»   » టెంపర్: రామ్ గోపాల్ వర్మ చెప్పింది నిజమే!

టెంపర్: రామ్ గోపాల్ వర్మ చెప్పింది నిజమే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆ మధ్య ‘టెంపర్' సినిమా గురించి ఓ ట్వీట్ చేసి సంగతి తెలిసిందే. ‘టెంపర్' సినిమా చూసి తర్వాత ఉద్వేగం ఆపుకోలేక పోయాను. పెద్ద ఎన్టీఆర్....చిన్న ఎన్టీఆర్ ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపించింది' అంటూ వర్మ చేసిన కామెంట్స్ కాస్త వివాదాస్పదంగా ఉందనే వాదన సైతం వినిపించింది. వర్మ కావాలనే పబ్లిసిటీ కోసమే ఈ ట్వీట్ చేసారని అంతా లైట్ తీసుకున్నారు.

అయితే ఈ రోజు ‘టెంపర్' సినిమా చూసిన వాళ్లు మాత్రం.....వర్మ చెప్పింది నిజమే అంటున్నారు. వర్మ మాదిరిగానే చాలా మంది ఫ్యాన్స్ ఉద్వేగం ఆపుకోలేక పోయామని చెబుతున్నారు. ఆ రేంజిలో పెర్ఫార్మెన్స్ ఇరగదీసాడు ఎన్టీఆర్ అంటూ ఆకాశానికి ఎత్తేసారు. తాతకు ఏ మాత్రం తీసిపోని మనవడు అంటూ పొగడ్తలు గుప్పిస్తున్నారు. ఎన్టీఆర్ టెంపర్ లో తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఎక్కడా తగ్గలేదు.. డ్యాన్స్, ఫిజిక్, ఫైట్స్, డైలాగ్స్ అన్నింట్లో అదరగొట్టాడని అంటున్నారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Temper: RGV comments turned 100 % true

జూ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టెంపర్' చిత్రంపై విడుదలకు ముందు నుండే అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉండటంతో తొలి రోజు సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పైగా సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ రావడం కూడా కలిసొస్తుందని, హిట్ టాక్ వల్ల ఫ్యామిలీ ప్రేక్షకుల తాకిడి పెరుగుతుందని భావిస్తున్నారు.


ఎన్టీఆర్, కాజల్, ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
Ram Gopal Varma comments turned 100 % true with positive talk from all most all center for Temper movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu