twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇట్లు మీ సి. జోసెఫ్ విజయ్: మెర్సల్ పై విజయ్ కృతజ్ఞత లేఖ

    |

    వివాదల మధ్య విడుదలైన తమిళ చిత్రం మెర్సల్ కలెక్షన్ల రికార్డు సృష్టిస్తోంది. ఈ చిత్రంలో జీఎస్టీపై ఘటన డైలాగ్ లు ఉండడంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ చిత్ర విడుదలను వ్యతిరేకించాయి.మెర్సల్' మూవీ కలెక్షన్ల పరంగానే కాకుండా కాంట్రవర్సీగా కూడా దూసుకుపోతోంది. ఈ సినిమాలో జీఎస్టీ, నోట్ల రద్దు వంటి వాటిని విమర్శించిన తీరు, బిజెపి నాయకులకు ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో డైరెక్ట్‌గా సినిమాపై అటాక్‌కి దిగారు కొందరు బిజెపి నాయకులు. ఆ నాయకులు సృష్టించిన హడావుడితో ఈ సినిమాలో ఉన్న విషయం అందరికీ చేరింది. సినిమాలో చూపించింది మంచి విషయమే కదా! అంటూ కమల్ హాసన్, రజినీకాంత్ వంటి వారంతా మెర్సల్‌కి మద్దతు తెలిపారు.

    Recommended Video

    Mersal/Adirindi Trailer : Record Breaking Likes
     తొలి ఐదు రోజుల్లోనే

    తొలి ఐదు రోజుల్లోనే

    ఈ చిత్రం తొలి ఐదు రోజుల్లోనే తమిళనాడులో 84 కోట్లు వసూళ్లు చేసింది. ఇప్పటి వరకు ఉన్న 75.2కోట్ల రజనీకాంత్ కబాలి రికార్డు ఈ సినిమా బ్రేక్ చేసింది. మెర్సల్ మూవీ విజయ్ నటజీవితంలో పెద్ద హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు మెర్సల్ 170 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూనే ఉంది...

    ఘన విజయం సాధించింది

    ఘన విజయం సాధించింది

    ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా మెర్సల్ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రం మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 170 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మెర్సల్ ను బ్లాక్ బస్టర్ హిట్ చేసిన అభిమానులకు తన చిత్రానికి మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ విజయ్ ఓ బహిరంగ లేఖ రాశారు.

    ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు

    ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు

    దీపావళి పండుగని పురస్కరించుకుని విడుదలైన మెర్సల్ సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మీ ఆదరణతో ఈ చిత్రం విజయవంతమైన చిత్రంగా నిలిచింది. అయితే ఎంత గొప్ప విజయం అందుకుందో, అంతే వివాదం కూడా ఈ సినిమాకి తోడైంది.

    వారందరికీ నా కృతజ్ఞతలు

    వారందరికీ నా కృతజ్ఞతలు

    చిత్ర పరిశ్రమలోని పెద్దలు, నా స్నేహితులు, జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు, మీడియా, నా అభిమానులు ఈ వివాదం విషయంలో మద్ధతుగా నిలిచారు. ఈ సినిమాకు మద్ధతు తెలిపిన వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు...''అని విజయ్ లేఖ రాశారు. ఆయన విడుదల చేసిన లేఖను ఓ అభిమాని ట్విట్టర్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    జీసస్ సేవ్స్' అని హెడ్డింగ్

    జీసస్ సేవ్స్' అని హెడ్డింగ్

    అయితే ఈ వివాదానికి కారణమైన వారి గురించి ఒక్క మాట కూడా ఈ లేఖలో తెలపలేదు విజయ్. ఇక్కడే అందరికీ అనుమానాలు వస్తున్నాయ్. 'జీసస్ సేవ్స్' అని హెడ్డింగ్ పెట్టడం, 'సి. జోసెఫ్ విజయ్' అంటూ పూర్తి పేరుని ఈ లేఖలో రాయడం చూస్తుంటేనే.. తనపై కుల విమర్శలు చేసిన బిజెపి నేతకి తగిలేలా లేఖ లిఖించాడని అందరూ అనుకోవడం విశేషం.

    English summary
    Vijay has released an official statement to thank everyone for supporting Mersal and making is successful at the box office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X