»   » అందుకే మహేష్ మూవీ నుండి తప్పుకున్నా: రకుల్ ప్రీత్ సింగ్

అందుకే మహేష్ మూవీ నుండి తప్పుకున్నా: రకుల్ ప్రీత్ సింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు నెక్ట్స్ మూవీ ‘బ్రహ్మోత్సవం'. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ జులై నుండి ప్రారంభం కానుంది. సినిమాకు రకుల్ ప్రీత్ సింగ్‌ లీడింగ్ హీరోయిన్‌గా ఎంపిక చేసినప్పటికీ ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. అయితే ఈ విషయమై రకుల్ ప్రీత్ సింగ్ తొలిసారిగా నోరు విప్పారు.

‘మహేష్ బాబు సినిమా కోసం నేను డేట్స్ ఇచ్చిన మాట వాస్తవమే. ప్రస్తుతం నేను చరణ్ మూవీతో బిజీగా ఉన్నాను, మరికొన్ని రోజుల్లో ఎన్టీఆర్ మూవీ మొదలవుతుంది. వీటి తర్వాత నెల డేట్స్ ఇచ్చాను. కానీ బ్రహ్మోత్సవం టీం జులైలోనే కావాలన్నారు. జులైలో నాకు ఇతర సినిమాల షూటింగ్స్ ఉన్నందున తప్పుకోక తప్పలేదు' అని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు.

That’s why I’ve opted out: Rakul Preet Singh

బ్రహ్మోత్సవం సినిమా విషయానికొస్తే...
సినిమా షూటింగ్ జులై 10న మొదలు కానుంది. నాన్ స్టాప్ షూటింగ్ ప్లాన్ చేసారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్లు సమంత, కాజల్, ప్రణీత నటిస్తున్నారు.

ఇప్పటికే ఆడియో, రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసారు. అన్నిఅనుకున్నట్లు జరిగితే డిసెంబర్ 18న ఆడియో విడుదల చేసి, జనవరి 8, 2016న సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పని చేస్తారు. తోట తరణి ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

English summary
“I’ve give dates to Mahesh Babu’s film for a later month. Now that I’m busy with Charan’s movie and then Jr NTR’s film will start in a month, I can’t pull dates for Mahesh because Brahmotsavam team wanted dates from July itself. That’s why I’ve opted out”, said Rakul Preet.
Please Wait while comments are loading...