For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘టెంపర్’ మూవీ ప్రీ రిలీజ్ టాక్ అదిరిపోతోంది

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: సంక్రాంతి సంబరాలు, త్వరలో జూ ఎన్టీఆర్ హీరోగా ‘టెంపర్' మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాపై ప్రీ రిలీజ్ టాక్ మొదలైంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా జూ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీ లుక్ సినిమాపై అంచనాలు మరింత పెచేలా చేసాయి.

  దీనికి తోడు నిర్మాత బండ్ల గణేష్......సినిమాకు తనదైన రీతిలో ప్రచారం కల్పిస్తున్న్నాడు. ‘టెంపర్' మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అని సోషల్ మీడియా ద్వారా ప్రచారం ప్రారంభించారు. బండ్ల గణేష్ కు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సినిమాల నిర్మాత అనే పేరు ఉంది. అందుకే ఆయన్ను అంతా బ్లాక్ బస్టర్ గణేష్ అని పిలుస్తుంటారు. మరో వైపు ఎన్టీఆర్ అభిమానులు, ప్రేక్షకులకు కూడా సినిమా ఎప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  https://www.facebook.com/TeluguFilmibeat

  మరో వైపు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓ చానల్ ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని దక్కించుకుందని తెలుస్తోంది. 7.7 కోట్లకు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని ఆ చానల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టెనర్ ‘టెంపర్'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ టీజర్ నూతన సంవత్సర కానుకగా ఈ రోజు విడుదలైంది. ‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒకడు మీదపడితే దండయాత్ర...ఇది దయాగాడి దండయాత్ర' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ తో విడుదల చేసిన ఈ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

   Temper movie pre-release talk

  తాజాగా ఈ చిత్రం ఆడియో రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. జనవరి నెలాఖరులో ‘టెంపర్' ఆడియో వేడుక జరుపాలని చూస్తున్నట్లు టాక్. ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే....ఈ రోజు సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి. ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఫిబ్రవరి 5న సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.

  ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంటుగా, ఎంతో పవర్ ఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమా బేనర్ ప్రతిష్టను మరింత పెంచే సినిమా అవుతుంది. అలాగే ఎన్టీఆర్ గారి కెరీర్లో, పూరి జగన్నాథ్ గారి కెరీర్లో, నా కెరీర్లో ‘టెంపర్' బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న నమ్మకం నాకు ఉంది. ఈ నెల 20 వరకు జరిగే షెడ్యూల్ తో టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. మరో పక్క పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నాం' అన్నారు.

  ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్, జయప్రకాష్ రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమా ప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

  ఈ చిత్రానికి కథ: వక్కతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మకడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం: పూరి జగన్నాథ్.

  English summary
  Film nagar circles call Bandla Ganesh ‘Blockbuster’ producer because he claims all his movies to be blockbusters. Before release of all his movies Bandla took the twitter and boasts his heroes and calls his movies as Blockbusters.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X