»   »  సెంటిమెంట్: ‘టెంపర్’ ఫస్ట్ సీడీ ఆవిష్కరించారు!

సెంటిమెంట్: ‘టెంపర్’ ఫస్ట్ సీడీ ఆవిష్కరించారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా రంగంలో సెంటిమెంట్లను ఏ రేంజిలో ఫాలో అవుతారో కొత్తగా చెప్పక్కర్లేదు. తాజాగా ‘టెంపర్' విషయంలోనూ అదే జరిగింది. ఈ చిత్రం ఆడియో వేడుక జనవరి 28న ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆడియో సీడీ మాత్రం ఇప్పటికే ఆవిష్కరించేసారు. సోమవారం రథ సప్తమి కావడంతో ఈ పని చేసారు.

దీని గురించి నిర్మాత బండ్ల గణేష్ వెల్లడిస్తూ...‘రథసప్తమి. చాలా మంచి రోజు. అందుకే టెంపుల్ లో ఆడియో సీడీ రిలీజ్ చేసాం. ఆడియో రిలీజ్ వేడుక మాత్రం ఈ నెల 28న జరుగుతుంది. మమ్మల్ని ఆశీర్వదించండి' అంటూ ట్వీట్ చేసారు. జూ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్.

Temper First Audio CD is Out

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ చిత్రంలో తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ మాజీ భార్య, నటి సోనియా అగర్వాల్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ భామ తెలుగులో వచ్చిన ‘7/జి బృందావన్ కాలనీ' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సోనియా అగర్వాల్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. సినిమా చివర్లో ఓ 20 నిమిషాల పాటు ఆమె స్పెషల్ అప్పియరెన్స్ ఉంటుందని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ చిత్రం ఆడియో ఈనెల 28న విడుదల చేయడానికి నిర్మాత బండ్ల గణేష్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఆడియోకి నందమూరి బాలకృష్ణ వచ్చే అవకాశం ఉందని ఫిలింనగర్‌ సమాచారం. దీంతో నందమూరి అభిమానుల్లో సందడి వాతావరణం ఏర్పడుతుంది. అయితే బాబాయ్‌-అబ్బాయ్‌ని ఒకే వేదికపై చూడాలనేకునే అభిమానులు ఆరోజు కోసం వేచి చూస్తున్నారు.

ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాకు మ్యూజిక్ హైలెట్ అవుతుందని అంటున్నారు. ఫిబ్రవరి 12న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫుల్‌లెంగ్త్‌ కమర్షియల్‌, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.

English summary
NTR upcoming film Temper audio will be released on 28 of this month.But the makers have unvieled the first audio on Monday on the eve of Ratha Saptami. Producer Bandla Ganedh confirmed the news on twitter.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu