For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రామానాయుడి సినీ జీవితపు అరుదైన ఫొటోలు

  By Srikanya
  |

  హైదరాబాద్‌: ప్రముఖ చలన చిత్ర నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. శతాధిక చిత్రాల నిర్మాతగా పేరొందిన రామానాయుడు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్నారు. భారతీయ భాషలన్నింటిలోనూ చిత్రాలు నిర్మించిన ఘనాపాఠి ఆయన.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  13 భాషల్లో 150కు పైగా చిత్రాలు నిర్మించిన రామానాయుడిని మూవీ మొఘల్‌గా పేర్కొంటారు. రామానాయుడు ప్రకాశంజిల్లా కారంచేడులో దగ్గుబాటి వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవమ్మలకు 1936 జూన్‌ 6న జన్మించారు. రామానాయుడు తండ్రి వ్యవసాయం చేసేవారు.

  ప్రముఖ చలన చిత్ర నిర్మాత దగ్గుబాటి రామానాయుడి హఠాన్మరణం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కన్నుమూశారన్న వార్త తెలిసి హతాశులైన పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు, అభిమానులు రామానాయుడు నివాసానికి చేరుకుంటున్నారు.

  అవార్డులు

  అవార్డులు

  తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. 2009లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు లభించింది. 2013లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది.

  నంది,మరియు జాతీయ ఉత్తమ చిత్రం

  నంది,మరియు జాతీయ ఉత్తమ చిత్రం

  రామానాయుడు తీసిన బెంగాలీ చిత్రం 'అసుఖ్‌' జాతీయ ఉత్తమ చలనచిత్రం అవార్డు గెలుచుకుంది.ఆయన తీసిన 'ప్రేమించు' సినిమాకు 5 నంది అవార్డులు లభించాయి.

  నంది,మరియు జాతీయ ఉత్తమ చిత్రం

  నంది,మరియు జాతీయ ఉత్తమ చిత్రం

  రామానాయుడు తీసిన బెంగాలీ చిత్రం 'అసుఖ్‌' జాతీయ ఉత్తమ చలనచిత్రం అవార్డు గెలుచుకుంది.ఆయన తీసిన 'ప్రేమించు' సినిమాకు 5 నంది అవార్డులు లభించాయి.

  లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు

  లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు

  దక్షిణాది చిత్ర ప్రముఖునిగా ఆయనకు ఫిల్మ్‌ఫేర్‌ లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు లభించింది. 12 మంది హీరోయిన్లు, ఏడుగురు సంగీత దర్శకులను చిత్రరంగానికి పరిచయం చేశారాయన. 1999లో బాపట్ల నుంచి తెదేపా తరఫున ఎంపీగా గెలుపొందారు. 2003లో బెస్ట్‌ పార్లమెంటేరియన్‌ పురస్కారం అందుకున్నారు.

  కృష్ణగారితో కలిసి

  కృష్ణగారితో కలిసి

  సూపర్ స్టార్ కృష్ణగారితో కలిసి మండే గుండెలు చిత్రం సమయంలో

  సెట్స్ పై

  సెట్స్ పై

  రామానాయుడు గరు..ప్రతిజ్ఞ పాలన చిత్రం సెట్స్ పై

  శ్రీ కృష్ణ తులాభారం సెట్స్ పై

  శ్రీ కృష్ణ తులాభారం సెట్స్ పై

  డి.రామానాయుడు గారు..ఎన్టీఆర్,కాంతారావు లతో కలిసి..

  ఎంతమందిని

  ఎంతమందిని

  21 మంది కొత్త దర్శకుల్ని, ఆరుగురు హీరోలను పరిచయం చేశారు.

  సేవలు

  సేవలు

  చిత్రపరిశ్రమకు సంబంధించి స్టూడియో, ల్యాబ్‌, రికార్డింగ్‌, డిస్ట్రిబ్యూషన్‌, ఎగ్జిబిషన్‌, పోస్టర్స్‌ ప్రింటింగ్‌, గ్రాఫిక్‌ యూనిట్‌ రంగాల్లో ఆయన సేవలందించారు.

  నవలా చిత్రాలూ..

  నవలా చిత్రాలూ..

  పలు నవలలకు చలన చిత్రాలుగా దృశ్యరూపమిచ్చిన ఘనత రామానాయుడిదే.

  తొలి విజయం

  తొలి విజయం

  జి.రామినీడు దర్శకత్వంలో 'అనురాగం' అనే చిత్రాన్ని నిర్మించి తొలి విజయాన్ని అందుకున్నారు.

  అఖండ విజయం

  అఖండ విజయం

  తన పెద్ద కుమారుడు సురేష్‌బాబు పేరున సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రారంభించి 1964లో ఎన్టీఆర్‌ కథానాయకుడిగా 'రాముడు-భీముడు' చిత్రాన్ని నిర్మించి అఖండ విజయాన్ని అందుకున్నారు. సినీ నిర్మాణ రంగంలో అడుగు ముందుకే వేశారు.

  నష్టాలు తర్వాత

  నష్టాలు తర్వాత

  అయితే ఆ తర్వాత విపరీతంగా నష్టాల పాలైన ఆయన 1971లో ప్రేమ్‌నగర్‌ చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రంపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఒక వేళ ఆ చిత్రం ఫ్లాప్‌ అయితే మళ్లీ సినీ రంగంలోకి అడుగుపెట్టనని, కారంచేడు వెళ్లి వ్యవసాయం చేసుకుంటానని సన్నిహితులతో అనేవారట. 'ప్రేమనగర్‌' విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించడంతో రామానాయుడు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

  ఎంకినాయుడు బావ సెట్స్ పై

  ఎంకినాయుడు బావ సెట్స్ పై

  శోభన్ బాబుతో కలిసి డా.డి రామానాయుడు గరు ..ఎంకి నాయుడు బావ సెట్ పై ఇలా

  జయప్రదతో

  జయప్రదతో

  డా.డి రామానాయుడు గారు ..జయప్రదతో కలిసి ఇలా..

  మండే గుండెలు లొకేషన్ లో

  మండే గుండెలు లొకేషన్ లో

  డా.డి రామానాయుడు గారు శోభన్ బాబు,జయసుధతో కలిసి ఇలా

  రావు గోపాల రావు గారితో

  రావు గోపాల రావు గారితో

  డా.డి రామానాయుడు గారు గుమ్మిడి, రావు గోపాల రావు గారితో కలిసి

  తన స్నేహితులతో

  తన స్నేహితులతో

  డా.డి రామానాయుడు గారు మురళి మోహన్ గరు, గిరి బాబు, ఆది శేషగిరి రావు గారితో కలిసి

  తన టీమ్ తో

  తన టీమ్ తో

  ప్రతిజ్ఞా పాలన క్రూ తో కలిసి డా.డి రామానాయుడు గారు

  వాణిశ్రీ తో ..

  వాణిశ్రీ తో ..

  డా.డి రామానాయుడు గారు ఇలా అప్పటి హీరోయిన్ వాణిశ్రీతో

  బొమ్మలు చెప్పిన కథ

  బొమ్మలు చెప్పిన కథ

  డా.డి రామానాయుడు గారు విజయ లలిత తో కలిసి సెట్స్ పై

  కృష్ణ, శోభన్ బాబుతో

  కృష్ణ, శోభన్ బాబుతో

  డా.డి రామానాయుడు గారు శోభన్ బాబు, విజయనిర్మల, కృష్ణ గారితో కలిసి

  మండే గుండెల సెట్ లో

  మండే గుండెల సెట్ లో

  డా.డి రామానాయుడు గారు శోభన్ బాబు, జయసుధ తో కలిసి

  లయోలా లో

  లయోలా లో

  పాఠశాల విద్యాభ్యాసం తర్వాత రామానాయుడు మద్రాస్‌లోని లయోలా కళాశాలలో చేరారు. చదువుకన్నా ఎక్కువగా సాంస్కృతిక కార్యక్రమాల మీదే ఆయనకు ధ్యాస ఉండేది.

  చీరాలకు వచ్చి..

  చీరాలకు వచ్చి..

  లయోలా కళాశాలలో చదువుకు స్వస్తి చెప్పి చీరాల చేరుకున్నారు. అయితే అక్కడ కూడా చదువుపై శ్రద్ధ పెట్టలేకపోయారు. చివరకు వ్యాపారం చేద్దామని నిర్ణయానికి వచ్చారు.

  వ్యాపారం

  వ్యాపారం

  దీంతో కారంచేడులో రైస్‌ మిల్లు వ్యాపారం ప్రారంభించారు. కొంతమంది మిత్రులతో కలిసి సినిమా డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారంలో అడుగుపెట్టారు.

  అలా ఆయన...

  అలా ఆయన...

  తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అక్కినేని నాగేశ్వరరావుతో సత్సంబంధాలు కొనసాగించారు.

  ఎక్కువ సమయం

  ఎక్కువ సమయం

  ఆయనతో పాటు ఆదుర్తి సుబ్బారావు, ఎస్వీ రంగారావు, గుమ్మడి వెంకటేశ్వరరావులతో ఎక్కువ సమయాన్ని గడిపేవారు. ఈ పరిచయాలతోనే ఆయనకు 'నమ్మిన బంటు' చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.

  వెంకటేష్...

  వెంకటేష్...

  రామానాయుడు మృతిపట్ల ఆయన చిన్న కుమారుడు, ప్రముఖ కథానాయకుడు వెంకటేశ్‌ మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తమ తండ్రి రామానాయుడు కన్నుమూశారని ఆయన తెలిపారు. కొద్దినెలలుగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారని తెలిపారు.

  అంతిమ సంస్కారాలు

  అంతిమ సంస్కారాలు

  రేపు మధ్యాహ్నం తర్వాత ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామన్నారు. ప్రజల సందర్శనార్థం రేపు రామానాయుడు స్టూడియోలో ఆయన పార్థివదేహాన్ని ఉంచుతామని వెంకటేశ్‌ తెలిపారు.

  English summary
  Multilingual Indian film producer Daggubati Ramanaidu (D Rama Naidu) passed away in Hyderabad on Wednesday afternoon, 18 February after a long battle with cancer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X