Just In
Don't Miss!
- News
'డ్యాన్స్'పై ఆసక్తి.. ఊహించని మలుపులు తిరిగిన జీవితం.. లింగ మార్పిడి,మూడేళ్లుగా గ్యాంగ్ రేప్...
- Sports
పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లీనే అత్యుత్తమం.. జడేజా కూడా: శ్రీలంక పేసర్
- Finance
4 వారాల్లో అతిపెద్ద పతనం, ఇన్వెస్ట్ చేస్తున్నారా.. కాస్త జాగ్రత్త!
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎన్టీఆర్ ‘టెంపర్’ వర్కింగ్ స్టైల్ సూపర్ (ఫోటోస్)
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవలే విడుదలైంది. సినిమాను ఈ నెల 13న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సినిమా ఫస్ట్ లుక్, థియేట్రికల్ ట్రైలర్ విడుదలయినప్పటి నుండి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈచిత్రాన్ని వెస్ట్ గోదావరిలో పూరి జగన్నాథ్ స్వయంగా విడుదల చేయబోతున్నాడు. ఇందుకోసం ఆయన పాపుల డిస్ట్రిబ్యూటర్ సురేస్ మూవీస్‌తో జతకట్టినట్లు తెలుస్తోంది. ఈ జిల్లా రైట్స్ కోసం పూరి జగన్నాథ్ రూ. 2 కోట్ల 50 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
వీలైనన్ని ఎక్కువ థియోటర్స్ లో విడుదల అవుతున్న ఈ చిత్రం మొదటి షో హైదరాబాద్ భ్రమరాంబ థియోటర్ లో ఉదయం 5.07 నిముషాలకు విడుదల కానున్నదని సమాచారం. ఇప్పటికే నిర్మాత బండ్ల గణేష్ ఈ విషయమై ప్రకటన చుసారు. స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్...
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పూరి కాన్ఫిడెన్స్
తాను దర్శకత్వం వహించిన చిత్రాన్ని...పూరి ఇంత రేటు పెట్టి మరీ పూరి జగన్నాథ్ కొనడం హాట్ టాపిక్ అయింది. సినిమాపై ఆయనకు చాలా కాన్ఫిడెన్స్ ఉండబట్టే ఇలా చేసాడని అంటున్నారు.

అంచనాలు భారీగా
ఆడియో విడుదల తర్వాత ‘టెంపర్' సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రెస్పాన్స్ కు తగిన విధంగానే ఈ చిత్రాన్ని తొలిరోజు భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాత బండ్ల గణేష్ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎక్కువ థియేటర్లు
వెయ్యికిపైగా థియేటర్లు ఇప్పటికే బుక్ చేసినట్లు సమాచారం. మరో వైపు అమెరికాలోనూ ఈ చిత్రాన్ని 100కుపైగా స్క్రీన్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రొమాన్స్
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్. ఈ ఇద్దరి హధ్య చిత్రీకరించిన రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయంటున్నారు.

వక్కతం వంశీ
వక్కతం వంశీ అందించే కథలకు టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంది. టెంపర్ కూడా మంచి విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్ముతున్నారు.

ఓపెనింగ్స్
ఎన్టీఆర్ కెరీర్లో ఈచిత్రం అత్యధిక ఓపెనింగ్స్ సాధించే చిత్రంగా నిలుస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.