»   » ‘టెంపర్’కు అనుకూలంగా సెన్సార్ సర్టిఫికెట్

‘టెంపర్’కు అనుకూలంగా సెన్సార్ సర్టిఫికెట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘టెంపర్' మూవీ ట్రైలర్ చూసిన వాళ్లందరికీ సినిమాలో బీభత్సమైన హింస ఉంటుందేమో? కేవలం పెద్దలు మాత్రమే వెళ్లాల్సిన సినిమా ఏమో? ఒక వేళ సినిమాకు ‘ఎ' సర్టిఫికెట్ వస్తే ఫ్యామిలీతో వెళ్లి ఎంజాయ్ చేయడం కష్టమవుతుందే! అంటూ ఎన్టీఆర్ అభిమానుల్లో సందేహాలు ఉండేవి. అందుకే ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఎలా వస్తుందో? అని ఆసక్తిగా ఎదురు చూసారు ఫ్యాన్స్.

ఎట్టకేలకు ‘టెంపర్' సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు ‘యు/ఎ' సర్టిఫికెట్ జారీ చేసారు. సో... పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్‌ను తీసుకెళ్లి ఈ సినిమాను అందరితో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ‘టెంపర్' సినిమా రన్ టైం సుమారు 141 నిమిషాలు ఉంటుంది. అందులో ఫస్ట్ హాఫ్ 1 గంట 8 నిమిషాలు, సెకండాఫ్ 1 గంట 13 నిమిషాలు ఉండబోతోందని తెలుస్తోంది.


 Temper censor completed

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


‘టెంపర్' మూవీ ఈ నెల 13న గ్రాండ్‌గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రం భారీగా సంఖ్యలో థియేటర్లలలో విడుదలవుతోంది. ఓవర్సీస్ మార్కెట్లో దాదాపు 250 స్క్రీన్లలో ఈ చిత్రం విడుదల చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రెస్టాఫ్ ఇండియాతో కలిసి దాదాపు 1000 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు.


ఎన్టీఆర్, కాజల్, ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
The censor formalities of NTR’s Temper are now completed and the film has received an U/A certificate. With this, all the basic formalities have been wrapped up and the film is set for a massive release on February 13th.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu