Don't Miss!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
థమన్ లీక్స్.. గాడ్ ఫాధర్ గురించి సర్ప్రైజ్ ఎలిమిమెంట్స్ లీక్.. సల్మాన్ తో కలిసి ఆ భామ?
మెగాస్టార్ చిరంజీవితో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కలిసి నటిస్తున్నారని, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయం మీద థమన్ లీకుల ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

రీ ఎంట్రీ ఇచ్చి
ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి సైరా నరసింహారెడ్డిమొ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసారు. ప్రస్తుతం అపజయం ఎరగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఆచార్య సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ తేజ్ కూడా సినిమా మీద అంచనాలు పెరగడానికి కారణం అవుతున్నారు.

పాత్ర చిన్నది అని
ఈ సినిమాలో మొదట ఆయన పాత్ర చిన్నది అని ప్రచారం జరిగినా ఆయన కోసం పూజ హెగ్డే ని కూడా సినిమాలో భాగం చేయడంతో ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర కూడా పెద్దదే అనే సంకేతాలు ఇచ్చినట్టు అయింది. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ఫిబ్రవరి నెలలో విడుదల కావాల్సి ఉంది. ఇక చిరంజీవి మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

షూట్ లో బిజీగా
తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ని సంప్రదించినట్లు ఆ మధ్య ప్రచారం జరింది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో సల్మాన్ ఖాన్ నటించబోతున్నారని తెలుస్తోంది.. ఈ సినిమా గాడ్ ఫాదర్ పేరుతొ విడుదల కానుండగా లూసిఫర్ ఒరిజినల్ వెర్షన్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ పాత్రలో నటించారు. సల్మాన్ ఖాన్ పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రను తెలుగులో పోషించబోతున్నారు అని అంటున్నారు.

షూట్ లో బిజీగా
మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' విడుదలకు సిద్ధమవుతోండగా ఇప్పుడు ఆయన 'గాడ్ ఫాదర్' షూట్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ రీమేక్. అయితే ముందు నుంచి కూడా తెలుగు వెర్షన్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రను ఎవరు పోషిస్తారనే దానిపై సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. చాలా మంది పేర్లు బయటకు రాగా అందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పేరు కూడా ఉంది.

తమన్ లీక్స్
అయితే ఈ సినిమాలో సల్మాన్ ప్రత్యేక పాత్రలో కన్పించబోతున్నట్టు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రివీల్ చేశాడు. ఒక మీడియా పోర్టల్ ఇంటర్వ్యూలో థమన్ మాట్లాడుతూ చిరంజీవి-సల్మాన్ ఖాన్ కలిసి డ్యాన్స్ చేయడం అంటే దానికి కొంత ప్రత్యేకతను జోడించాల్సిన అవసరం ఉందని, అందుకే మేకర్స్ బ్రిట్నీ స్పియర్ ను సంప్రదించారని చెప్పారు. దీంతో సల్మాన్ ఈ చిత్రంలో తెలుగు మెగాస్టార్‌తో కలిసి స్టెప్పులేయడమే కాక అంతర్జాతీయ పాప్ సింగర్ బ్రిట్నీ కూడా పాట పాడబోతోందని క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాను ఎం వి ప్రసాద్ నిర్మిస్తున్నారు.