»   » అల్లాడిపోయేవాడు: పవన్ కళ్యాణ్ గురించి తమ్ముడు డైరెక్టర్ చెప్పిన షాకింగ్ విషయాలు!

అల్లాడిపోయేవాడు: పవన్ కళ్యాణ్ గురించి తమ్ముడు డైరెక్టర్ చెప్పిన షాకింగ్ విషయాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి 'తమ్ముడు' మూవీ డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ ఇటీవల ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గురించి అభిమానులకు తెలియని ఎన్నో విషయాలు ఆయన బయట పెట్టారు.

పవన్ కళ్యాణ్ చాలా షై పర్సన్ అని.... తనకు కంఫర్టుగా ఉండేవారు లేకుంటే కారు దిగి సెట్లోకి కూడా రాలేడని, ఆయన లాంటి వ్యక్తి రాజకీయాలకు అస్సలు సరిపోడవని, తనకు పర్సనల్ గా ఆయన రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని తెలిపారు. పవన్ గురంచి ఇంకా చాలా విషయాలు చెప్పుకొచ్చారు అరుణ్ ప్రసాద్.

పవన్ జడ్జిమెంట్ బావుండేది

పవన్ జడ్జిమెంట్ బావుండేది

తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి ఇలా కొత్త డైరెక్టర్లతో వరుస హిట్లు కొట్టడానికి కారణం.... పవన్ కళ్యాణ్ జడ్జిమెంటే అని, అప్పట్లో ఆయన ఏదైనా సీన్ గురించి గానీ గెస్ చేస్తే షూట్ షాట్ గా సక్సెస్ అయ్యేదని, జనాల్లో ఏది బాగా పాపులర్ అవుతుందో చాలా బాగా గెస్ చేసే వాడని తెలిపారు. ఖుషి వరకు పవన్ జడ్జిమెంట్ రైట్ ట్రాక్ లో వెళ్లింది. తర్వాత గాడి తప్పింది. మణిరత్నం లాంటి వారైనా కొన్ని సందర్భాల్లో గాడి తప్పుతారని అరుణ్ ప్రసాద్ తెలిపారు.

అప్పట్లో ఇన్ని బిల్డప్పులు లేవు

అప్పట్లో ఇన్ని బిల్డప్పులు లేవు

తమ్ముడు సినిమా చేసే సమయంలో పవన్ కళ్యాణ్ అందరితో చాలా క్లోజ్ గా ఉండే వాడు. మేం కింద కూర్చుంటే ఆయన కూడా కింద కూర్చునే వాడు. అసిస్టెంట్ డైరెక్టర్లందరూ ఆయన్ను నువ్వు నువ్వు అనే మాట్లాడేవారు. ఇపుడు అరకిలోమీటర్ దూరంలో ఉండి బాబు బాబు అని మాట్లాడుతున్నారో తెలియదు కానీ... అపుడు అందరితో అంత కంఫర్టు ఉండేవారు. నాకు తెలిసి కళ్యాణ్ ఇప్పటికీ అంతే. పక్కన సెటప్ ఏమైనా మారి ఆయన చుట్టూ అలాంటి బిల్టప్ లాంటి వాతావరణం క్రియేట్ చేసారో తెలియదు కానీ.... పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి అని అరుణ్ ప్రసాద్ తెలిపారు.

విజయ్ ఆయనకు పెద్ద ఫ్యాన్

విజయ్ ఆయనకు పెద్ద ఫ్యాన్

తెలుగులో ‘తమ్ముడు' తీసిన తర్వాత అదే మూవీని తర్వాత విజయ్ తో తమిళంలో చేసాం. అక్కడ కూడా ఆ సినిమా మంచి హిట్టయింది. విజయ్ పవన్ కళ్యాన్ కి పెద్ద ఫ్యాన్స్. ఎప్పుడైనా చెన్నై నుండి కళ్యాణ్ కి ఫోన్ లో మాట్లాడేప్పుడు ఒక్కసారి వాయిస్ వినిపించవా అని స్పీకర్ పెట్టించుకునేవాడు. అప్పట్లో పవన్ కళ్యాణ్ అంటే విజయ్ చిన్న పిల్లాడిలా ఎగ్జైట్ అయ్యేవాడు. అప్పటికి కళ్యాణ్ రెమ్యూనరేషన్ కంటే విజయ్ రెమ్యూనరేషన్ 3 రెట్లు ఎక్కువ. తమిళనాడులో ఉన్న పెద్ద హీరోలంతా పవన్ కళ్యాణ్ అభిమానులే. విజయ్, అజిత్, విక్రమ్, సూర్య లాంటి వారు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టపడేవారు అని అరుణ్ ప్రసాద్ తెలిపారు.

సొంతగా అప్పుడే కారు కొన్నాడు

సొంతగా అప్పుడే కారు కొన్నాడు

తొలి ప్రేమ సక్సెస్ తర్వాత పవన్ కళ్యాణ్ సొంతగా సాంట్రో కారు కొనుకున్నాడు. సెల్ఫ్ డ్రైవింగ్ అంటే ఆయనకు చాలా ఇష్టం. అందరినీ తన కారులో స్వయంగా దించి వెళ్లేవారు అని అరుణ్ ప్రసాద్ తెలిపారు.

