మహేష్ బాబు ‘ఆగడు’ : తమన్ హాట్రిక్!
మహేష్ బాబుతో మాత్రమే కాదు...ఇటు సంగీత దర్శకుడు శ్రీను వైట్లతో కూడా మూడోసారి కలిసి పని చేయబోతున్నాడు తమన్. ప్రస్తుతం తమన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడిగా కొసాగుతున్నాడు. ఈయనతో సినిమా చేయడాన్ని ఇప్పుడు కొందరు హిట్ సెంటిమెుంటుగా కూడా భావిస్తుండటం గమనార్హం.
కాగా...ఆగడు సినిమాలో మహేష్ బాబుతో రొమాన్స్ చేసే హీరోయిన్ ఎవరు? అనే విషయమై ఫిల్మ్ నగర్లో చర్చ మొదలైంది. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమాలో తమన్నాను హీరోయిన్‌గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం అఫీషియల్‌గా ఖరారు కావాల్సి ఉంది.
దూకుడు సినిమాను మహేష్ బాబు ఇమేజ్‌కు తగిన విధంగా పూర్తి స్థాయి కమర్షియల్ అంశాలతో వినోదాత్మకంగా రూపొందించిన శ్రీను వైట్ల....'ఆగడు' స్క్రిప్టు తన గత సినిమాలకు వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications












