»   » సాయిధరం తేజ్ అరాచకం మీద అనసూయ కామెంట్... నిన్నటినుంచీ ఫేస్ బుక్ లో చర్చ (వీడియో)

సాయిధరం తేజ్ అరాచకం మీద అనసూయ కామెంట్... నిన్నటినుంచీ ఫేస్ బుక్ లో చర్చ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం విన్నర్. ఇటీవలే సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై, బేబి భ‌వ్య సమర్పణలో... న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమాలో అనసూయకు స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చింది. అయితే అప్పట్లో స్పెషల్ సాంగ్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించని ఈ భామ.., ఇప్పుడు మాత్రం సాయి ధరమ్ తో స్టెప్పులెయ్యటానికి అంగీకరించిందనగానే అంతా షాక్ తిన్నారు...

సాయి ధరమ్‌ తేజ్ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అనసూయ ఏకంగా 12 కేజీలు బరువు పెరిగిందని తెలిసింది. సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే ప్రత్యేక గీతంలో బొద్దుగా కనిపించాలని దర్శకుడు చెప్పడంతో అందుకు అనుగుణంగా అనసూయ తన ఆహారపు అలవాట్లు మార్చుకుని బొద్దుగా మారిందని చిత్ర వర్గాల సమాచారం. ఈ వీడియో, సినిమా పై మరికొన్ని విశేషాలు


స్పెషల్ సాంగ్ :

స్పెషల్ సాంగ్ :

అనసూయ ఇంతగా శ్రమించడానికి ప్రధాన కారణం వుందట. సినిమాలో తనపై చిత్రీకరించే ఐటమ్ సాంగ్ అనసూయ..అనసూయ.. అంటూ తన పేరుతో సాగుతుంది కాబట్టే ఆమె ఈ గీతం కోసం బొద్దుగా మారడానికి సిద్ధపడిందని చెబుతున్నారు. ఇటీవలే ఈ పాటను సాయి ధరమ్‌ తేజ్, అనసూయ పాల్గొనగా ఉక్రేయిన్‌ లో చిత్రీకరించారు. అనసూయ భారీ పారితోషికం తీసుకుని నటించిన ఈ స్పెషల్ సాంగ్ సినిమాకు హైలైట్‌ గా నిలుస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.


సాయి ధరమ్ తేజ్ అమేజింగ్:

సాయి ధరమ్ తేజ్ అమేజింగ్:

ఈ విషయాలు తెలుసుకున్న అనసూయ వీరాభిమాని ఒకరు లేటెస్ట్ గా అనసూయ సోషల్ మీడియాలో చాట్ చేస్తున్నప్పుడు హీరో సాయి ధరమ్ తేజ్ తో డ్యాన్స్ చేసినప్పుడు మీకెలా అనిపించిందని ప్రశ్నించినప్పుడు ఆమె ఆ ప్రశ్నకు వెరైటీగా సమాధానం ఇచ్చింది. ‘అబ్బో.. సాయి ధరమ్ తేజ్ అమేజింగ్ వెరీ డెడికేటెడ్ పర్సన్ డ్యాన్స్‌లో అతని స్పీడ్ అందుకోలేకపోయా' అని సమాధానం ఇచ్చింది.


షాకింగ్ కామెంట్స్:

షాకింగ్ కామెంట్స్:

‘విన్నర్' మూవీకోసం 10 రోజులు పని చేశానని, ఈ పది రోజుల్లో సాయి ధరమ్ తేజ్ ని చూస్తే మెగా వారసుడంటే ఎలా ఉంటాడో తనకు అర్ధం అయిందని షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు సాయి ధరమ్ తేజ్ డాన్స్ స్పీడ్ ముందు తాను నిలబడటానికి చాల కష్టపడవలసి వచ్చింది అన్న కామెంట్స్ కూడ చేసింది అనసూయ.


ప్రవర్తనలో చాల మార్పు :

ప్రవర్తనలో చాల మార్పు :

ఇది ఇలా ఉండగా ఈమధ్య కాలంలో అనసూయ ప్రవర్తనలో చాల మార్పు వచ్చింది అని చాలామంది దర్శక నిర్మాతలు కామెంట్స్ చేస్తున్నట్లు టాక్. దీనికి కారణం గతంలో తనదగ్గరకు వచ్చే దర్శక నిర్మాతలకు రకరకాల కండిషన్స్ తో చుక్కలు చూపించిన అనసూయ ఇప్పుడు తన దగ్గరకు వస్తున్న ప్రతి అవకాశాన్ని అంగీకరించే దిశలో అడుగులు వేస్తోంది అని అంటున్నారు.


అతని స్పీడ్ ను నేను అందుకోలేకపోయా:

అతని స్పీడ్ ను నేను అందుకోలేకపోయా:

ఈ పాట గురించి అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఫేస్ బుక్ లో అభిమానులతో లైవ్ చాట్ చేసిన అనసూయ.. తేజు డ్యాన్స్.. అతడి ఎనర్జీ అరాచకం అంటూ కామెంట్లు చేసింది. ''సాయిధరమ్ తేజ స్టన్నర్.. అమేజింగ్.. వెరీ డెడికేటెడ్ పర్సన్.. డ్యాన్సులో అతని స్పీడ్ ను నేను అందుకోలేకపోయా. విన్నర్ సినిమా కోసం నేను 10 రోజులు పని చేశాను.


బన్నీ మీద నెగెటివ్ కామెంట్స్:

బన్నీ మీద నెగెటివ్ కామెంట్స్:

ఈ పది రోజుల్లో ప్రాపర్ మెగా వారసుడంటే ఎలా ఉంటాడో చాలా దగ్గర నుంచి చూసి తెలుసుకున్నాను" అంటూ తేజును పొగిడేసింది అనసూయ. మొత్తానికి ఇంతకుముందు వపన్ సినిమాలో పాటకు నో చెప్పడం.. బన్నీ మీద నెగెటివ్ కామెంట్స్ చేయడం ద్వారా మెగా అభిమానుల్లో వచ్చిన వ్యతిరేకతను ఇప్పుడు తగ్గించే ప్రయత్నంలో పడ్డట్లుంది అనసూయ.


అనసూయ గ్లామర్:

అనసూయ గ్లామర్:

దీనికి కారణం రష్మీ అని అంటున్నారు. ఈమె తనకు వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా పరుగులు తీస్తున్న నేపధ్యంలో అనసూయ రష్మీ పోటీని గ్రహించి ఇలా మారిపోవడమే కాకుండా ఐటమ్ సాంగ్స్ కు కూడ సై అంటూ ఉండటంతో చాలామంది ప్రస్తుతం అనసూయ గ్లామర్ ను వాడుకునే ఎత్తుగడలు వేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న ఈ హాట్ యాంకర్స్ వార్ ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది..


విన్నర్ విశేషాలు :

విన్నర్ విశేషాలు :

రాబోతున్న ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి... మరిన్ని విశేషాలు దర్శకుడి మాటల్లోనే ``షూటింగ్ అంతా ముందుగా అనుకున్న ప్ర‌కారం సాగుతోంది. న‌వంబ‌ర్ 3 నుంచి 20 వ‌ర‌కు ఉక్రెయిన్‌లో పాట‌ల్ని తీశాం. సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ మీద రెండు పాట‌ల్ని, సాయిధ‌ర‌మ్‌ తేజ్‌, యాంక‌ర్ అన‌సూయ మీద ఒక పాట‌ను చిత్రీక‌రించాం. రాజు సుంద‌రం కొరియోగ్ర‌ఫీ చేశారు. రామ‌జోగ‌య్య‌శాస్త్రి, అనంత‌శ్రీరామ్‌, శ్రీమ‌ణి పాట‌ల‌ను రాశారు. ట‌ర్కీలోని ఇస్తాంబుల్‌లో క్లైమాక్స్‌కి సంబంధించిన యాక్ష‌న్ పార్ట్‌ను చిత్రీక‌రించాం.


బాహుబ‌లి ఫైట్ మాస్ట‌ర్ :

బాహుబ‌లి ఫైట్ మాస్ట‌ర్ :

బ‌ల్గేరియ‌న్ ఫైట్ మాస్ట‌ర్ క‌ల‌యాన్ ఆధ్వ‌ర్యంలో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించాం. `బాహుబ‌లి`లో మంచు కొండల్లో జ‌రిగే యాక్ష‌న్‌ ఎపిసోడ్‌ను చిత్రీకరించింది క‌ల‌యాన్ కావ‌డం విశేషం. డిసెంబ‌ర్ 6 నుంచి 22 రోజుల పాటు ఊటీ, బెంగుళూరులో షెడ్యూల్ జ‌రుగుతుంది. అక్క‌డ కీల‌క‌మైన టాకీ, యాక్ష‌న్ పార్టును తెర‌కెక్కిస్తాం. జ‌న‌వ‌రిలో బ్యాల‌న్స్ టాకీ, రెండు పాట‌ల‌ను చిత్రీక‌రిస్తాం.


ఫిబ్ర‌వ‌రి 24న:

ఫిబ్ర‌వ‌రి 24న:

దాంతో సినిమా మొత్తం పూర్త‌వుతుంది. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 24న చిత్రాన్ని విడుద‌ల చేస్తాం. సినిమాలోని ప్ర‌తి ఫ్రేమూ గ్రాండ్‌గా ఉంటుంది. సాయిధ‌ర‌మ్‌ తేజ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట చ‌క్క‌గా కుదిరింది. త‌మ‌న్ మంచి బాణీల‌నిస్తున్నారు. అబ్బూరి ర‌వి, శ్రీధ‌ర్ సీపాన ర‌చ‌న ఆక‌ట్టుకుంటుంది. వెలిగొండ శ్రీనివాస్ మంచి క‌థ‌నిచ్చారు`` అని తెలిపారు.


యువ‌కుడి పోరాటం:

నిర్మాత‌లు న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు మాట్లాడుతూ, ``త‌నకు జ‌న్మ‌నిచ్చిన తండ్రిని, మ‌న‌సిచ్చిన అమ్మాయిని గెలవ‌డం కోసం ఓ యువ‌కుడు పోరాటం చేస్తాడు. అందులో గెలిచి `విన్న‌ర్‌`గా ఎలా నిలిచాడనేది ఈ చిత్ర క‌థ‌. ఇప్ప‌టివ‌ర‌కు చిత్రీక‌రించిన విజువ‌ల్స్ చాలా బాగా వ‌చ్చాయి. మంచి లొకేష‌న్ల‌లో తెర‌కెక్కించాం. అలాగే త‌మ‌న్ చాలా మంచి సంగీతాన్నిచ్చారు. ఐదు పాట‌లు, ఒక బిట్ సాంగ్ ఉంటాయి. అన్ని వ‌ర్గాల వారికీ న‌చ్చేలా సినిమాను తీర్చిదిద్దుతున్నాం`` అని అన్నారు.


English summary
In the Facebook live chat, Anasuya was asked about her opinion on Sai Dharam Tej with whom she shared screen space in an item number for 'Winner'. 'Abbo...Sai Dharam Tej is a stunner...Very Dedicated Actor..I can't match-up to his speed in Dances,' she replied.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu