twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాత ప్రెస్ మీట్ : మా సినిమాకుసెన్సార్ ఇవ్వనన్నారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ''కొత్త తరహా సినిమాలు చేసినప్పుడు ఇదివరకు ఇలాంటి చిత్రాలు వచ్చాయా అని సెన్సార్‌ అధికారులు అడుగుతున్నారు. ఇదివరకు వచ్చిన సినిమాలను పోలిన చిత్రాలనే తీయాలని సెన్సార్‌ బోర్డు కొత్త నిబంధన ఏమైనా పెట్టిందేమో చెప్పాలి''అన్నారు ఫణికృష్ణ సిరికి.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పాకశాల'. రాజ్‌కిరణ్‌, ఆర్‌.పి.రావు నిర్మించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ (చలనచిత్ర వాణిజ్య మండలి)లో 'పాకశాల' ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

    Telugu Movie Paakasala in censor trouble

    ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''హింస ఎక్కువగా ఉందని మా చిత్రాన్ని సెన్సార్‌ బృందం తిరస్కరించింది. ఇదివరకు ఇలాంటి సినిమాల్ని ఎవరైనా తీశారా? అని సెన్సార్‌ అధికారులు అడిగారు. పహేలీ, భక్త సిరియాళ లాంటి చిత్రాల్ని ఉదాహరణగా చెప్పినా సెన్సార్‌ బృందం, రివైజింగ్‌ కమిటీ మా చిత్రాన్ని తిరస్కరించాయి. మా సినిమా చూసిన నిర్మాతలు మాకు అండగా నిలుస్తామని మాటిచ్చారు. ఈ విషయమై పోరాటం చేయడంతో పాటు, ట్రైబ్యునల్‌కూ వెళ్లబోతున్నామ''న్నారు. కార్యక్రమంలో గురుకిరణ్‌, ఆర్‌.పి.రావు తదితరులు పాల్గొన్నారు.

    ఓ సారి ఈ చిత్రం ట్రైలర్ ఇక్కడ చూడండి...

    చిత్రం విషయానికి వస్తే...

    నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ ఇటీవల తొలి షెడ్యూల్‌ను పూర్తి చేశాం. రెండో షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నాం. హారర్‌, సస్పెన్స్‌, కామెడీ, థ్రిల్లర్‌ చిత్రమిది. ఇంతవరకు ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌తో సినిమాని నిర్మిస్తున్నాం. దర్శకుడు చక్కగా తెరకెక్కిస్తున్నారు. శ్రావణ్‌ అందించిన పాటలకు తప్పకుండా మంచి స్పందన వస్తుంది. వచ్చే నెల్లో ఆడియో విడుదల చేస్తాం'' అని అన్నారు.

    నిర్మాతలు రాజ్‌కిరణ్‌, ఆర్‌.పి.రావు మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను చివరి షెడ్యూల్లో వైజాగ్‌లో పూర్తి చేశాం. నటీనటులు కొత్తవారైనా చక్కగా నటించారు. ఖర్చుకు వెనకాడకుండా నిర్మించాం. దర్శకుడు చక్కగా తీర్చిదిద్దారు'' అని అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ ‘‘సాంకేతిక విలువలతో కూడిన సినిమా ఇది. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రాణం పోసింది. నిర్మాతలు సహకరించడంతో అనుకున్నదానికన్నా అద్భుతంగా తీయగలిగాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి'' అని అన్నారు.

    ఐశ్వర్య సినీ స్టూడియో పతాకంపై రూపొందుతోన్న సినిమా ‘పాకశాల'. అర్పిత, కీర్తి, విశ్వ, నివాస్‌, హరీష్‌, జగదీష్‌, వైజాగ్‌ ప్రసాద్‌ కీలక పాత్రధారులు. రాజ్‌కిరణ్‌, ఆర్‌.పి.రావు నిర్మాతలు. ఫణి కృష్ణ సిరికి దర్శకుడుఈ చిత్రానికి కెమెరా: భరద్వాస్‌ దాసరి, సంగీతం: శ్రవణ్‌, సాహిత్యం: హరీష్‌, ఆర్ట్‌: బాలు, రచన: గురుకిరణ్‌.

    English summary
    Censor Board in Hyderabad after watching the film made on cannabalism rejected to certify the film and asked the makers to go for tribunal. Makers have came to FILM CHAMBER PRODUCERS SECTOR COMMITTEE and requested for the support.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X