప్ప మిగతా అన్ని రీజనల్ లాంగ్వేజీల్లోనూ వర్క్ బాగా ఎంజాయ్ చేసానని, తెలుగు సినీ పరిశ్రమలో పురుషాధిక్యత ఎక్కువ అంటూ కామెంట్ చేసింది.

‘తెలుగు సినీ పరిశ్రమలో పురుషాధిక్యత ఎక్కువ. వారు అహంకార పూరితంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో నన్ను చాలా బ్యాడ్ గా ట్రీట్ చేసారు అని వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితులు ఎదుర్కొవడం నా వల్ల కాదు. అందుకే తెలుగు సినిమా పరిశ్రమలో చేయడానికి పెద్దగా ఆసక్తి లేదు' అని వ్యాఖ్యానించారు. మరి రాధిక ఆప్టే ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది? ఆమె ఇబ్బంది పడేలా తెలుగు సినీ పరిశ్రమలో ఎవరు వ్యవహరించారు? అనేది హాట్ టాపిక్ అయింది.

 Telugu film industry functions in a male dominant: Radhika Apte

ఆ సంగతి పక్కన పెడితే ఈ మధ్య కాలంలో పలు ఇంటర్వ్యూలో రాధిక బోల్డ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో వ్యక్తిగా మారుతోంది. సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడటం మన దగ్గర పెద్ద ఇష్యూ. అందుకే సినిమాల్లో దాన్ని వ్యాపారం చేసి అమ్ముకుంటున్నారు. ఆకలేస్తే అన్నమెలా తింటామో... శరీరానికి సెక్స్ కూడా కనీస అవసరం. ఇది ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది' అంటూ చెప్పుకొచ్చింది రాధికా ఆప్టే. బాలకృష్ణ సరసన లెజండ్, ఇప్పుడు లయిన్ చిత్రాల్లో చేసిన ఈ రక్త చరిత్ర చిన్నది చాలా విషయాల్లో బోల్డ్ గ మాట్లాడి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

వరుణ్‌ధావన్ లేటెస్ట్ హిట్ 'బాదల్‌పూర్'లో అందాలు ఆరబోసి ఆకట్టుకున్న రాధికా ఆప్టే... రీసెంట్‌గా రిలీజైన 'హంటర్' సినిమాలో సెక్స్ ఎడిక్ట్‌గా నటించింది. ఆ ఎఫెక్టో లేక సినిమా ప్రమోషన్ కోసమో కానీ... ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ఓపెన్‌మైండెడ్‌గా మాట్లాడేస్తోంది.

English summary
Radhika Apte said that she enjoys working in all the regional film industries except Telugu. Radhika further explains that Telugu film industry functions in a male dominant and male chauvinistic setup and that actresses are treated very badly here.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu