»   » టాప్-5లో చోటు దక్కించుకున్న ‘టెంపర్’

టాప్-5లో చోటు దక్కించుకున్న ‘టెంపర్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' మూవీ బాక్సాఫీసు వద్ద విజయవంతంగా వారం రోజులు పూర్తి చేసుకోవడంతో పాటు ఎన్టీఆర్ కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డుల కెక్కింది. ఇక టాలీవుడ టాప్ 5 ఫస్ట్ వీక్ కలెక్షన్ల లిస్టులో కూడా ఈచిత్రం చోటు దక్కించుకుంది.

చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ కెరీర్లో అతిపెద్ద హిట్ రావడంతో అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు. టెంపర్ చిత్రం ఫస్ట్ వీక్ రూ. 34.50 కోట్ల షేర్ సాధించింది. ఎన్టీర్ కెరీర్లో ఇప్పటి వరకు ఏ చిత్రమూ ఈ రేంజిలో కలెక్షన్లు సాధించలేదు. ఈ మధ్య వరుస ప్లాపులతో సతమతమైన ఎన్టీఆర్ కు ఈ చిత్ర విజయం బూస్ట్ ఇచ్చినట్లయింది.


'Temper' in Top 5

వాస్తవానికి స్టార్ హీరోల సినిమాలు ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి ఇష్టడరు నిర్మాతలు. ఈ నెలలో సినిమాల బిజినెస్ చాలా డల్ గా ఉంటుంది. అయితే టెంపర్ మూవీ మాత్రం ఇందుకు భిన్నంగా మంచి కలెక్షన్లు సాధిస్తూ దూసుకెలుతోంది. సినిమా ప్రేక్షకులను రీచ్ అయ్యే విధంగా ఉంటే కలెక్షన్లు వాటంతట అవే వస్తాయని మరోసారి రుజువైంది.


ఇక పోతో ఫస్ట్ వీక్ కలెక్షన్ల విషయంలో ‘టెంపర్' మూవీ టాప్-3 పొజిషన్ దక్కించుకుంది. అత్తారింటికి దారేది, ఎవడు చిత్రాలు ఒకటి. రెండు స్థానల్లో ఉండగా, గోవిందుడు అందరి వాడేలే, సీతమ్మ వాకిట్లో సిరిమాల్లె చెట్టు చిత్రాలు నాలుగు, ఐదో స్తానాల్లో ఉన్నాయి. ఇక టెంపర్ బిజినెస్ పూర్తయ్యే వరకు ఎంత వసూలు చేసస్తుందనేది ఆసక్తికరంగా మారింది.


ఎన్టీఆర్, కాజల్, ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.'

English summary
‘Temper’ made 34.50 cr (share) in its first week and this is the best number for NTR throughout his career.
Please Wait while comments are loading...