చిరంజీవితో పవన్ కళ్యాణ్ సినిమా చేయాలనుకున్నారు

చిరంజీవితో పవన్ కళ్యాణ్ సినిమా చేయాలనుకున్నారు

పవన్ కళ్యాణ్ నటుడు అవ్వాలని అనుకోలేదు. ఆయన డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. చిరంజీవి గారితో సినిమా చేయాలనుకున్నారు. అప్పట్లో ఆయనతో డాక్యుమెంటరీ తీయాలనుకున్నాడు. అన్నయ్యకు కథలు కూడా చెప్పాడు. కానీ చిరంజీవి క్రియేటివ్ సైడ్ వద్దని ఆర్టిస్ట్ సైడ్ వెళ్లమని చెప్పడంతో ఇటు వైపు వచ్చారని అరుణ్ ప్రసాద్ తెలిపారు.

రొమాంటిక్ సీన్లంటే అల్లాడిపోయేవాడు

రొమాంటిక్ సీన్లంటే అల్లాడిపోయేవాడు

పవన్ కళ్యాణ్ బేసిగ్గా షై పర్సన్. మనం ఏదైనా అడగ్గానే వెంటనే చెప్పలేడు. షూటింగుకు కారులో రాగానే తనకు కంఫర్టుగా ఉన్న ఎవరైనా చేయి పట్టుకుని నచుకుంటూ తీసుకొచ్చి సెట్లో వదిలేస్తే గానీ ఉండలేడు. రొమాంటిక్ సీన్లు చేసే సమయంలో అయితే అల్లాడి పోయేవాడు. బేసిగ్గా ఆయన అమ్మాయిలతో ఫ్రెండ్లీగా ఉండే టైపు కాదు. ఈజీ గోయింగ్ కాదు.

అన్నయ్య, వదిన అంటే ప్రాణం

అన్నయ్య, వదిన అంటే ప్రాణం

పవన్ కళ్యాణ్ కి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. అన్నయ్య అంటే ప్రాణం. వాళ్ల వదిన అంటే ప్రాణం. అమ్మంటే ఇష్టం. తమ్ముడు సినిమాలో చేతికి దెబ్బు తాకితే హీరోయిన్ తినిపించే ఓ సీన్ వాళ్ల వదిన ఇన్స్ స్పిరేషన్ తోనే చేసానని చెపేవాడు అని అరుణ్ ప్రసాద్ చెప్పుకొచ్చారు.

రాజకీయాలకు పనికి రాడు

రాజకీయాలకు పనికి రాడు

నాకు పర్సనల్ గా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ కి ఒకరు అంటే పడే ఓపిక ఉండొచ్చు. కానీ తిరిగి అనలేడు. పాలిటిక్స్ లో ఫిజికల్ ఫైట్ కంటే ఓరల్ ఫైట్ లో గెలిచినోడే కనిపిస్తాడు అని అరుణ్ ప్రసాద్ అన్నారు.

ఓరల్ ఫైట్ పవన్ కళ్యాణ్ జన్మలో గెలవలేడు

ఓరల్ ఫైట్ పవన్ కళ్యాణ్ జన్మలో గెలవలేడు

పవన్ కళ్యాణ్ ఓరల్ ఫైట్ విషయంలో జన్మంతా కూడా గెలవడు. అవతలోడు ఓరేయ్ అని తిట్టినా మీరు మర్యాదగా మాట్లాడండి అనే టైపు. అలాంటిది రాజకీయాల్లో పనికిరాదు. తన నేచర్ కి సస్టేన్ కాలేడు. ఆయన హ్యాపీగా సినిమాలు చేసుకోవాలనేది నేను ఇచ్చే సజెషన్ అని అరుణ్ ప్రసాద్ అన్నారు.

పొల్యూట్ అవ్వాలి

ఆయన ఫ్యాన్స్ వల్లే రాజకీయాల్లోకి వచ్చాడు. మనం రోడ్డు మీద వెలుతూ అది చేద్దాం ఇది చేద్దాం... ప్రశ్నిద్దాం అని అంటే ఎవడ్రా నువ్వు అంటారు. ప్రశ్నిద్దాం అంటే వినే వారంతా నీ ఫ్యాన్సే. వాళ్లు నువ్వు సినిమాలు చేయకపోతే పొలిటికల్ గా ఫ్యాన్స్ ఉండరు. రాజకీయాల్లోకి వద్దామనుకున్న వారు పొల్యూట్ అవ్వకుండా ఉండలేరు. పొల్యూట్ అవ్వాలి. పొల్యూట్ అవ్వకంటే పాలిటిక్స్ కాదు అని అరుణ్ ప్రసాద్ అన్నారు.

English summary
Thammudu director Arun Prasad has to share about Power Star Pawan Kalyan personal details. Check out full details here.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu