twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామా!!(కౌసల్యా సుప్రజా రామా స్మాల్ రివ్యూ)

    By Staff
    |

    Kousalya Supraja Rama
    'మై బాస్ డాటర్' అనే హాలీవుడ్ చిత్రానికి అప్పడెప్పుడో వచ్చి వెళ్ళిపోయిన నాగార్జున 'చంద్రలేఖ' కలిపేస్తే 'కౌసల్యా సుప్రజా రామా'రెడీ అయిపోయింది. అయితే కాపీ కొట్టడం అనేది మనకి కామన్ కాబట్టి ఈ విషయం వదిలేసి చూద్దామనుకున్నా సినిమాకుండే చాలా లక్షణాలు లేకుండా మరీ పాత కాలం డ్రామాలా నడవటం విసుగనిపించే ప్రక్రియే. అయితే డైలాగులు పేలటం,ఫస్టాఫ్ లో కామిడీ నవ్వించటం(సాధారణంగా తెలుగులో కామిడీలు నవ్వించవు కదా),ఛార్మీ హాట్ సాంగ్ ప్లస్ లుగా నిలుస్తాయి. అయితే టీవీల్లోనే ఇటువంటి కాన్సెప్ట్ లతో బోల్డు కథలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఆలోచించుకుని థియేటర్ వైపు అడుగు వెయ్యాలి(డబ్బులతో పని కదా).

    శ్రీరామ్(శ్రీకాంత్) ఓ అతి మంచి సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అతను ఓ రోజు కౌసల్య(గౌరీ ముంజల్) అనే అమ్మాయిని రౌడీల నుండి రక్షిస్తాడు (రౌడీలే మీరు చదివింది కరెక్టే). అయితే ఆ క్రమంలో ఆమె తలకు దెబ్బతగిలి కోమాలోకి వెళ్ళిపోతుంది. అయితే ఆ పరిస్ధితుల్లోకి పోయేముందు తన భర్త రవి(శివాజీ) అనే ఎవరికీ చెప్పద్దనే మాటతీసుకుంటుంది. ఇక ఆమెను రక్షించటానికి పది లక్షలు అవసరమై తన బాస్ (కోట)ని వేడుకుంటే ఆయనేమో నేను అమెరికా వెళ్తున్నాను ...వచ్చే దాకా నా ఇంటిని జాగ్రత్తగా చూడు అప్పుడు నీ సమస్య తీరుస్తానని అని ఎగ్జిట్ అవుతాడు. అప్పుడు ఆ ఇంటిలోకి షిప్ట్ అయిన మన శ్రీరామ్ కి సుప్రజ(ఛార్మీ) బాస్ కూతుర్నని ఎంట్రీ ఇస్తుంది.

    అలాగే గజనీలా తనను తాను మరిచిపోయే కొడుకు(శివారెడ్డి),కోట చెల్లి బావ (అపూర్వ,ఎల్భీ)తన కూతరుకి సంభందం కోసమని వచ్చి సెటిలవుతారు. తర్వాత గజనీ కి అప్పిచ్చిన కృష్ణభగవాన్, రోజూ లేటుగా వస్తూ ఉద్యోగం పోగొట్టుకున్న(హేమ) తిరిగి సాధించుకోవటానికి ఇలా ఒకరు తర్వాత మరొకరు వచ్చి సెటిలవుతారు. ఇంతలో మరో ట్వస్ట్ ఏంటంటే గౌరీముంజిల్ మరెవరో కాదు...ఆ ఇంటి ఓనర్ కోట పెద్ద కూతురు. ఛార్మికి అక్క. ఇక అక్కడనుండీ మన హీరో ...హాస్పటిల్ కెళ్ళి కోమాలో ఉన్నామెతో మాట్లాడుతూ ఛార్మీతో ప్రేమ పాటలు పాడుతూంటాడు. అప్పుడేం జరుగుతుంది. ఆ ఇంట్లోకి వచ్చిన వారందరి సమస్యలు హీరో ఎలా తీర్చాడన్నదే కథ.

    టిపికల్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా గా వచ్చిన ఈ సినిమాను గతంలో ఛార్మి(ఇంట్రడక్షన్ ఫిల్మ్) 'నీకు మనసిచ్చాను' తీసిన సూర్యతేజ అందించాడు. కమ్యూనికేషన్ గ్యాప్ తో కామిడీ పండించాలనే ప్రయత్నం కొంత వరకూ సఫలీకృతమైనా మరింతగా టేకింగ్,కెమెరా,ఎడిటింగ్ వంటి సాంకేతిక అంశాలలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుండునని అనిపిస్తుంది.

    అలాగే హీరో కేమీ సమస్య లేకపోవటమే ఈ సినిమాకున్న పెద్ద సమస్య. అలా కాకుండా అతనికొ తీరని ఇన్నర్ సమస్య ఉండి ఆ సమస్యను పరిష్కరించుకునే దిశలో ఆ ఇంటిలోకి ప్రవేశించటం ...అక్కడ నుండి మిగతా వారి సమస్యల్లో ఇన్వాల్వ్ అవుతూ అవి పరిష్కరించే దిశలో తానేంటో తెలుసుకుని తన సమస్యను తీర్చుకుంటే బాగుండేది.ఇక నటీనటుల్లో శ్రీకాంత్,గౌరీముంజెల్,ఛార్మీ అంతా రొటీన్ గానే చేసారు. అయితే ఛార్మి కాస్త రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసింది. ఇక సినిమాలో కొద్దో గొప్పో చెప్పుకోతగ్గ అంశమేదన్నా ఉందీ అంటే అవే డైలాగులు మాత్రమే.

    బ్రహ్మానందం కామెడీ యావరేజ్ గా ఉంటే,కృష్ణ భగవాన్,వేణుమాధవ్,అపూర్వ,శ్రీరామ్ ల కామెడీ వల్గారిటితో నిండి ఉంటుంది. ఇక ఈ సినిమా ఏ ఆఫ్షన్ లేకపోతే ఎన్నుకోవటం మేలు. ఎందుకంటే ఏ ఛానెల్ వాడో త్వరలో ఏ పండుగకకో సినిమా వేసేస్తాడు. థియేటర్ కే వెళ్ళి చూడాలనేంత సీన్ ఈ సినిమాకు లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X