Just In
Don't Miss!
- Sports
ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన అజహరుద్దీన్ కలల లిస్టు ఇదే.. ఐపీఎల్, 4 సెంచరీలు సహా!!
- News
చర్చలు 120 శాతం ఫెయిల్.. 'ఉపా' చట్టాన్ని ప్రయోగిస్తారా? బ్రోకర్లతో చర్చలకు వెళ్లం.. రైతుల సంఘాల ఫైర్...
- Finance
ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘తాగుబోతు ఆర్జీవీ’...టార్గెట్ ఎవరు? (ఫోటోస్)
హైదరాబాద్: సినిమా రంగంలో సంచలనాలకు మారు పేరుగా, వివాదాలకు కేంద్ర బిందువుగా పేరు తెచ్చుకున్న వ్యక్తి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అందరూ ఆయన్ను షార్ట్ కట్‌గా ఆర్జీవి అని పిలుస్తుంటారు. ఈ మధ్య కాలంతో రామ్ గోపాల్ వర్మను టార్గెట్ చేస్తూ, పేరడీలు వేస్తూ పలు సినిమాలు వచ్చాయి. అలాంటిదే మరో సినిమా వచ్చింది.
ఆ సినిమా పేరు ‘తాగుబోతు'. ‘ఆర్జీవీ' అనేది సబ్ కాప్షన్. ఈ సినిమాలో హీరోగా తాగుబోతు రమేష్ నటిస్తున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై సెటైరిక్ గా ఈ సినిమా ఉంటుందా? అంటే కాదు కాదు... ఆర్జీవీ అంటే వ్యక్తి పేరు కాదు.. రమ్, జిన్, వైన్ అంటున్నారు సినిమా సభ్యులు. కన్నడ, తెలుగులో రూపొందిస్తున్నారు నిర్మాత ఎన్.ఎమ్.కాంతారాజ్. బి.ఎన్.ఎమ్ కంబైన్స్ పతాకంపై రూపొందుతోంది. మేఘనా పటేల్ నాయిక. ఈ సినిమా ఈ నెల 27 నుంచి మొదలు కానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ఈ సినిమా టైటిల్ లోగోను ఆవిష్కరించారు.
త్రిశూల్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం బెంగుళూరులోని కంఠీరవ స్టూడియోలో నెల రోజుల క్రితం ప్రారంభోత్సవం జరుపుకుంది. దర్శకుడు మాట్లాడుతూ నేను కన్నడలో ఆల్రెడీ రెండు సినిమాలు చేశాను. తాగుబోతు రమేష్ తో తెలుగులో తొలి సారి చేస్తున్నాను అని అన్నారు. తమిళంలో కరుణాస్ తో తాను ఇంతకు ముందే ఓ సినిమా చేశానని, తెలుగులో తొలి సినిమా ఇదేనని నిర్మాత చెప్పారు.

తాగుబోతు రమేష్
ఫుల్ లెంగ్త్ హీరోగా నటిస్తున్న సినిమా ఇదేనని తాగుబోతు రమేష్ చెప్పారు.

అలా బీజీ అయిపోయాడు
అలా మొదలైంది' చిత్రంతో తాగుబోతు పాత్రలో అందరినీ మెప్పించిన రమేష్....ఆ తర్వాత వరుస అవకాశాలతో స్టార్ కమెడియన్ల జాబితాలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఊపిరిసలపనంత బిజీ అయిపోయాడు.

కెరీర్ ప్రారంభం
తాగుబోతు రమేష్ 2005లో 'జగడం' చిత్రం ద్వారా కెరీర్ ప్రారంభించాడు. మహాత్మ, భీమిలి కబడ్డీ జట్టు, ఈ వయసులో చిత్రాల్లో నటించాడు. అయితే ఈ చిత్రాలు రమేష్‌కు పెద్దగా గుర్తింపు తేలేదు. నాని హీరోగా నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'అలా మొదలైంది' చిత్రంలో క్లైమాక్స్ సీన్లో రామేష్ పోషించిన తాగుబోతు పాత్ర సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. ఈ ఒక్క సినిమాతో తాగుబోతు రమేష్‌గా పాపులరయ్యాడు.

తాగుబోతు యాక్టింగ్ అలా
రమేష్‌ది కరీంనగర్ జిల్లా గోదావరిఖని. తండ్రి సింగరేణి బొగ్గుగనుల్లో కార్మికుడు. ఆయన నిత్యం మద్యం తాగి ఇంటికి తూలుతూ రావడం, కేకలు వేయడం వంటివి చిన్నప్పటి నుంచి చూసిన రమేష్.......తాగుబోతులను ఇమిటేట్ చేయడం ప్రాక్టీస్ చేసే వాడు. నటనపై ఆసక్తితో సినిమా రంగం వైపు అడుగులు వేసి సక్సెస్ అయ్యాడు.