»   » మా నాన్న త్రాగుడు చూసే...: తాగుబోతు రమేష్‌

మా నాన్న త్రాగుడు చూసే...: తాగుబోతు రమేష్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu
Thagubothu Ramesh about his Inspiration
మహానంది : అలా మొదలైంది చిత్రంతో తీరిక లేని నటుడుగా ఎదిగిన సీనీ హాస్యనటుడు తాగుబోతు రమేష్‌ . తన తాగుబోతు నటనతో తన ఇంటిపేరునే తాగుబోతులా మార్చుకున్న రమేష్ .... క్షణం తీరిక లేని జీవనంలో ఇంటికి వచ్చాక టీవీ, సీనిమాల ద్వారా వినోదం కోరుకొనే ప్రేక్షకుల ఆనందం స్వయంగా తెలుసుకోవడంతో ఎంతో సంతృప్తిని పొందామనిఅన్నారు. మహానంది పుణ్యక్షేత్రాన్ని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు ఆయన్ను పలకరించారు.

అనంతరం మీడియాతో రమేష్‌ మాట్లాడుతూ తన తండ్రి సింగరేణి కార్మికుడిగా ఉండేవారని, ఆయన నిత్యం మద్యం తాగి ఇంటికి తూలుతూ రావడం, కేకలు వేయడం వంటివి చిన్నప్పటి నుంచి తనకు అనుభవమేనన్నారు. అందుకే తాగుబోతు పాత్రల్లో మంచిగా హాస్యం పండుతుందని చెప్పారు. అంతకు ముందు తాను ఉత్సవాల సమయంలో చిన్నచిన్న ప్రదర్శనలు ఇచ్చేవాడినన్నారు.


2006 నుంచి కొన్నేళ్లపాటు సినిమాల్లో వేషాలకోసం కళ్లుకాయలు కాసేలాగా ఎదురుచూశానని, చివరకు జగడం సినిమాలో చిన్నపాత్ర దొరికిందన్నారు.కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మహాత్మా సినిమాతో మంచి గుర్తింపువచ్చిందని, అప్పటి నుంచి మంచి అవకాశాలు వచ్చాయన్నాను.

ఆ తర్వాత అలామొదలైంది సినిమాలతోపాటు సుమారు 100 సినిమాల్లో నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్నానన్నారు. ప్రస్తుతం ఇంటింటా అన్నమయ్య, రేసుగుర్రం, ఏమో గుర్రం ఎగురావచ్చు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ప్రేక్షకుల ఆదరణ ఉన్నన్నాళ్లు నటుడికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.

సినిమాల్లోకి రాక ముందు నేరెళ్ల మాజీ ఎమ్మెల్యే, మా మేనబావ అయిన కాసిపేట లింగయ్య వద్ద సూపర్‌వైజర్‌గా చేసేవాన్ని. నేను అందర్ని ఇమి చేసేవాన్ని. మిమిక్రీ కళాకారునిగా గుర్తింపు రావడంతో స్నేహితుల ప్రోద్బలంతో సినిమాల్లోకి వచ్చా. మొదటి చిత్రం 'జగడం' (హీరో స్నేహితుల్లో ఒకనిగా)

English summary
Taagau Bothu Ramesh says that his papular his Inspiration is his Father.Ramesh Ramilla, better known as Thagubothu Ramesh, is an Indian film actor and comedian who primarily works with Telugu cinema. He got the moniker "Tagubothu" as he portrayed several roles as a drunkard. He rose to prominence with films such as Mahatma, Ala Modalaindi, Pilla Zamindar and Ishq.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu